సబ్ ఫీచర్

గోడలకి చెవులే కాదు కళ్లూ వుంటాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోడలకి చెవులు వుంటాయి. మన పడగ్గది గోడలు పక్కింటి ఆవిడ చెవులు లాం టి మాటలకు నూకలు చెల్లాయి. కాలం మారింది. వర్తమానంలో మన బాత్‌రూములకు మరుగుదొడ్లకు, దుస్తులు మార్చకొన గదులకు కెమేరాలు మన కంట పడకుండా దాక్కొని ఉంటున్నాయి. మన దేశంలో ఇవి కొంచెం తక్కువ గాని, అమెరికా లాంటి దేశాలలో ఎప్పుడో రంగ ప్రవే శం చేశాయి. పోయినవారం అమెరికాలో ఫ్లారి డా పోలీసులు ఈ విషయంలో అలర్టుగా ఉండమని జనాల్ని హెచ్చరికలు జారీ చేశారు. హోటల్స్‌లో దిగంగానే ఒక చూపు గోడలమీద, సీలింగు మీద వెయ్యా లి. టాయిలెట్స్‌లోకి బాత్‌రూమ్సులోకి పోయినపుడు ‘హుక్కు లు’ అంటే కొక్కేలు- చిన్న గుబ్బ లు- అందం కోసం అమర్చినట్లు వుం టా యి. అలాగే మీరు రెడీమేడ్ షాపుల్లోకి పోయి దుస్తులు మార్చుకొనే గదులు- వీటినే ఛేంజీ రూములు అంటారు- అద్దం గట్రా సదుపాయాలు వుంటాయి గాని హుక్కు లు సీలింగు గుబ్బలు వాటికి చిన్న బొడిపెలు ఉంటాయేమో చూసుకోవాలి. ఇవి మీ ‘ఫేట్’నే మార్చేస్తాయి. ఇవన్నీ మా డ్రన్ ట్రెండ్స్ కానీ, ఈ హు క్కుల లోపల అతి బుల్లికెమెరాలు అమర్చి వుంటాయి. తలుపులు వేసేసుకున్నాము అనుకొని ధైర్యం గా.. కూనిరాగాలతో టబ్‌లలో దిగుతే ఈ దొంగ నేత్రాలు మీ నగ్న సౌందర్యాన్ని- ఇంకా ప్రైవేటు శృం గార కార్యకలాపాల్ని సినిమా తీసి అట్టే పెట్టేసుకుంటాయి. ఆనక, సదరు జీనియస్ ఈ బుల్లి కెమెరాలని తీసి పిప్పరమెంటు బిళ్ళ లు పడేసుకున్నట్లు జేబులో పడేసుకుపో యి కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేసేసుకుని ఆనక ఏమి జరుగుతుందో.. అది తెలియని అమాయకులు ఎక్కడా వుండరుకదా?
ఈ బటన్ కెమేరాలు, ఇప్పు డు చాలా చవుకగా ‘ఆన్‌లైన్’ లో బుక్ చేసేసుకోవచ్చునంట. అమెరికాలో వీటి బ్యాటరీ లైఫ్ రెండు లేదా రెండున్నర గంటలే- కాని గూఢచారి పనికి బ్లాక్‌మెయిలింగ్‌కి పనికివస్తున్నాయి. యువతి యువకులే గదా మన సంఘం యొక్క రేపటి వెనె్నముకలు. ఇంటర్నెట్, పార్కులలో వీరు దూరి పొదరింట దూరినట్లు సరసాలు ఆడుకుంటే, దీనే్న మాడ్రన్ లవ్ అంటారుట- అదంతా యూ ట్యూబ్ లో బట్టబయలు అయిపోతుంది. ఈ రోజుల్లో కెమెరా కళ్ళు మరీ ఎక్స్‌రే కళ్ళు అయిపోయాయి! అంచేత, హుక్కు లు అనగా కొక్కెములు ఎక్కడయినా (ఐ మీన్ గోడలకి సీలింగులకి) కనబడితే పోలీసులకు ఫోన్ కొట్టండి అంటున్నారు అమెరికన్ పోలీసులు. మన పోలీసులకి ఈ సంగతులు తెలిసే వుంటా యి.. కాకపోతే బయటపడటానికి కొంతకాలం పడుతాది అన్నదొక మాల్ గాళ్ (పెద్ద షాపులలోని అమ్మకాల అమ్మాయి) తస్మాత్ జాగత్త!