సబ్ ఫీచర్

అవార్డుల్లో నిజాయతీ ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఏ దేశంలోను లేని విధంగా అనేక పురస్కారాలు లభిస్తున్నాయి మన భారతదేశంలో. భారతరత్న మొదలుకొని అర్జున్, ద్రోణాచార్య, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా పురస్కారాలు ప్రదానం చేస్తుంది మన ప్రభుత్వం. మన దేశాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే జవాన్లకు యిచ్చే ‘అశోకచక్ర’, ‘శౌర్యచక్ర’, ‘పరమవీర చక్ర’లాంటి పురస్కారాలలో మాత్రం నిజాయితీ, గుర్తింపు, గౌరవం వుందని భావించవచ్చు. మిగతా పురస్కారాలు మాత్రం రాజకీయ పలుకుబడి, పైరవీలను తిరస్కరంచలేక, ఒత్తిళ్లకులొంగి కాదనలేక ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలనుకోవలసిందే. పలానా పురస్కారం పలానా వారికిచ్చారు నాకు యివ్వలేదని బాహాటంగా ప్రకటించేవారు కొందరు, పలానావారికి పలానా పురస్కారం యివ్వాలని పార్టీలపరంగా గోలచేసేవారు కొందరు, నాకంటే క్రిందిస్థాయిలో వుండే పలానా వ్యక్తికి పురస్కారం యిచ్చారు. తనను నిర్లక్ష్యం చేశారంటూ క్రీడాశాఖకు చురకలంటించేవారు కొందరు, యిలా పురస్కారాలకోసం వెంపర్లాడే వ్యక్తులున్నంత వరకు అసలుసిసలు అర్హతలున్నవారికి పురస్కారాలు లభించవన్నది యధార్థం.
అలనాడు రాజకీయ పలుకుబడి, పైరవీలు చేయలేకపోయారు కాబట్టే మహానటులు యస్వీఆర్, మహానటి సావిత్రి, విలక్షణ తారలు జమున, వాణిశ్రీలకు పద్మశ్రీలాంటి పురస్కారాలు లభించలేదు. కాని వారు కోట్ల ప్రేక్షకుల హృదయాలలో నేటికి జీవించి వున్నారు. నిజంగా అర్హతకలవారికి పురస్కారాలు యిస్తే ఆ పురస్కారానికే విలువ వస్తుంది. అర్హతలు యోగ్యతలు లేని వారికి పురస్కారాలు ప్రకటిస్తే ఆ ‘పురస్కారాని’కే అవమానకరం. పురస్కారాలు ప్రకటించవలసింది పార్టీలపరంగా, రాజకీయ నాయకుల గగ్గోలుకు కాదు, ప్రజలు అభిమానించే వ్యక్తులకు యివ్వాలి. మహనీయులు చాచాజి, రవీంద్రనాథ్‌టాగూర్, సి.వి.రామన్, యం.జి.ఆర్. అలా గొప్పవారికి పురస్కారాలిస్తే సంతోషించవచ్చు. మదర్‌థెరిసాకు భారతరత్న- నోబెల్ పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాలి. వారంతా పురస్కారాలకోసం పైరవీలు చేయలేదు. కావాలని కోరలేదు.
మన చలనచిత్ర రంగ అవార్డుల విషయానికొద్దాం. ఆ వుడ్ ఈ వుడ్ అనే బేధంలేకుండా సినిమా రంగాన్ని కొన్నికొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయ. గుప్పెట్లో పెట్టుకుని చిత్ర రంగాన్ని పాలిస్తున్నాయి. ఎక్కడ సినిమా అవార్డులిస్తున్నా కమిటీవారు ఏ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టకుండా, మరచిపోకుండా కుటుంబ అవార్డులు అందజేస్తున్నారు. అదే మనం హాలీవుడ్ రంగాన్ని పరిశీలిస్తే ఏ చిత్రమైనా, కళాకారులైనా అర్హతవరకు వెళ్లారా అంటే ‘గ్రామిఅవార్డు’ల్లో ‘ఎమ్మిఅవార్డు’లో, ‘గోల్డెన్‌గ్లోబ్ అవార్డు’లో, ‘బాఫ్తా అవార్డు’ల్లో చిత్ర స్థాయి, నట స్థాయి ఎంతవరకు గుర్తించబడినదో గమనించిన పిదపే ఆస్కారు అవార్డు రేసుకు వెళ్లగలిగేది. అలా ఉత్తమస్థాయి నిర్ణయించబడిన పిదప ఆస్కార్ అవార్డు ఫలితాలు ప్రకటించేది. అందువలన హాలీవుడ్ ప్రదానంచేసే ఆ ఆస్కార్‌లో విలువలకే పురస్కారాలు లభిస్తాయి. నిర్ణయమంటే అలావుండాలి. మరి మన టాలీవుడ్ పురస్కారాలు అలా విలువలను గుర్తించి ప్రకటిస్తున్నారా?
నిజంగా అవార్డుల కమిటీవారికి చిత్రస్థాయి, నట స్థాయిపై అవగాహన వుందా అనిపిస్తుంది. అవార్డులు అందుకున్న టాలీవుడ్ వారంతా ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల’లో చిరునామా వుండదేం? అవార్డు ఎంపికలో నిజాయితీ వుండాలి. స్వార్థం తన పరబేధం వుండరాదు. చాలామంది పాఠకులకు తెలియని విషయం చెబుతాను. హాలీవుడ్‌లో హాలీవుడ్ వరస్ట్ పిక్చర్స్ అవార్డు కమిటీ (హాలీవుడ్ చెత్త చిత్రాల అవార్డు కమిటీ) అంటూ ఓ కమిటీ వుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. వేలాదిమంది ప్రేక్షకులు ఆ కార్యక్రమానికి హాజరౌతారు. అందులో ‘ఈ సంవత్సరపు పరమచెత్త చిత్రం, ద్వితీయ చెత్త చిత్రం, ఈ సంవత్సరపు అతి చెత్త హీరో, పరమ చెత్త హీరో, అతి చెత్త హీరోయిన్, పరమచెత్త హీరోయిన్ అలా సాగుతుంది ఆ కార్యక్రమం. కాని ఆ కార్యక్రమానికి అవార్డులు అందుకునేందుకు అవమానభారంతో హాలీవుడ్ కళాకారులు వెళ్లరు. కనుక ఆ అవార్డులు ప్రకటించడంలో నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేక్షకులు ఉత్తమ చిత్రాలు చూడగలరు, అంతవరకు ‘పరమచెత్త’లే మనకు గతి!

- మురహరి ఆనందరావు