సబ్ ఫీచర్

అదే అమానుషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో అభివృద్ధిసాధించామని అనుకుంటున్నాం. కాని అమాయకులైన పసిబిడ్డలపై అమానుషం ఇంకా కొనసాగుతోంది. ఎదిగే వయసులో ఈ పసిమొగ్గలకు లైం గిక విషయాలపై ఎలాంటి అవగాహన ఉండదు. దీంతో చిన్నారులు ఏదో ఒక రూపంలో బలవుతూనే ఉన్నారు. ఇటీవల హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ విజన్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజాలు ఇవి.
12-18 ఏళ్ల మధ్య వయసు పిల్లలు దాదాపు 45,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
దేశంలోని 26 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు.
ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు అభద్రతాభావానికి గురవుతున్నట్లు వెల్లడించారు.
పసిమొగ్గలను పదిలంగా కాపాడుకోవాలంటే వారిపై అమానుషంగా జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టాలని కోరుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వరల్డ్ విజన్ ఇండియా నేషనల్ డైరెక్టర్ థామస్ వెల్లడించారు.
పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్య, బాలల హక్కులు, రక్షణ తదితర అంశాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
పిల్లలు సురక్షితమైన వాతావరణంలో జీవించాలంటే ఇలాంటి క్యాంపెయిన్ ఎంతో అవసరమని ధామస్ అభిప్రాయం. అందుకే వారికి పై అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు థామస్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు స్మర్శ జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎవరు
ఏ ఉద్దేశ్యంతో తాకుతున్నారో వారికి విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది.
పిల్లలపై లైంగిక వేధింపులు వారికి తెలియకుండానే జరుగుతున్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.