సబ్ ఫీచర్

ముగ్గురు మహనీయులకు నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు భారత ప్రభుత్వం నీరాజనం పలుకుతున్న శుభ సందర్భం ఇది. కవయిత్రులు ఆతుకూరి మొల్ల, తరిగొండ వెంగమాంబ, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణల చిత్రాలతో మూడు తపాలా బిళ్లలను నేడు గుంటూరులో జరిగే మహత్ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. తెలుగు వారైన ఆ ముగ్గురు మహనీయుల స్మృత్యర్థం ఈ మహత్కార్యం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజ్ఞ్భారతి అధ్యక్ష హోదాలో గత పద్దెనిమిది నెలల నుండి పరివిధాల ప్రయత్నం చేసి ఈ మంచి పనిని సాధించాను. స్వాతంత్య్ర సమరవీరులు, మహర్షులు, కవులు, శాస్తవ్రేత్తలు, కళాకారులు, వారి మహనీయతను అశేష ప్రజానీకానికి తెలియ చేసే కార్యక్రమం ఇది. తపాలాశాఖ ఫిలాటలీ విభాగాన్ని ఏర్పరచి, వందలాది మహనీయుల పేర ప్రతి సంవత్సరం స్మృతి ప్రదాయక తపాలా బిళ్లలను ప్రచురిస్తుంది. నా ప్రయత్నం ద్వారా బళ్లారి రాఘవ, త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్‌ల పేర తపాలా బిళ్లలు గతంలో విడుదలయ్యాయి. ఇప్పుడు మొల్ల, వెంగమాంబ, విశ్వనాథల చిత్రాలతో మూడు తపాలా బిళ్లలను విడుదల చేస్తున్నారు. ఈ ముగ్గురూ భగవద్భక్తులు. ధర్మమూర్తి అయిన రాముని చరిత్రే రామాయణం. దేవతలు రాముణ్ణి విష్ణుమూర్తి అవతారమని స్తుతించారు. కానీ తాను మానవమాతృడను అన్నాడు రాముడు. మనుజునిగా నిరాశ, బాధ, వైపరీత్యాలు, వియోగం ఇలా అన్నింటినీ అధిగమించి దుష్టశిక్షణ, ధర్మరక్షణ చేసి మానవులు దానవులుగాక ధార్మికులుగా, దివ్యపురుషులుగా వెలుగొందగలరని రామచరిత్ర తెలుపుతోంది. శ్రీరామ కథను తెలుగులో కవులూ, కవయిత్రులు, శతాబ్దాల నుంచి కావ్యరూపంలో వ్రాస్తూ వచ్చారు. భాస్కరుడు, ఎర్రాప్రగడ, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రఘునాధ నాయక, రంగాజమ్మ, మొల్ల, గోపీనాథ, వాసుదాస, వరదరాజ, గోవింద...విశ్వనాథ రామాయణాన్ని వ్రాసి తరించినవారే. 24వేల శ్లోకాలతో ఉన్న ఆరుకాండల వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 871 పద్యగద్యాలలో మూడు ఆశ్వాసాలుగా ఆతుకూరి మొల్లమాంబ (15 శతాబ్దం ఆఖరి పాదం- 16వ శతాబ్దం ప్రధమార్థకాలం) వ్రాసింది. శివకేశవుల భక్తురాలు. బాల్యవితంతువు. గోపవర గ్రామం (నెల్లూరు-కడపలలో ఇదే పేరుతో గ్రామాలు ఉన్నాయి). సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాష. సమకాలీన సమాజానికి రామాయణంలోని ఏ సందేశం, ఏ గాధ ద్వారా తెలపాలో, దానికి ప్రాధాన్యతనిచ్చింది మొల్ల. ఉదాహరణకు సీతారామలక్ష్మణులకు, పడవలు నడిపి జీవించే గుహుని మనోభావం అద్భుతంగా వెల్లడించింది మొల్ల. రాతిని ఆతిగా రాముడు మార్చాడని విన్న సామాన్యుని సంశయము, తన్నివారణని ఊహకందిన, చేయగలిగిన చర్య చక్కగా తెలియచేయబడ్డాయి. ప్రజానీకంలో మొల్ల రామాయణానికి ఉన్న ఆమోద్యం మరే రామాయణానికి లేదనడం అతిశయోక్తి కాదు. ద్వావర్థ ప్రశ్నలకు ద్వావర్థ ప్రత్యుత్తరాలిచ్చి తెనాలి రామలింగను కించపరచింది. ఉత్ప్రేక్షాలంకారయుత ఆశుకవిత్వాన్ని చెప్పి కృష్ణదేవరాయలను నిండు సభలో ముగ్ధుణ్ణి చేసింది. ఏ కులంలో, ఏ కుగ్రామంలో పుడితేనేమి, రామభక్తి, దీక్షయుంటే ఎవరయినా రాణించవచ్చు. మొల్లనుండి మనం నేర్చుకోవలసిన పాఠం అదే.
కవిసమ్రాట్ విశ్వనాథ గురించి ఎంతవ్రాసినా, వారికి సంపూర్ణ న్యాయం చేయలేము. 10,685 పుటలనలుముకున్న 57 నవలలూ, 27 పద్యకావ్యాలు, 16 నాటకాలూ నాటికలూ 11 విమర్శన గ్రంథాలు, 7 ఇతరములు కలపి మొత్తం 118. వారి వేయిపడగలు, 999 పుటలు. 29 దినాల్లో వ్రాశారు. వారి జీవిత పరమార్థ రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం. 13000 పద్యగద్యాలు, 30 సంవత్సరాల కృషి, 170 ఛందస్సుల్లో పద్యాలు, వారి మధ్యాక్కరలు నిరుపమానమైనవి. భారత రాష్టప్రతిచే పద్మభూషణ పురస్కారితులు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న ప్రధమాంధ్ర కవి. రచనాకాలంలో సామాజిక స్థితిగతులు చక్కబెట్టడానికి కవి ఏ సందేశాన్నీయదలచాడో, అది తన రచనలో 90 పాళ్లుగా తన కృతిలోని వ్యక్తుల చిత్రీకరణలో చూపించాలి. తన పాండిత్యాన్ని, సృజనాత్మకతను, ధర్మోద్దీపనకుపయోగించాలి అన్నారు విశ్వనాథ. అభ్యుదయవాదులు, ప్రజాకవులు, గద్య కవులు భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని హేళన చేస్తూ తనను విమర్శించేవారిని లెక్కచేసేవారు కారు. ఛందోబద్ధమయిన కవిత్వమే కలకాలం మన్నింపడి అజరామరంగా ఉంటుందని, సగర్వంగా, నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు.
తరిగొండ వెంగమాంబ ఒక సాధ్వి. తరిగొండ గ్రామ దేవాలయంలోని నృసింహస్వామికి చిరుప్రాయం నుంచి భక్తురాలు. తల్లిదండ్రులు బాల్య వివాహం జేశారు. మీరాబాయిలా, భర్తను నిషేధించింది. అనతికాలంలో అతను చనిపోయాడు. తిరుమలలోని వేంకటాచలపతి తన భర్త అని చాటింది. ఛాందస బ్రాహ్మణ బంధువర్గం ఆమెను బలవంతాన వితంతువులా శిరోముండనం చేయింబోయారు. అప్పటినుండి అన్నీ మహిమలే. క్షౌరకుడికి ఆమె భయంకరశక్తి స్వరూపిణిగా గోచరించింది. భయపడి తనపనిచేయక పారిపోయాడు. గ్రామస్తుల ప్రార్థన విని పుష్పగిరి స్వాములు వెంగమాంబకు బుద్ధి చెప్పవచ్చారు. ఆయనతో నిర్భయంగా వాదించి తాను నిత్యసుమంళినని చెప్పింది. గురువుగారికెందుకు నమస్కరించవంటే, మీరు పెట్టించిన తెరను తీస్తేనే నమస్కరిస్తానన్నది. తెర తొలగింపబడగానే వెంగమాంబ ఇష్టదైవమైన నృసింహస్వామిని ధ్యానించి పుష్పగిరి స్వామికి వందనం గావించింది. తక్షణమే సింహగర్జనలాంటి ధ్వని వినిపించి పీఠం నుండి మంటలు లేచి పూర్తిగా తగులబడిపోయింది. వెంగమాంబ సుమంగళియేకాదు, దివ్యమూర్తి అని సమాజం నమ్మింది. కొంతకాలానికి, వెంగమాంబ తిరుమల చేరింది. మరెన్నో మహిమలు, ప్రజలు భక్తులు చూశారు. విన్నారు. సరస్వతీదేవి కటాక్షాలతో వెంగమాంబ భక్తి ప్రధానమైన కవయిత్రిగా వర్ధిల్లింది. వెంకటాచల మహత్మ్యమనే కావ్యాన్ని రచించింది.
ఇంత గొప్పవారైన ముగ్గురి తపాలా బిళ్లలను ముద్రించి విడుదల చేయడం సౌభాగ్యమనుకుంటున్నా. తపాలాశాఖ భరతమాత సేవలో మరిన్ని మహనీయులను స్మరిస్తూ భారతీయులందరియందు దేశభక్తిని, ఆధ్యాత్మికతనూ, ధర్మనిరతినీ పెంపొందిస్తూంటుదని ఆశిస్తున్నా.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి