సబ్ ఫీచర్

సమైక్యత ఓ ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భరతదేశం నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’- అని పిల్లల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞలు చేయించడం ఆనవాయితీ. ఈ ప్రతిజ్ఞను చిన్నారులు పెద్దయ్యాక గుర్తుంచుకుంటున్నారా? ఈ విషయం నిజంగా సందేహాస్పదమే. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ప్రాంతీయ పార్టీలు విపరీతంగా పెరిగాయి. ప్రాంతీయ దురభిమానాలతో పాటు కుల, మత ద్వేషాలు ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటే ఏదో పరాయి ప్రభుత్వమని, అవసరమైతే దానిని నిలదీయాలని ప్రాంతీయ పార్టీల వారు ప్రచారం చేయడం వలన- కేంద్రం తమకు ఏదో అపకారం చేస్తున్నదని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు భావిస్తున్నారు. ఓట్ల వేటలో ఇప్పుడీ ధోరణి అనూహ్యంగా పెరిగిపోతోంది.
దేశంలో జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలని, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని పార్లమెంటు శాసనం చేయలేకపోతోంది. ఈ విధానం జాతీయ సమైక్యతకు పెద్ద అవరోధంగా మా రింది. మన దేశానికి ఒక జాతీయ భాష ఉండాలని, అందుకు హిందీయే యోగ్యమైనదని మన నాయకులు నిర్ణయించారు. హిం దీకి ప్రాధాన్యత పెరిగితే ఉత్తరాది వారు అన్ని రంగాల్లోనూ దక్షిణాది వారిని అణచివేస్తారనే విష ప్ర చారం చాలాకాలం క్రితమే ప్రారంభమైంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృత రూపం దా ల్చింది. ఈ ప్రాంతీయతత్వం ఎం తగా ముదిరిపోయిందో పాలగుమ్మి పద్మరాజు గారు తన ‘రెండవ అశోకుని ముణ్ణాళ్ళ పా లన’ నవలలో ఒకచోట చక్కగా చిత్రీకరించారు. ఆ నవలలో- కేరళవాసులు రాష్ట్రేతరులను తమ రాష్ట్రం నుండి వెళ్లిపోవాలని అలజడి చేస్తారు. అది హింసాత్మక సం ఘటనలకు దారితీస్తుంది. అప్పుడు ఒక పాఠశాలలో చదువుతున్న రాష్ట్రేతర విద్యార్థి ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయని ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడా ఉపాధ్యాయుడు- ‘సొంత రాష్ట్రంలోని వారికి ఉద్యోగాలు దక్కడం లేదని, అవి ఇతర రాష్ట్రాల వారికి లభిస్తున్నాయని, ఆ కారణంగా అలజడులు జరుగుతున్నాయ’ని జవాబు చెప్పగా ఆ విద్యార్థి తమ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కిళ్లీ దుకాణం నడుపుకుంటున్నాడని, అతడు ఎవరి ఉద్యోగానికీ అడ్డురాకపోయినా అతని దుకాణాన్ని ఎందుకు ధ్వంసం చేశారని తిరిగి ప్రశ్నిస్తాడు. కొన్ని ప్రశ్నలకి తాను జవాబు చెప్పలేనని ఆ ఉపాధ్యాయుడు నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు.
మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడయినా ఉద్యోగం చేయవచ్చు. వ్యాపారం చేయవచ్చు. ఇందుకు ఎవరూ ఆటంకం కలిగించకూడదు. కానీ, ఇటీవల ఉత్తరాది వారు, దక్షిణాది వారు అనే భేదభావం ప్రబలుతోంది. దీనిని అందరూ తీవ్రంగా ఖండించాలి. తిరుపతి వేంకటేశ్వరుడు దక్షిణాది వారికే కాదు, అందరికీ దేవుడు. వారణాసిలో విశే్వశ్వరుడు ఉత్తరాది వారికే కాదు, అందరికీ దేవుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇ.ఓ.గా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని ఎందుకు నియమించకూడదు? ఇందుకు తెలుగు ఐఏఎస్‌లతోపాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌లు అభ్యంతరం చెప్పడం ఏమిటి? అది ఏదో దురాచారమని, దానిని కొనసాగనివ్వరాదని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది పూర్తిగా అనాలోచిత నిర్ణయమని, దక్షిణాది ఐఏఎస్‌లను ప్రభుత్వం అసమర్థులుగా భావిస్తుందని ఓ స్వాముల వారు సైతం ఆగ్రహం వెళ్లగక్కారు. ప్రాంతీయ తత్వాలు తొలగింపజేయడం పీఠాధిపతుల కర్తవ్యం. కానీ, వాటిని సామాన్య మానవుల వలే వివాదాస్పదం చేయడం వారికి సమంజసం కాదు. దేవస్థానముల తాలూకు వివిధ శాఖల్లో అన్యమతస్థులు పనిచేస్తున్నారట. ఇదే నిజమైతే అట్టి వారిని ఎందుకు తొలగించరు? ఆలయ ప్రవేశానికి ఇతర మతస్థులను ఎందుకు అనుమతిస్తున్నారు?
మన దేశం వివిధ భాషలకు, వివిధ మతాలకు, వివిధ ఆచారాలకు నిలయం. ఎనె్నన్నో భిన్న విషయాలున్నా సమైక్యత అనే సదాచారాన్ని మన దేశస్థులు అనాదిగా పాటిస్తున్నారు. దీనికి విఘాతం కలిగించకూడదు. మహాపుణ్యక్షేత్రాలకు, మహోన్నత రాజ వంశస్థులకు ఉత్తర భారతం ప్రసిద్ధి. కురుక్షేత్రం మనందరికీ పవిత్ర స్థలం. శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇలాంటి ఏకత్వ ధోరణి విద్యాలయాలలో సైతం పెరగాలి. ఉపాధ్యాయులు ఇందుకు దోహదం చేయాలి. తీవ్రమైన నేరాలు చేసిన కొందరు వారి రక్షణ కోసం కులాన్ని, మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. చట్టప్రకారం దానికి శిక్షపడవలసిందే. ఇందులో కుల, మత ప్రస్తావన ఏమిటి? కేరళలో జన్మించిన ఆదిశంకరులు యావద్భారతదేశం పర్యటించి భక్త్భివంతో జాతీయ సమైక్యతకు బలం చేకూర్చి దేశం నలుమూలలా పీఠాలు స్థాపించి విజయం పొందారు. కొత్తగా తిరుపతి దేవస్థానం ఇ.ఓ.గా నియమితులైన అధికారి నడక మార్గం ద్వారా స్వామి దర్శనం చేసుకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అందరికీ చెందిన భగవంతుని విషయంలో ప్రాంతీయ తత్వం అంటగట్టకూడదు. ఇలాంటి ధోరణులను పెంచి పోషిస్తే ముందు ముందు దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని అలజడులు బయలుదేరినా ఆశ్చర్యపడనవసరం లేదు.

-వేదుల సత్యనారాయణ