సబ్ ఫీచర్

సైకిల్‌తో వ్యాయామం ఆరోగ్యం.. ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజుల్లో సైకిళ్ళ వాడకం తగ్గిపోయింది. సైకిల్‌మీద ప్రయాణం చేసేవారు స్వల్ప శాతంలో ఉంటున్నారు. ఈ రోజుల్లో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ ఎక్కువగా ప్రయాణ సాధనాలయ్యాయి. పూర్వంలో కార్లను సంపన్నులే ఉపయోగించేవారు. సామాన్య ప్రజల ప్రయాణ సాధనం సైకిలు. ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి ఋణ సదుపాయం పొందే అవకాశం లభించడంవల్ల, ప్రతివారూ లోన్ తీసుకుని కార్లు, బైక్‌లు కొని వాడుతున్నారు. ఆ వాహనాల నుంచి వచ్చే పొగవల్ల వాతావరణం కలుషితమవుతోంది.
అందువల్ల ఈమధ్య చాలామంది సైకిళ్ళ పట్ల మొగ్గు చూపుతున్నారు. సైకిల్ తొక్కడం వలన కలిగే లాభాలేమిటి, సైకిలు తొక్కడం ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నదీ ప్రతివారూ తెలుసుకోవాలి. సైకిల్ వాడటంవల్ల వాతవారణంలో ఏర్పడే కాలుష్యాన్నీ నివారించవచ్చు. వారు ప్రత్యేకంగా ఇంధనం కోసం కొంత సొమ్మును ఖర్చుచేయవలసిన అవసరమూ ఉండదు.
సైకిల్ తొక్కడంవల్ల పొడవు పెరుగుతారు. కండరాలు దృఢపడతాయి. ఉదయం సమయంలో సైకిల్‌మీద బయటకు వెళ్ళడంవలన (మిగిలిన వాహనాలకంటే సైకిల్ వేగం తక్కువగా ఉంటుంది) శరీరానికి సూర్యరశ్మి శోకి డి విటమిన్ అందుతుంది. శరీరంలో నిలవ వున్న కొవ్వు కరుగుతుంది. కండరాలు బిగుసుకుపోకుండా కదలికగా ఉంటుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె పనితీరు బాగుంటుంది. కీళ్ళల్లో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. సైక్లింగ్ చేయడమన్నది చక్కని వ్యాయామం.

-కె.నిర్మల