సబ్ ఫీచర్

అంత జీతాలు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ప్రజాప్రతినిధులు అంటూ వివిధ రకాలైన రాజకీయ నాయకులు చాలామంది బయల్దేరారు. వీరందరికీ లక్షల్లో జీతాలు ఇవ్వాలని వారికి వారే రాసేసుకుని చట్టాలు చేసేసుకుని జీతాలు దండుకుంటున్నారు. ఇంతకంటే నైతిక దివాలాకోరుతనం ఎక్కడా ఉండదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రజాధన పరిరక్షణ బాధ్యతని విస్మరించి లక్షల్లో జీతాలు పెన్షన్లు పుచ్చుకోవటం స్వాతంత్య్రోద్యమ త్యాగస్ఫూర్తికి విరుద్ధం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నీలం సంజీవరెడ్డి యువకుడిగా ఉన్నపుడు డా.పట్ట్భా సీతారామయ్యగారి ఇంటికి బందరు వచ్చి అయ్యా స్వాతంత్య్రం వచ్చింది అందరూ పదవులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరూ మీ ప్రయత్నం మొదలుపెట్టరా అని కోరితే నాయనా స్వా తంత్య్రం తేవటం మన ధర్మం మన ధర్మాన్ని కొంతవరకూ నెరవేర్చాం. అయితే పూర్తి స్వాతంత్య్రం అనేది నిస్వార్థబుద్ధితో సాధించాలి. పదవుల కోసం పాకులాడుట మంచిది కాదన్నారు.
ప్రజాధనాన్ని రాజకీయ నాయకులు వారి వారి తాబేదారులు అన్ని రకాలుగా దోచుకొని విదేశీ బ్యాంకుల్లో దాచుకోవటం ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అవినీతి వైపరీత్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అవినీతిపరులైన నాయకుల్లో మన దేశంలోని ప్రజాప్రతినిధుల పేర్లు ఎక్కువగా ఉన్నాయని తాజా సర్వే వెల్లడి చేస్తోంది. చట్టసభల్లో సభ్యులు అత్యంత ధనసంపన్నులు అయినప్పటికీ వారికి లక్షల్లో జీతాలు అలవెన్సులు ఎందుకివ్వాలో అంతుపట్టని ప్రశ్న. రాష్ట్రంలో దేశంలో ఆర్థికంగా ఎటువంటి అవకాశాలు లేనప్పటికినీ వీరికి ఇంతింత మొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేసి ఇవ్వటం ఎంతవరకూ సమంజసం? దేశవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాల రైలు బస్సు విమానాలు అన్నీ ఉచితం. ఇల్లు బస ఏర్పాట్లు అన్నీ ఉచితం అయితే ఇంతింత జీతాలు ఎంతవరకూ సముచితం? ఉచితంగా పనిచేసే అలవాటు ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ లేరు. ఎవరికి కావలసిన లంచం వారికి ముట్టచెప్పేస్తేనే ఏమైనా పని సాగుతుంది. లేదంటే అక్కడికక్కడ పన్లు ఆగిపోవాల్సిందే. ప్రజాప్రతినిధులం అంటూ కొందరు భుజకీర్తులు తగిలించుకొని లంచాలు కోరేవారు చాలామందే ఉన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి పనిలోనూ తమ వాటా కోసం వెంపర్లాడేవారే ఎక్కువ. ప్రస్తుత గత చట్టసభల్లో అధిక శాతం ధనవంతులే ఉన్నారు. తమ ఆస్తులు వ్యాపారాలు లాభాలు వంటి అంశాలపై ఆడిట్ లెక్కలు అప్పచెప్పి ఆదాయపు పన్ను కట్టేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కోవలసి వస్తోంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ జీతాలు పుచ్చుకుంటున్నారంటే వీరు ఉద్యోగులుగానే భావించాలి. వీరికిచ్చే జీతాలు అధిక మొత్తంలో ఉంటున్నాయి. వీరందరూ వారి వారి పనికి హాజరులేకుండానే జీతాలు ఇస్తున్నారు. వీరికి ఉద్యోగ వ్యవస్థ కిందికి రాకున్నప్పటికీ బాధ్యతలు వర్తింపులుండటం లేదు. ప్రజాసమస్యలు వెలుగులోకి తేవటం లేదు. పరిస్థితులు చక్కదిద్దే ఎటువంటి పనులు చేయకుండానే జీతాలు అలవెన్సులూ పొందుతున్నారు. రాయితీలు అలవెన్సులు, జీతాలు, రవాణా భత్యం, దినభత్యం ఆ భత్యం ఈ రకంగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నప్పటికీ ప్రజాసమస్యలు పరిష్కారం కావటం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అలవాటైన జాడ్యం.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో చట్టసభల్లో జీతాలు తక్కువ అలవెన్సలు ఎక్కువ చేసుకొని మరీ ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుండానే డబ్బు లూటీ చేస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. జీతాలు అలవెన్సులు సౌకర్యాలు, భత్యాలు ఒకటేంటి అన్ని విధాలుగా ఆదాయం పొందుతూ ఆస్తుల వివరాలు తెలియచేయకుండా తప్పించుకుపోతున్నారు. ఉద్యోగులు డి.ఏ. పెంచాలన్నా, జీతాలు పెంచాలన్నా కమిటీలు, కమీషన్లు, నివేదికలు, ఎనామలిస్ కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగులు తమకి న్యాయంగా రావలసిన జీతాలు కరువుభత్యాలు కోరుతున్నప్పటికీ పట్టించుకోకుండా చెవిటి వారి వలే నటించడం జరుగుతోంది.

- ఎన్.నాగేశ్వరరావు