సబ్ ఫీచర్

ద్రావిడ వర్సిటీకి జాతీయ స్థాయ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రావిడ భాషలు 27. అందులో అయిదు మినహాయించి మిగతావి అన్నీ కూడా గిరిజన భాషలు. ఇందులో ఎక్కువ గిరిజన భాషలు అంతరించే ప్రమాద స్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలలో అభివృద్ధిచెందిన సాహిత్యం ఉంది. అంతేకాదు వాటికి లిపులు ఉన్నాయి. కాగా మిగతా 22 భాషలకు లిపి లేదు. అవి అలిఖితంగా గిరిజన భాషలుగా ఉన్నాయి. ద్రావిడ భాషల సమగ్ర అధ్యయనానికి, ద్రావిడ భాషలలో సాహిత్యం, సంస్కృతి, జానపద విజ్ఞానం, ద్రావిడ భాషా ప్రాంతాల చరిత్ర, పురాతత్త్వం, తదితర అన్ని కోణాలలో ఈ దాక్షిణాత్య భాషలను అధ్యయనం చేయడానికి ద్రావిడ విశ్వవిద్యాలయం 1997లో ఏర్పడింది.
ద్రావిడ తత్త్వశాస్త్రం సాహిత్యాల అధ్యయనంకోసం ఒక జాతీయస్థాయి అధ్యయన సంస్థ కావాలని, ప్రపంచ ప్రసిద్ధిపొందిన ద్రావిడ భాషల అధ్యయన శాస్తజ్ఞ్రుడు ఆచార్య వి.ఐ.సుబ్రహ్మణ్యం ఇంకా ఆనాటి ఐఎఎస్ అధికారులు కాశీపాండ్యన్, చెల్లప్ప కలిసి నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కలిశారు. ఆవేశపరుడైన కళాకారుడు సాహితీవేత్త అయిన రామారావు ‘‘బ్రదర్ సంస్థ ఏమిటి ఒక విశ్వవిద్యాలయానే్న పెడదాం’’ అని హామీ ఇచ్చారు. దరిమిలా చంద్రబాబునాయుడుకాలంలో ఇది సాకారమై కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. ద్రావిడ అనే పదంపైన ఆనాడు కేంద్రాలలో కొంత వ్యతిరేకత వచ్చిందని అనుకున్నారు. కాని వి.ఐ.సుబ్రహ్మణ్యం అది తప్పనిసరిగా ఉండాల్సిందేనని జాతీయ గీతంలోనే ద్రావిడ పదం భాషల ఉందని ప్రసక్తిఉందని వాదించారని చెప్తారు. దక్షిణాది రాష్ట్రాలూ అన్నింటిలో పూర్తిగా ద్రావిడ భాషలు వ్యాపించాయి. అంతేకాదు ఉత్తర ద్రావిడ భాషలు పాకిస్తాన్ దేశంలో ఆప్ఘనిస్థాన్‌లో కొన్నిచోట్ల, శ్రీలంకలో కూడా వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాది రాష్టమ్రైన బిహార్‌లో కుడుక్ అనే ద్రావిడ భాష ఉంది.
అంతర్జాతీయ స్థాయలో ఏ దేశం వారైనా ద్రావిడ భాషలపై అధ్యయనం చేయాలనుకుంటే అందుకు ఉన్న త స్థాయి పరిశోధన కేంద్రంగా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని రూపకల్పన చేశారు. ఆనాటి ప్లానింగ్ అండ్ మానిటరింగ్ బోర్డులో ఆచార్య బిరుదురాజు రామరాజు వంటి ఉద్దండ పండితులు దీనికి రూపకల్పన చేశారు. ఎంతోమంది మహనీయుల కృషి ద్వారా ద్రావిడ విశ్వవిద్యాలయం సాకారమైంది. ఆరంభమైన వెంటనే తత్త్వశాస్తశ్రాఖ, కంప్యూటర్ శాఖ ఏర్పడ్డాయి. తర్వాత మూడు సంవత్సరాలకు బోధనాభ్యసనశాఖ, పండిట్ ట్రైనింగ్ ఏర్పడ్డాయి. ఆచార్య రవ్వా శ్రీహరి కాలంలో చరిత్రశాఖ, జానపద శాఖ ఏర్పడ్డాయి. తర్వాత ఆయన కాలంలోనే ఐదు ప్రధానమైన శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చి పోస్టులు మంజూరుచేసింది. దీని ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీషు భాషా శాస్తశ్రాఖలు ఏర్పడ్డాయి. తుళు, మళయాళ శాఖలను ఏర్పాటుచేసుకున్నారు.
దురదృష్టవశాత్తు 2005నుండే ద్రావిడ విశ్వవిద్యాలయం దాని లక్ష్యాలనుండి పక్కదారి పట్టడం ఆరంభించింది. నాటి ఉన్నతాధికార్లు ద్రావిడ అధ్యయనాలకు భిన్నమైన శాఖలను తీసుకువచ్చే ప్రయత్నంచేశారు. అయనప్పటికీ ద్రావిడ విశ్వవిద్యాలయంలో ద్రావిడ అధ్యయనాల పైన గణనీయమైన పరిశోధన జరిగింది. వేరువేరు భాషల శాఖలలో జానపదశాఖ, భాషాశాస్త్ర శాఖ, తత్త్వశాస్తశ్రాఖ, చరిత్ర శాఖల వంటి ద్రావిడ అధ్యయనాల శాఖలలో మంచి పరిశోధన జరిగింది. అంతేకాదు ద్రావిడ మూలికావనం అనేది హెర్బల్ అండ్ నేచురోసైనె్సస్ విభాగం తరఫున ప్రతిష్టాత్మకంగా పది ఎకరాలలో ఏర్పడి మూలికాశాస్త్రం పైన మంచి పరిశోధన జరుగుతున్నది.
ద్రావిడ విశ్వవిద్యాలయం రాష్ట్ర విభజనలో పదవ షెడ్యూలులో చేరింది. అంటే ఉమ్మడి రాష్ట్రానికి చెందినది. రాష్ట్ర విభజన దరిమిలా ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా చెందుతూ ఉంది. తొలుత కొంత ఆలస్యంఅయినా తెలంగాణ ప్రభుత్వం కూడా తన రెండేళ్ల బడ్జెట్‌లోఈ విశ్వవిద్యాలయానికి నిధులను కేటాయించింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. పిహెచ్. డిలకు సంబంధించిన వివాదాలు సమసిపోయిన తర్వాత, కోర్టుద్వారా వాటి పరిష్కారానికి మార్గం సుగమం అయిన తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం తిరిగి మంచి దారిలోకి వచ్చింది. అంతేకాదు కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం సమగ్రమైన అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయవలసిందిగా ఒక ఉన్నత స్థాయి అంతర్‌రాష్ట్ర కమిటీని వేసింది. ఈ కమిటీ సమగ్రమైన ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ లక్ష్యాల దృష్ట్యానే ప్రస్తుతం ద్రావిడ విశ్వవిద్యాలయంలో పరిశోధన తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇతోధికమైన పుష్టికావాలి. ఈ విశ్వవిద్యాలయం కేవలం తెలుగురాష్ట్రాలకు పరిమితమై లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి అనే ఆరు రాష్ట్రాలకు ఇది సేవలందిస్తూ ఉంది. ఈ ఆరు రాష్ట్రాలనుండి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. అంతేకాదు ఈ ఆరు రాష్ట్రాలనుండి వచ్చిన అధ్యాపకులు కూడా ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ విధంగా ఇది అంతర్‌రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలుకాక మరే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు సేవలు అందించడం లేదు. ఈ విధంగా ద్రావిడ విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయి ఉంది. ఇది జాతీయస్థాయి విశ్వవిద్యాలయంగా దీని ఆరంభంనుండి పనిచేస్తూ ఉంది. ఈ దృష్ట్యా దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఇచ్చి కేంద్ర విశ్వవిద్యాలయంగా మార్చవలసిన అవసరం ఉంది.

- ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి సెల్: 9440493604