సబ్ ఫీచర్

నిఘా నీడలో టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 21 నుంచి జరుగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలను నిఘా నేత్రం నీడలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. యావత్తు ఉపాధ్యాయలోకం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిఘానేత్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులను సీసీ కెమేరాల గురించి మానసికంగా సిద్ధం చేయకముందే నిర్ణయాన్ని ప్రకటించడం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయంలో ప్రతిభలేని విద్యార్థులకంటే మెరిట్ విద్యార్థులే అధికంగా బాధపడుతున్నారు. ఎక్కడ సమస్య తలెత్తుతుందోననే భయం టెన్త్ విద్యార్థులను వెంటాడుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సీసీ కెమేరాల నీడలో ఫార్మేటివ్ అస్సెస్‌మెంట్, సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను నిర్వహించిన తర్వాత వార్షిక పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల్లో నెలకొన్న భయం తొలగిపోయేది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో లేనిది నిఘానేత్రం టెన్త్ క్లాసు వార్షిక పరీక్షల్లో పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రాల్లో లేని సీసీ కెమేరాల వ్యవస్థ టెన్త్‌లో ఎందుకన్న ప్రశ్నకు సమాధానం లేదు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అంతా ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది నుంచి సీసీఈ విధానం ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించారు. సీసీఈ అంటే తెలియక విద్యార్థులు, ఎలా పాఠాలు చెప్పాలో బడి పంతుళ్లు పరేషాన్ అవుతున్నారు. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలియని పరిస్థితి. పూర్తిగా పాఠ్యాంశాలను, ఒంట బట్టించుకుంటే తప్ప ప్రశ్నలకు జవాబులు రాయలేని స్థితి. ఐచ్ఛికాలు లేకుండా ప్రశ్న పత్రాలను రూపొందించిన విధానం వల్ల ఇప్పటికే టెన్త్ విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. గత ఏడాది చాలా జిల్లాల్లో సైన్సు, గణితం, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 50 శాతం మంది తప్పారు.
ప్రశ్నాపత్రాల మోడల్, పాఠ్యాంశాలు అర్థం కాక టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’ చందంగా సీసీ కెమేరాలంటూ ప్రభుత్వం అదరగొడుతోంది. దీంతో విద్యార్థులు తికమక పడుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాలో సుమారు మూడువేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 250 మంది దాకా పరీక్ష రాస్తారు. ఒక్కో కేంద్రంలో 15 సీసీ కెమేరాలు, ఒక కంప్యూటర్ అవసరం. వీటి ఖర్చు సుమారు రూ.2లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనైతే ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రైవేటు మేనేజ్‌మెంట్లు మాత్రం ‘‘మేం ఎందుకు, ఎక్కడినుంచి రెండు లక్షల రూపాయలు తేవాలి’’ అని ప్రశ్నిస్తున్నాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందనుకుంటే ఇప్పుడున్న తనిఖీ బృందాలు, పర్యవేక్షక బృందాలకు తోడు అదనపు బృందాలను నియమించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు లేని సీసీ కెమేరాల పద్ధతి టెన్త్ క్లాస్‌కు ఎందుకు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో డీవో, సీఎస్, సిట్టింగ్ స్క్వాడ్, పోలీస్, రెవెన్యూ అధికారులను అవమాన పరచడానికే నిఘా కెమేరాల ఏర్పాటన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాకమిటీ ఛైర్మన్లు, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఒక ఏడాది ముందుగనే ప్రకటిస్తే బాగుండేది. ఈ విధానం విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. విషయంపై పూర్తి అవగాహన కలగని విద్యార్థులు మరింత గందరగోళంలో పడిపోతారు. నిజానికి పరీక్ష అంటేనే విద్యార్థుల్లో ఒక విధమైన బెరుకు ఉంటుంది. ప్రభుత్వం వారిని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి మరింత బెదిరించకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మరో ఏడాదికి వాయిదా వేస్తే బాగుంటుంది.

- రావుల రాజేశం