సబ్ ఫీచర్

వికసించేదెప్పుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన కారణం దారిద్య్ర రేఖకు దిగువన ఉండటం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం కారణం. చిన్న వయసులోనే గర్భస్రావాలు జరగడం, చనిపోయిన శిశువులు జన్మించడం లేదా జన్మించగానే శిశువులు మరణించే అవకాఉం ఉంది. బాలికల బాల్యవివాహాలవల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమేకాకుండా, మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాక పేద తల్లిదండ్రులకు వరకట్నం భయం అనేది మరో కారణం. అందుకే బాలికల విద్యకు అధికంగా ప్రోత్సాహాలు ఇవ్వడం ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు మెరుగ్గా అమలు చేస్తే పేద తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చదువులందు ప్రోత్సహిస్తారు.
హర్యానా రాష్ట్రం 1994లో ప్రారంభించిన అప్నాబేటీ, అప్నాధన్ కార్యక్రమం విజయవంతమైంది. 15 నుంచి 18 సంవత్సరాలమధ్య వివాహితులైన బాలికల్లో గర్భస్థ సంబంధిత మరణాలు 20 నుంచి 24 సంవత్సరాలలోపువారికన్నా రెట్టింపు ఉన్నాయన్నారు. 15 సంవత్సరాలలోపు వారిలో ఇది శిశు జనన సమయంలో మాతా మరణాలు ఐదింతలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసుల్లో అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.3 శాతంమందికి బాల్య వివాహాలు జరిగినట్టు తేలింది. బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానం (26.2 శాతం), నల్లగొండ (21.6 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతాలు), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం) నిజామాబాద్ (16.9 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్లు ఎం.వి.్ఫండేషన్ సర్వేలో వెల్లడైంది.
వేధింపులు అధికం
బాల్య వివాహాలు జరిగిన అమ్మాయిల్లో 62 శాతంమంది తొలి కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే 74 శాతంమంది అత్తమామల అసంతృప్తి, వేధింపులను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రసవించగా నాలుగైదు నెలలు కాకుండానే కూలీ పనులకు పంపిస్తున్నారు. బాల్య వివాహాలు జరిగిన బాలికల్లో 67 శాతంమంది తమ సమస్యలను భర్తలకు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 85 శాతం బాధిత మైనర్లు పుట్టింటికి వెళ్లడానికి కూడా సరిగ్గా అవకాశం ఉండడంలేదు.
చట్టాలున్నా ఉపయోగపడని వైనం..
బాల్య వివాహాల నియంత్రణకు 2006లో కఠిన చట్టం తీసుకువచ్చారు. కానీ బాల్య వివాహాలు మాత్రం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే 8 కోట్ల అమ్మాయిలకు 18 సంవత్సరాలు పూర్తికాకుండానే పెళ్లిల్లు జరుగుతున్నాయి. అందుకే బాల్య వివాహాలు వద్దని ప్రచారం చేద్దాం- చదువుకు ప్రాధాన్యతనిద్దాం.
..........................................
21వ శతాబ్దంలోనూ ఇంకనూ బాల్యవివాహాల సంస్కృతి యథేచ్చగా కొనసాగడం విచారకరం. రాష్ట్రంలో 4 లక్షలమంది 15 నుంచి 19 సంవత్సరాల లోపు వివాహమైనవారు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నప్పటికీ పెద్దలు జోక్యం చేసుకుని బాల్య వివాహ నిరోధక చట్టం అమలుకాకుండా అడ్డుపడుతున్నారు. బాల్య వివాహాలు జరిగినవారిలో అత్యధికంగా వెనుకబడిన తరగతులవారే. బాల్య వివాహాల్లో 43 శాతం బిసి కులాలకు చెందినవారు కాగా, 36 శాతం షెడ్యూల్డు కులాలు, 15 శాతం గిరిజన తెగలకు చెందిన వారున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు, బంధువులు, ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి పీటలమీద కూర్చోబెడుతున్నారు. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్లమందికి బాల్య వివాహాలు జరుగగా- అందులో తెలంగాణలో నాలుగు లక్షలమంది ఉన్నట్లు ఎం.వి. ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది.
..............................................................................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-కె.రామ్మోహన్‌రావు