ఐడియా

భయం ...భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి విజయం సాధించాలంటే శక్తి, సంకల్పం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి మొదలైన ఎన్నో సుగుణాలు వుండాలి. నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలిగి వుండాలి. మన వర్తమాన నడవడికలో అభివృద్ధి, భవిష్యత్తులో మనం సాధించబోయే విజయాలు మన ఆలోచనలమీదే ఆధారపడి వుంటాయి. మనం ఏమి సాధిస్తున్నాం అన్నదానికన్నా ఎలా తయారవుతున్నాం అన్నది ముఖ్యం. చాలామంది పనిని ప్రారంభించే ముందు పరాజయం పొందుతామేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. పరాజయాలని గుర్తించి ఆలోచిస్తే లక్ష్యసాధన కష్టతరం అవుతుంది. సందేహాలు, భయాలు, మనోవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. భయం విజయానికి శత్రువు. చిన్న చిన్న విషయాలమీద ఎక్కువగా ఆలోచించడం కూడా భయాన్నీ, మన ఉనికికే ముప్పు కలిగేలా చేస్తుంది. కాబట్టి భయాలు, ఆందోళనల్ని, వీలైనంత త్వరగా విడనాడాలి. నమ్మకంతో ముందుకు సాగాలి.
విజయపథంలో వినయానికి గొప్ప ప్రాధాన్యం వుంది. అంతా తమకు తెలుసు అన్న అహంభావం ఎంతో దూరం ముందుకు సాగనివ్వదు. విజ్ఞానార్జనకు అంతస్తులు తర తమ భేదాలు అడ్డుగోడలు కావు. మనకంటే తక్కువ వయసువారైనా, హోదాలో చిన్నవారైనా మనకు కావలసింది అడిగి తెలుసుకోవటానికి వెనుకాడకూడదు. మనం అవతలివారి నుంచి లాభం పొందినపుడు అది చిన్నదయినా, పెద్దదైనా కృతజ్ఞతలు తెలియజేయటం కనీస ధర్మంగా భావించాలి. మహాప్రవాహంలో ఎంతటి మహావృక్షమైనా ఉద్ధృతానికి కొట్టుకునిపోవలసిందే. అదే సాధారణ గడ్డిపోచ నీళ్లవేగానికి తలవంచుకుని క్రమంగా వడి తగ్గగానే తల ఎత్తుతుంది. వివేకవంతుడి లక్ష్యసాధన ఇటువంటిదే. ఇబ్బందులు తలెత్తడం సహజం. విశాల మనస్తత్వంతో వాటిని ఎదుర్కోవాలి. మన చుట్టూ జరిగే ప్రతి సంఘటన మనల్ని మరింత వివేకవంతుల్ని చేయాలి.
అభివృద్ధి సోపానాలు
లక్ష్యసాధనలో భాగంగా మనం అనేక రకాల పనులు చేస్తుంటాం. కొన్ని పనుల్లో ఫలితం కనిపించకపోవచ్చు. అయినంత మాత్రాన నిరాశ చెందకూడదు.ఏ సమయానికి ఏ పని చెయ్యాలన్నది మీ పరిస్థితులకనుగుణంగా టైమ్ టేబుల్ తయారుచేసుకోండి. కొంత సమయం ముందే ప్రారంభించి ముందుగానే ముగించడం ద్వారా ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.
మొదట నీళ్ళల్లో దిగాలనుకున్నపుడు ‘బాప్‌రే‘ అనిపిస్తుంది. ఒకసారంటూ అలవాటుపడ్డాక తర్వాత ఈదవలసి వస్తే, ఒస్ ఇంతేనా అంటాము. సబ్జెక్ట్స్ విషయమూ అంతే. మొదట ఇష్టమైన పనితో ప్రారంభించండి.
మరీ ఆశకు పోకుండా కొద్దిదయినప్పటికీ సత్వరమే ఫలితాన్నందించే పనిని ఆరంభించినపుడు తద్వారా పొందిన ఫలితం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తదుపరి పని వేగవంతం అవుతుంది.
చక్కగా మాట్లాడటం నేర్చుకోండి. మాట్లాడే సమయంలో ఎదుటివారి చూపుల్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే మనలో ఆత్మవిశ్వాసం లోపించిందన్నమాటే.
ఓటమి సహజం. ఓడిపోయిన సందర్భాల్నే గుర్తుచేసుకోండి. మీరు సాధించిన విజయాల్ని పదే పదే మననం చేసుకోండి. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వ్యక్తిత్వంలో మార్పు రానీయకుండా చూడండి.
ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినండి. దయాగుణాన్ని అలవర్చుకోండి. నిరంతరం ఉత్సాహంగా ఉండండి. ఉత్సాహం ముఖంమీద చిట్లింపులు పోగొట్టి ఫ్రెష్‌నెస్‌ని ఉంచుతుంది.

-బి.మాన్‌సింగ్ నాయక్