బాలీవుడ్ నటి రీమా లాగూ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు వినోద్‌ఖన్నా మరణాన్ని మర్చిపోయేలోపే బాలీవుడ్ పరిశ్రమ మరో సీనియర్ నటి రీమా లాగూనిని కోల్పోయింది. నిన్న బుధవారం రాత్రి గుండె నొప్పితో ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబాని ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల బాలీవుడ్ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1970, 80ల మధ్యకాలంలో కెరీర్ ప్రారంభించిన రీమా లాగూని అనేక హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. అంతేగాక పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మైనే ప్యార్‌కియా, హమ్ ఆప్‌కే హౌన్ కౌన్, కుచ్ కుచ్ హోతాహై, హమ్ సాత్ సాత్ హైన్ వంటి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారామె. సినిమాల్లోనే కాక టెలివిజన్ రంగంలో సైతం ‘తు తు మైన్, శ్రీమన్ శ్రీమతి వంటి పాపులర్ షోలతో తనదైన చెరగని ముద్ర వేశారామె.