సబ్ ఫీచర్

విద్యాలయాల పవిత్రతను కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనువు’ మానవుని మనుగడకు మార్గదర్శనం చేసిన మహనీయుడు. సనాతన ధర్మంలోని భారతీయ జీవన సత్యంలో తల్లిని మించిన దేవత మరోటి లేదనేది యుగాలను అధిగమించిన భారత జాతీయ స్వభావానికి నిదర్శనం. అక్షరాలు దిద్దంచే ఉపాధ్యాయుడి కంటే సంస్కారాలను అందించే ఆచార్యుడు పదిరెట్లు గౌరవనీయుడు. ఆచార్యుడు కంటే జన్మకు కారకుడైన తండ్రి నూరురెట్లు వందనీయుడు. తండ్రికంటె పేగును పెనవేసుకుని తొమ్మిది నెలలు మోసిన కన్నతల్లి లెక్కకట్టలేనన్ని రెట్లు పూజనీయురాలు. ఇది భూమండలంలో తొలి ధర్మ ప్రవర్థకుడైన మనువు మనకందించిన పవిత్ర జీవన సూత్రం. అందుకే మనువు మానవజాతికి వందనీయుడు అభినందనీయుడు. ఈ సత్యాన్ని అర్ధం చేసుకోలేనివాళ్లు, దీనిని వ్యతిరేకించేవాళ్లు మానవుని మనుగడను చూసి సహించలేని మానసిక వికలాంగులు దానవుల పరంపరకు చెందినవారై ఉండాలి. ఒక వ్యక్తికి తల్లి అయిన స్ర్తి ఇంత గొప్పదైతే కోట్లాది వ్యక్తులతో కూడిన భూమి ఈ భూమి బిడ్డలకు తల్లి. వ్యక్తులకు తల్లిని మించిన దైవం లేదో, ఈ జాతికి భరతమాతను-పృధ్వీ మాతను మించిన దైవం లేదనేది సనాతన సత్యం.
జెఎన్‌యులో మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన వామపక్ష ఏఐఎన్‌ఏ, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి నేతలను జెఎన్‌యు అధికారులు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా మనుస్మృతి దహనం చేయడం ఇదే తొలిసారి కాదని, ప్రాచీన న్యాయగ్రంథమైన మనుస్మృతిని కాల్చివేయడంలో తప్పేముందని జెఎన్‌యు విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. మనుస్మృతి ప్రాచీన న్యాయ గ్రంథమని, దీనిని గతంలో కూడా దగ్ధం చేసారన్న విషయం తెలిసిన జెఎన్‌యు విద్యార్థులు మళ్ళీ ఇప్పుడెందుకు తగలబెట్టాల్సి వచ్చింద్న విషయం ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతున్నారు? అంటే వీరి దగ్గర సమాధానం లేకనే కదా! ప్రస్తుతం అమలులో లేని ప్రాచీన న్యాయ గ్రంథమైన మనుస్మృతి ద్వారా వీరికి జరిగిన నష్టమేమిటి, కష్టమేమిటి, వీరు దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?
ఉరితీయబడిన అఫ్జల్‌గురు ఇంటికొక అఫ్జల్‌గురు పుడతాడని, కశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, భారత్‌ను ముక్కలు చేస్తామని, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చే జెఎన్‌యు విద్యార్థులను దేశద్రోహులుగా ఎందుకు పరిగణించకూడదు? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దాదాపు వేయి సంవత్సరాలు విదేశీయుల పరిపాలనలోనే మగ్గింది కదా! వారి కాలంలో ప్రాచీన న్యాయ గ్రంథమైన మనుస్మృతి అమల్లో లేదు కదా! స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటికీ కొనసాగుతున్న న్యాయ గ్రంథం (రాజ్యాంగం) డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినదే కదా! మనుస్మృతి ఎవరి కాలంలో, ఎవరికి పూర్వం మన దేశంలో అమలులో వుందో ఎవరైనా చెప్పగలరా? వేల సంవత్సరాలుగా అమలులో లేని ప్రాచీన మనుస్మృతి ఎవరికీ హానికరం కాజాలదనేది అతి సామాన్యుడికి తెలిసిన విషయమే కదా! ప్రస్తుత సమాజానికి సంబంధం లేని మనుస్మృతులను దగ్ధం చేసి సమాజంలో చిచ్చు రగిల్చి వర్గపోరాటాలకు ఆజ్యంపోసి దేశాన్ని నిర్వీర్యం చేయడానికి జెఎన్‌యులో చేసిన నినాదాలు సరిపోవన్నట్టు మనుస్మృతిని కాల్చడం మరో ఆయుధంగా మలుచుకోవడం వీరి దుర్మార్గం కాదా?
విద్యనభ్యసించే నెపంతో విశ్వవిద్యాలయాలను స్థావరంగా చేసుకుని విదేశీ భావజాలాన్ని జీర్ణించుకొని తనకు తానెవరో గుర్తించలేని వాస్తవాన్ని పాతరపెట్టి తనజాతిని, సంస్కృతిని దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మతిభ్రష్టులైన జెఎన్‌యు విద్యార్థులు వాస్తవాలు గుర్తించి అందరికీ నిలయమైన పృధ్వీమాతకు-్భరత మాతకు నష్టాన్ని కలుగచేయకూడదు. సమాజ హితైషులుగా భావి తరాల వారికి మాతృదేశం విశిష్టతను అందించే మార్గదర్శకులు కావాలని ఆశిద్దాం. విద్యాలయాల పవిత్రతను కాపాడుకుందాం.

- బలుసా జగతయ్య