సబ్ ఫీచర్

ఆరంభమే ఆర్థిక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభీమపాకం అన్నారు కాని దమయంతి పాకమనో, ద్రౌపది పాకమనో అనలేదు కాని ప్రతిరోజు వంట మాత్రమే ఆడారే చేయాలి. వండాలి. వడ్డించాలి. అపుడే ఇంటిల్లిపాది లొట్టలేసుకొని తింటుంటారు.
అయితే ఆడవారు ఆలోచనలకు పుట్టిన్నిల్లువంటివారు కదా. నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో అటు ఉద్యోగమూ ఇటూ ఇంటి బాధ్యతలూ నెరవేర్చడానికి సమయం చాలక లేక తామే నలుగురికి ఉద్యోగాన్నివ్వాలన్న తహ తహ పెరిగో స్వయం ఉపాధి పథకాలను చేపట్టి అందులో విజయాలను సాధించే మహిళలు ఎక్కడ చూసినా ముందుంటున్నారు.
వీరు చేస్తున్న పనులను ఒకసారి చూసి మీలోనూ ఏ నైపుణ్యముందో వెలికి తీయండి. ఆ దిశగా అడుగులు వేసి ముందుకు సాగండి . విజయకేతనాన్ని ఎగురవేయండి.
పచ్చళ్ల తయారీలోపడతులు:
ఇప్పుడు అందరికీ బిపీలు, షుగర్లు ఉన్నాయి. నిలవ పచ్చళ్లు ఊరగాయలు తినకండి మొర్రో అని డాక్టర్లు చెబుతున్నారు. కాని ముందు నాలుగు మెతుకులు పచ్చడి కలుపుతింటే కాని తిన్నట్టు ఉంది అనేవారే ఎక్కువ. కనుక అట్లాంటి వారి కోసం రోటి పచ్చళ్లు తయారు కదా. కాని వాటినే నాలుగు రోజులు నిల్వ ఉండేట్లుగా తయారు చేసి చిన్న చిన్న ప్యాకెట్లల్లో అమ్ముతున్నారు. ఇవి నాల్గురోజులే పనిచేస్తాయి కనుక వస్తువు తక్కువే ధర కూడా తక్కువే ఉంటుంది. పైగా ఎర్రకారం ఎక్కువ మసాలా దినుసులు నూనె ఇవి లేకుండా కొద్దిపాళ్లల్లోనే నోరూరించే పచ్చళ్లు తయారు చేయవచ్చు. వారుండే కాలనీల్లోను చుట్టపక్కల ప్రాంతాల్లో వీరి వ్యాపారాన్ని కొనసాగించినా అనుకొన్నదానికన్నా ఎక్కువ మొత్తానే్న లాభాలుగా పుచ్చుకోవచ్చు అనేది నిపుణుల మాట.
అట్లానే రోటీలు:
మనం రోజూ తినేది అన్నమే అయినా దాన్ని తిననివ్వని జబ్బులు వచ్చేశాయి. డాక్టర్లు కార్బోహైడ్రేట్సు తక్కువ ఉండే నూనె వేయని రోటీలను తినమని సలహాలు కూడా ఇస్తున్నారు. కేవలం గోధుమ పిండితోనే కాక జొన్న, రాగి, సజ్జ, కొర్రలు ఇలాంటి చిరుధాన్యాలతోను రొట్టెలు చేయవచ్చు. వీటిని వ్యాపారంగా మార్చుకుని సాయంత్రం పూట కాని పొద్దునే్న అల్పాహారంగా కాని తీసుకొనేవారికి ఇవ్వవచ్చు. ఇవి ఎప్పటికప్పుడు అయిపోయేవి పైగా వేడివేడిగా ఉండేవి కావాలి కనుక ముందుగా ఆర్డర్ తీసుకొని మరీ చేయవచ్చు. ఇందులో వృధా గా పోయింది అనుకునేందుకు వీలుండదు.వీటిని కూడా చుట్టు పక్కల కాలనీ వాళ్లకు ఇచ్చి వ్యాపారం చేయవచ్చు అంటున్నారు చిరు వ్యాపారులు. కొంతమంది రోటీలు చేయడానికి అవసరమైన వస్తువులను ఇచ్చి కూడా రోటీ లు తయారు చేయించి మరీ అమ్ముతున్నారు. ఇలా చేసినా ఇద్దరికీ లాభాలుంటాయి.
ఉద్యోగస్తులైన మహిళలను రాత్రిళ్లు వంటచేసే సౌలభ్యం లేనివాళ్లు, ఓపిక నశించిన వారు, సమయం చాలని వాళ్లు కూడా ఈ రోటీలను, పచ్చళ్లను కొనడానికి ముందుకు వస్తున్నారు. దానివల్ల ఈ వ్యాపారం చేసేవారు మూడు పచ్చళ్లు ఆరు రోటీలుగా వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకొంటున్నారు. మరి మీకు అవసరమూ, ఆలోచన ఉంటే ఆరంభానికి శ్రీకారం చుట్టండి...
....................................................................................................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- గౌరి