సబ్ ఫీచర్

సేంద్రియ వ్యవసాయమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో ఎక్కడ చూసినా అంతా కల్తీమయం. ఉదయం లేచినప్పటినుంచి మనం తాగే పాలు కల్తీ,తినే ఆహారంలో తీసుకునే పప్పులు, బియ్యం, మిరప పొడి, పసుపు, చక్కెర, తినే పళ్లు, అరటి, దానిమ్మ, మామిడి అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు వ్యాపారులు. వారికొచ్చే లాభాలనే ఆశిస్తున్నారు కానీ ఎదుటివారు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారో ఎవరు ఎంత నష్టపోతున్నారో ఆలోచించడం లేదు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయంతో రైతులు ధాన్యాలు పప్పు ధాన్యాలు పండించేవారు. అవి తినడంవల్ల గతంలో వారు ఆరోగ్యంగా వుండేవారు. కానీ ఇప్పుడు పండించే ప్రతిపంటా పురుగుల మందులతో విషతుల్యం అవుతున్నాయి. వాటిని మనిషి ఆహారంలో ఉపయోగించడంవల్ల నానా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఒకప్పుడు మనిషి వందేళ్లు బతికుంటాడని నానుడి.కానీ ఇప్పటి మనిషి యాభై ఏళ్లకే వంద ఏళ్ల మనిషిలా కుంగిపోతున్నాడు. మనం తినే ఆహారం సేంద్రీయ ఎరువులతో పండించేట్టయితే మనిషి ఆరోగ్యంగా వుండే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి రైతాంగం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సేంద్రీయ ఎరువులతో పంటలు పండిస్తూ తమ ఇంట సిరులు కురిపించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండించే రైతుల దగ్గరకు వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి వెడుతున్నారు.
రైతులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు అదేవిధంగా మార్కెట్‌లో అధిక ధరలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పేర్కొంటున్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా తాను పండించిన వరి ధాన్యానికి క్వింటాకు 6వేల వరకు బియ్యం అమ్ముడుపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. మామూలుగా పత్తి రసాయన ఎరువులు వేస్తే ఒక రైతు ఎంత పండిస్తాడో, దానికన్నా అధికంగా రెండు రెట్లు సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాధ్యం అవుతుందని రైతులు నిరూపిస్తున్నారు. సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలను రైతులంతా ఒక యూనిట్‌గా ఏర్పడి సేంద్రీయ ఎరువుల రైతు సహకార సంఘంగా ఏర్పడి మార్కెటింగ్ రంగంలో నిలబడాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలను తినడంతో మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వుండి చిరకాలం ఎలాంటి రోగాల బారిన పడకుండా వుండే అవకాశం వుంటుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తిని ఆరోగ్యంగా వుండాల్సిన అవసరం వుంది. ప్రభుత్వం కూడ ప్రకృతి వ్యవసాయానికి ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది.

- గుండు రమణయ్య