సబ్ ఫీచర్

చెత్తకు నెలవు.. సాగు చేస్తే సుక్షేత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ రాష్ట్రంలోని చూర్ణిక్కార ఓ కుగ్రామం. ప్రధాన మార్గానికి ఇరువైపుల చాల సంవత్సరాల కిందట అధిక దిగుబడినిచ్చే పొలాలు చూపురులకు కనువిందు చేసేవి. అయితే, ఆ గ్రామంలోని రైతులంతా జీవనోపాధి కోసం వేరే వృత్తులు స్వీకరించడంతో ఆ వరి పొలాలన్నీ ప్రస్తుతం చెత్తకుప్పలుగా మారిపోయాయి. అంతేకాకుండా ఆ ప్రాంతమంతటా భూగర్భ జల నిక్షేపాలు దాదాపుగా అడుగంటిపోయాయి. ఆ మార్గం మీదుగా వెళ్ళేవారంతా ఆ దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకుని తిరగాల్సివస్తోంది. సుమారు 15 ఏళ్ళపాటు ఈ దుస్థితిని అనుభవించిన తర్వాత సుమారు 18 మంది గ్రామస్థులు ఆ గ్రామానికి పూర్వవైభవాన్ని సంతరింపజేయాలనే దృఢసంకల్పంతో ‘అదయాళం’ అనే స్వయం ఉపాధి సంఘంగా ఏర్పడ్డారు.
చెత్త కుప్పలతో నిండిపోయిన ఆ ప్రాంతాలను మళ్ళీ సుక్షేత్రంగా మార్చడానికి నడుంబిగించి, గ్రామ పంచాయతీ అధికారుల సాయం కోరారు. అధికారులు వారి ప్రాజెక్టును ఆమోదించాక అత్యంత దుర్లభం అనిపించే తమ లక్ష్యాన్ని సాధించడం వారికి క్లిష్టంగా మారినప్పటికీ పట్టువిడవకుండా పగలూరాత్రీ కష్టపడి పనిచేసి, ఆ ప్రాంతమంతా నిండివున్న చెత్తకుప్పలను దూరంగా తరలించి, పంట పొలంగా మార్చడానికి అనువుగా తయారు చేశారు. అక్కడి కృషిభవన్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారుల సాయం వారికి పుష్కలంగా లభించింది. దీనికి తోడు కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మ’ అనే ప్రాజెక్టు దృష్టికి వారి కృషి వెళ్ళింది. వ్యవసాయ పనులకు అవసరమైన ఈ ప్రాజెక్టుకు భారీ ఎత్తున సబ్సిడీలు లభించాయి. అయినప్పటికీ ఆ పొలాల యజమానులు ఓ పట్టాన భూములు స్వాధీన పరచడానికి మొదట్లో అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదాయళం సభ్యులు ఓ 15 ఏకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకుని, దున్ని, ధాన్యం పంటను సాగు చేశారు.
మొదటి సంవత్సరం 50 టన్నుల వరి దిగుబడి రాగా, కిలో 35 రూపాయల వంతన బియ్యాన్ని విక్రయించారు. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహం పొందిన ఆ సభ్యులు మరో 17 ఎకరాలలో వరి పంటను సాగుచేయడం ప్రారంభించారు. అంతేకాదు... ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని యజమానులు కూడా తమ పొలాలను ఆదయాళం సభ్యులకు అప్పగించారు. అంతేకాకుండా వ్యవసాయాధికారి జాన్ షెర్రీ సహకారంతో నూతన పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలను అమలు పరిచారు. భూమి చుట్టూ బంతి మొక్కలను కంచె మాదిరిగా నాటారు. పంటను నాశనం చేసే వివిధ పురుగులను తినే టీకాలను ఈ బంతిపువ్వులు ఆకర్షిస్తాయి. ఫలితంగా ఎటువంటి క్రిమి సంహారక మందులు వినియోగించకుండా ఆ పురుగులు పొలాల్లోకి ప్రవేశించకపోవడంతో అత్యధిక దిగుబడిని సాధించగలిగారు. ఇటువంటి నూతన ప్రక్రియలను ఇంతకుముందు ఎవరు చేపట్టేవారు కాదని, అందువల్ల తాను ఈ ప్రయోగాలను ఆచరణలోకి తీసుకొచ్చి, గొప్ప విజయం సాధించగలిగామని అంటారు ఆ వ్యవసాయాధికారి. వచ్చే ఏడాది అక్కడి దిగుబడిని హెక్టారుకు 2.8 టన్నులు నుంచి పది టన్నులకు పెంచాలని చూర్ణిక్కార గ్రామస్తులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొద్దిమంది గ్రామస్తులు ఒక చిన్న ప్రాజెక్టుగా ప్రారంభించిన పని ఇప్పుడొక ఉద్యమంగా రూపొంది, సరైన సాంకేతిక విజ్ఞానం, అధికారుల మద్దతు, ప్రోత్సాహం, ప్రభుత్వ సబ్సిడీలు, పట్టుదల, కృషి ఉంటే ఎంత ‘చెత్త’ ప్రదేశాన్నయినా సుక్షేత్రంగా మార్చవచ్చని నిరూపించారు వారు. పైపెచ్చు వారికి వ్యవసాయం మళ్ళీ ప్రధాన వృత్తిగా మారడంతోపాటు భూగర్భ నిక్షేపాలు కూడా పెరిగాయి. ముందు ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు మార్గదర్శకం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

-జి.కల్యాణి