సబ్ ఫీచర్

పింక్ స్ర్తీలకే సొంతమా?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ణ వివక్షత, జాతి వివక్షత లాంటివాటి గురించి విన్నాం. చదువుకున్నాం. కాని ఓ రంగును లింగ వివక్షతకు నిదర్శనంగా భావిస్తోంది నేటీ ఆధునిక సమాజం. పింక్ కలర్‌ను బాలికల సొంతం చేసి వివక్షత చూపటం తగదంటున్నారు స్రీవాదులు. ఒకవేళ ఈ కలర్ షర్ట్ మగపిల్లలు ధరిస్తే వారు అయ్యో!అని అవమానాల పాలుకావల్సిందే. దీనికి ఉదాహరణ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ను గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం పింక్ కలర్ షర్ట్ సినిమాల్లో ధరించి ఇబ్బందులు పాలయ్యారు. మహిళాసాధికారితకు నిదర్శనంగా ఈ కలర్‌ను భావించి ఆ కలర్ షర్ట్ ధరిస్తే మగవారిని చులకనగా చూడటం తగదని స్ర్తివాదులు సైతం అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో గులాబీ గ్యాంగ్ సంస్థకు చెందిన మహిళలు ఈ కలర్‌ను ఎంచుకోవటమే ఈ వివక్షతకు దారితీసింది. ఆనాటి నుంచి ఈనాటీ వరకూ ఈ రంగును మహిళలకు పరిమితం చేసి వివక్షత ప్రదర్శించటం జరుగుతోంది. ఆ రోజుల్లో గులాబీ గ్యాంగ్‌ను స్థాపించేటపుడు రాజకీయ పార్టీలతో సంబంధం లేని కలర్‌ను ఎంపికచేసుకోవాలని భావించి ఈ కలర్‌ను ఎంచుకున్నామని గులాబ్ గ్యాంగ్ స్థాపకురాలు సంపత్ పాల్ అంటున్నారు. ఎందుకంటే యూపీలో బిఎస్‌పి కలర్ బ్లూ, సమాజ్‌వాదీ పార్టీ కలర్ ఎరుపు దీంతో స్వేచ్ఛకు సంకేతంగా ఆనాడు తాము ఈ కలర్ యూనిఫాం ధరించాలని భావించామని సంపత్ పాల్ అంటున్నారు. ఓ వైపు అందరూ సమానమే అంటారు. ఇలా వర్ణాల్లోనూ లింగ వివక్షత చూపటమేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు.
కేరళలోనూ పింక్‌కు ప్రాధాన్యత
అక్షరాస్యత అగ్రగామిగా ఉండే కేరళలో మహిళలకు సంబంధించిన ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని పాలకులు ఆలోచిస్తే ఆ పథకానికి సంబంధించి రంగును పింక్ ఎంపికచేయటం పరిపాటైంది. అక్కడ మహిళలు క్యాబ్స్ నడిపితే వాటి కలర్ పింక్, మహిళా పోలీసుల యూనిఫాం పింక్, స్పెషల్ ఉమెన్ ఫోర్స్‌కు ఉపయోగించే వ్యాన్ రంగు సైతం పింక్‌గా నిర్ణయించటం జరిగింది. కేరళలో ఆపదలో ఉన్న మహిళ 1515కు ఫోన్ చేస్తే చాలు పింక్ పెట్రోలింగ్ వాహనం వారి ముందు వాలిపోతుంది. ఓహో..గులాబీ బాల! అందాల ప్రేమ మాల అని అరవిరిసన అందానికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు వనితలకు పరిమితం చేసి వివక్షత ప్రదర్శించటం తగదని స్ర్తి వాదుల ఆవేదన.
*

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03