సబ్ ఫీచర్

పాక్ ఆక్రమిత ప్రజల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా ఆలస్యంగానైనా మానవ హక్కులకోసం ఆక్రమిత కాశ్మీర్ వాసులు స్పందించడం ప్రపంచ మానవ హక్కులను ప్రశ్నిస్తున్నది. ప్రపంచ మానవాళిక ఈ విచక్షణ ఒక కొరడా దెబ్బలాంటిది. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ప్రజాపాలనపై మానవతావాదులు ఏనాడు సై అన్నది లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పాక్ ప్రభుత్వ ఉక్కు కౌగిలినుండి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఏనాటినుండో అక్కడి ప్రజలు కోరుకొంటున్నారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల ప్రజలనుంచే పాక్ పాలనకు వ్యతిరేకంగా రాజధాని ముజఫరాబాద్, గిల్గిత్, కోట్లి తదితర ప్రాంతాల్లో కొంతకాలం క్రితం పాక్ ప్రభుత్వంపై నెలకొన్న అయిష్టతకు నిరసనగా నగరాలలో వెల్లువెత్తిన జన ప్రదర్శనలు అందుకు ఉదాహరణ. పాక్ ప్రభుత్వానికంటే భారతదేశ ప్రభుత్వమే తమకు రక్షణ మానవ మనుగడకు అపారమైన ఊతమిస్తున్న దేశంగా అక్కడి ప్రజలు గుర్తించారు. తమను భారతదేశంలో విలీనం చేయాలన్న డిమాండుతోపాటు నిరసన ప్రదర్శనలు హోరెత్తడంతో పాక్ ప్రభుత్వం హడలెత్తుతోంది. అది పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న కీలక సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం పాక్ సర్కార్‌కు మింగుడు పడలేదు. అన్నింటికన్నా పాకిస్తాన్ దుర్భర పరిపాలనలో మనగలగడంకంటే, ఎన్నోరెట్లు మేలైన భారత్‌లో త మ ప్రాంతాలను కలిపేయాలంటూ ఆందోళనకారుల నినాదం వెనుక పాక్ ప్రభుత్వ నిరంకుశ, నియంత పాలన బోధపడుతోంది.
గతంలో పాక్ ఆక్రమితవాసులు ఎన్నో ఆటుపోట్లకుగురైనా ఎన్నో పోరాటాలను అధిగమించినా, పాక్ తరహా పాలన తమకు వద్దంటున్నా ఆందోళనకారులు ప్రస్తుతం నినదించడం ఇదే మొదటిసారి అని చెప్పక తప్పదు. ఈ తరహా వ్యతిరేకతను పాక్ పాలకులు ఏనాడు రుచి చూడలేదు. ఈ నిరసన పాక్ విధాన నిర్ణేతలకు తలనొప్పిగా పరిణమించింది. గతంలో అడపాదడపా ఇలాంటి ఉద్యమాలు ఊపందుకొన్నా తమ సైనిక బలంతో అడ్డుకొన్న సంఘటనలు బోలెడన్ని ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆవిధంగా లేదు. అయితే పరిస్థితులను విశే్లషించి దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి మాత్రం పాక్ పాలకులకు చేతులు రావడం లేదు. అంతేకాదు ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రతిసారి ఎన్నికల ప్రక్రియను మొక్కుబడిగా నిర్వహిస్తూ, అధికార పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్, దౌర్జన్యాలతో ఓటర్లను అనుకూలంగా మార్చుకోవడం అక్కడ పరిపాటి అయంది. పాక్ అసెంబ్లీలో పీఓకేకు అసలు ప్రాతినిధ్యమే లేదు. పీఓకే ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సంక్షేమం, అభివృద్ధి వంటి విషయాల్లో పాలకులకు ఎప్పుడూ చిన్నచూపే.
పీఓకే పరిస్థితి ఇలా ఉంటే బలూచిస్థాన్, ప్రావెన్స్‌ది భిన్నమైన పరిస్థితి. బలూచి పౌరులు పాక్‌తోపాటు, ఆప్ఘాన్, ఇరాన్లలో విస్తరించి ఉన్నారు. కానీ పాక్‌లో మాత్రం అణచివేతకు గురవుతున్నారు. పాక్‌లో తమ ప్రావిన్స్ కలయికే అక్రమంగా జరిగిందనేది అక్కడి ప్రజల వాదన. అందుకే పాక్‌లో అంతర్భాగంగా ఉండేందుకు వారు అంగీకరించడం లేదు. దశాబ్దాలుగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం, కనీసం స్వయంప్రతిపత్తికోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో భాగంగా బలూచిస్థాన్‌పై పాక్ ఇప్పటివరకు అయిదుసార్లు సైనిక చర్యలకు పాల్పడింది. ఈ పోరాటాలలో సుమారు 19వేల మంది బలూచీలు బలయ్యారని, మరెంతోమంది జాడ ఇంతవరకు కానరావడం లేదని బలూచీల అంచనాలు. 2006లో బలూచిస్థాన్ నాయకుడు నవాబ్ అక్బర్‌ఖాన్ బుగ్లీ పాక్ సైనికుల చేతుల్లో హతులయ్యారు. ఆప్ఘాన్‌లోని బలూచి పౌరుల్ని తాలిబన్ల ద్వారా పాక్ వేధింపులకు గురిచేస్తోంది. దేశంలోని నాలుగు ప్రావిన్స్‌లైన పంజాబ్, సింథ్, బలూచిస్థాన్, బైబర్ పక్తూర్‌క్వాల్లో బలూచిస్థాన్ అతి పెద్దది. బలూచిస్థాన్ యురేనియం, బంగారం, బొగ్గు, రాగి నిల్వలకు నిలయమైంది. అంతేకాకుండా దేశానికి రెండో అతిపెద్ద సహజ వాయువు సరఫరాకు బలూచిస్థాన్ స్థావరం కావడం గమనార్హం. తమ ప్రాంత సహజ వనరుల్ని పాక్ దోచుకుంటూ తమ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్ల శ్రద్ధచూపడం లేదనేది అక్కడి ప్రజల్లో బలంగా నాటుకొంది.

- దాసరి కృష్ణారెడ్డి