సబ్ ఫీచర్

విద్యాలయాలను ప్రక్షాళన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి బాహ్య ఉపద్రవం కంటె అంతర్గత కల్లోలం పెను ప్రమాదంగా తయారైంది. దీన్ని ‘అసహనం’, సెంట్రల్ యూనివర్సిటీ కృత్రిమ ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. దుర్ఘటనకు కారకులైన వారే ఎదురు దాడికి దిగడం పరిపాటిగా మారింది. కమ్యూనిస్టీకరణ, క్రైస్తవీకరణకు బలైన వారికి అండదండలు లేకుండా పోయాయి. కాంగ్రెస్ వ్యూహరచనకు కమ్యూనిస్టు, టెర్రరిస్టు గ్రూపులు వేదికలు తయారు చేస్తూ యువతను, దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. అలెగ్జాండర్ సోల్జెనిత్సవ్ (రష్యా తత్వవేత్త), విఎస్ నరుూపాల్ వంటి వారికి అన్యాయం జరిగినా, టిబెట్, నేపాల్, కాశ్మీరీ పండిటక్లు మొదలైన వర్గాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న చైనా, పాకిస్తాన్ వంటి దుర్మార్గపు దేశాలకు వత్తాసు పలకడం రివాజుగా మారింది. 300 మంది ఎంపిలున్న ప్రభుత్వాన్ని రాజ్యసభ ద్వారా అడ్డుకోవడం జాతీయ మీడియాలో అసత్య, అసందర్భ, బూటకపు ప్రచారాలతో నిలువరించాలని చూడడం అసహ్యాన్ని కలిగిస్తున్నది. సూడో మేధావులు ఒకటవ తరగతి నుంచి ఐఏఎస్ సిలబస్ వరకు రచించి విద్యారంగాన్ని కలుషితం చేశారు. తమ పునాదులు కదులుతున్నాయన్న దుగ్ధతో కాషారుూకరణ అంటూ గగ్గోలు పెడుతున్నారు. దుష్టుల ఏరివేత నిరంతర ప్రక్రియ అని వారు తెలుసుకోవాలి. వ్యవస్థలు అంతరించకూడదనుకుంటే సంస్కరణలు తప్పదు. మార్పు వద్దంటూ సూడో ఉద్యమాలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే.
వెయ్యేళ్లలో ముస్లిం పాలకులు, 200 ఏళ్లలో బ్రిటిష్ పాలకులు చేయని అరాచకం సెంట్రల్ యూనివర్సిటీలు, ఎన్‌సిఇఆర్‌టి, ఎస్‌సిఇఆర్‌టి, విహెచ్‌ఆర్‌సి, వంటి సంస్థలు కేవలం ఐదు దశాబ్దాల్లో దేశ సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బద్దలు కొట్టాయి. అయినా వారికి దాహం తీరలేదు. ఇప్పుడున్నది ‘పారదర్శక’ప్రపంచమన్న సంగతి వారికి తెలియడం లేదు. గజనీలు, ఘోరీలు, బాబర్‌లు, మెకాలేలు, మావోలు సమాధుల్లో నుంచి లేచి వచ్చి రక్షిస్తారని కలలు కంటున్నారు. నలంద, తక్షశిల, కాశీ, కాంచీ విద్యా పీఠాలను అసుర శక్తులే నాశనం చేశాయి. కానీ మంచి బీజాలు మళ్లీ మొలకెత్తేందుకు వేచి చూస్తున్నాయి. వామపక్ష, ఉగ్రవాద నిరంకుశ శక్తులకు వేలకోట్ల సాయం ప్రపంచం నలుమూలల నుంచి అందుతోంది. తియానెనె్మన్ స్క్వైర్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థులను బుల్డోజర్లు, సైనిక ట్యాంకులతో హతమార్చి, టిబెట్‌ను పీనుగుల పెంటగా మార్చిన చైనా, సౌదీ అరేబియా నిధులతో విర్రవీగుతున్న పాకిస్తాన్ ఈ అరాచక శక్తులకు వర్తమాన మిత్రులు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశం మొత్తంలో ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలకు నమూనా వంటిది. ప్రస్తుతం ఇందులో మంచివారికి ఏవిధమైన మద్దతు లేని పరిస్థితి కల్పించారు. లక్షల రూపాయల్లో వేతనాలు పొందుతూ, కోట్లాది ధనాన్ని పనికిరాని ప్రాజెక్టులు, టూర్ల కోసం వెచ్చిస్తూ సోమరుల నిలయాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇంట్లో ఎట్లా ఉంటున్నారో బయటా అట్లాగే వ్యవహరిస్తే సమాజానికి, దేశానికి బాగుంటుందని మనవి. సూడో మేధావులు రాజ్యాంగం పట్ల నిబద్ధత, జీవితంపై అవగాహన, చరిత్రనుంచి గుణపాఠం నేర్చుకోవాలి.
విద్యకు నిలయాలుగా విశ్వవిద్యాలయాలు మారాలి. ప్రస్తుతం అసలైన విద్యను వదిలేసి ఇతర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా విద్యాలక్ష్యం మరుగున పడిపోయ, వాతావరణం కలుషితమవుతోంది. విద్యార్థులు తమలక్ష్యాన్ని మరచి ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల విద్యా నాణ్యత పడిపోతున్నది. ఇప్పటికైనా విద్యాలయాలు విద్యకే ప్రాధాన్యమిచ్చేవిగా పరిణామం చెందాలి. ఇందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదు.

- పిన్నం వెంగళరావు