సబ్ ఫీచర్

వేధించే మగవాళ్లకు గుణపాఠం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు నిరోధానికి పాలక పక్షాలు ఎన్ని చట్టాలు చేసినా ఫలితం కనిపించడంలేదు. దీనికి ప్రధాన కారణం, మనం మన ఆడపిల్లల్ని అబలలుగా పెంచడమే. వారిపై ఆంక్షలు విధించడంలో చూపుతున్న శ్రద్ధ, వారికి ఆత్మరక్షణ (స్వీయ రక్షణ) పద్ధతులపై అవగాహన కల్పించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడమే. వేధింపులు, అత్యాచారాలు కారణంగా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించడానికి కూడా భయపడుతున్నారు. విద్యాసంస్థలు కూడా పిల్లల్ని చదువుకొనే యంత్రాలుగా (రోబో లు) మార్చడానికే ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ర్యాంక్‌లు సాధించడం తదితర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆకతాయిల బెడద కారణంగా మహిళలు తీవ్ర మానసిక ఆందోళనకు గురి అవుతూ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నా రు.
తమ కళాశాల విద్యార్థినులను ఆకతాయిల బెదడనుంచి కాపాడటంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విశాఖపట్నంలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలవారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజూ సాయంత్రం కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు స్వీయ రక్షణ పద్ధతులు (మార్షల్ ఆర్ట్స్‌లో) శిక్షణ ఇస్తున్నారు. ఇండియ న్ మోడరన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ఎం.వి.రమణ శిక్ష ణ తరగతులను నిర్వహిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొం దటం ద్వారా తమలో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు, వేధింపులకు గురి అవుతు న్న మహిళలకు బాసటగా నిలువగలిగే ధైర్యం తమకు కలిగిందని పలు విద్యార్థినులు చెప్పడం గమనార్హం. తొలుత శిక్షణ పొందుతున్నవారిని ఎగతాళి చేసిన వారే, నేడు వారి జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. విద్యార్థినులు కూడా క్రమం తప్పకుండా శిక్షణకు హాజరవుతూ, తమ నైపుణ్యా న్ని పెంపొందించుకొంటున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి కళాశాలవారు సర్ట్ఫికెట్లు కూడా అందజేస్తున్నారు. త్వరలో జరుగనున్న కరాటే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు కూడా కళాశాల నుంచి ఒక జట్టును పంపనున్నారు. దేశంలోని అన్ని విద్యాసంస్థలలో విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణను ఇస్తే, వారిపై లైంగిక అత్యాచారాలు, వేధింపులు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, వారి బాడీ ఫిట్‌నెస్ పెరగడంతోపాటు, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా వారు మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది.

- పి.హైమావతి