సబ్ ఫీచర్

సీతారాముల పేర్ల మార్పు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలంలో భద్రాద్రిపై వెలసిన శ్రీ హనుమత్సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తివారి పేరు ‘రామ నారాయణ’అని సీతాదేవికి సీతామహాలక్ష్మి అని పేర్లను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విధానమెంతమాత్రము సరియైంది కాదు. సీత సీతే, రాముడు రాముడే అని వ్యవహరించాలి. పేర్లుమార్చి వ్యవహరింనట్లయతే ప్రత్యక్ష ప్రత్యవాయం కలుగుతుంది.
ధర్మసింధువులో; పంచాయతన దేవతలను గురించిన ప్రస్తావనలో యిట్లు వ్రాయబడినది.
రామార్చన చంద్రికలో
శ్లో॥ ‘‘రామచంద్రం యజేన్మధ్యేవామేజనకనందినం
దక్షిణే లక్ష్మణంచైవ అగ్రతో మారుతిం తధా’’॥
ఈ శ్లోకమునకు హిందీలో అర్ధమును వివరిస్తు
శ్రీ సుదామామిశ్రశాస్ర్తీగారు ఈవిధంగా రాశారు
శ్రీరాములు వారు మధ్యలోనుండగ సీత ఎడమవైపున, శత్రుఘు్నడు రామునకు- సీతకు వెనుక మధ్య భాగమందుండును
కుడి భాగమందు లక్ష్మణుడు వీనికి వెనుక భరతుడు ఒకటైఉన్నారు.
ముందు పాద సన్నిధి యందు ఆంజనేయస్వామివారు ఉంటారు.
1. రాముడు 2. సీత 3.(లక్ష్మణ-్భరత) 4. శత్రుఘ్న 5. ఆంజనేయ’’ అని పంచాయతము చెప్పబడినది. కొన్నిచోట్ల ఆంజనేయస్వామి లేకుండ 1 రాముడు 2 సీత 3లక్ష్మణుడు 4 శత్రుఘు్నడు 5 సీత అని తెలుపబడింది. భరత, లక్ష్మణ, శత్రుఘు్నలు సేవక భావముతోనున్నారు కనుక రామపంచాయతన మయినది అని ధర్మసింధువులో ఉన్నది-
ప్రజలు రామనామముతో మాత్రమే ‘‘రామకోటి’’వ్రాసి భద్రాచల రాములవారికి సమర్పించడమనేది ఎంతోకాలంగా జరుగుచున్న సంప్రదాయం-
ఇక్కడ శ్రీరామచంద్రమూర్తివారికి చేతిలో ‘‘కోదండము’’(్ధనుస్సు- బాణముల పొది) కలవు. మరెక్కడా కూడ రుూ విధానం గోచరించుట లేదు.
భద్రుని చరిత్ర చదివినచో భద్రాద్రిలో ఒక్కచోట మాత్రమే 4 భుజములు గల రాముడు ఉన్నట్లు తెలుస్తుంది.
మన దేశంలో అనేక రామాలయాలున్నాయ. ఏ దేవాలయంలో కూడ కోదండం, 4 చేతులుగల రాముడు గోరించడు- దీని తాత్పర్యమేమంటే రామాయణంలో చెప్పినట్లు శ్రీమహావిష్ణువు అర్ధాంశముతో భూమిపై అవతరించాడు.
1. కోదండము- మానవరూప చిహ్నము 2 చతుర్భుజములు విష్ణురూప చిహ్నము. ఈ విధముగ ప్రాచీనంనుండి వస్తున్న సంప్రదాయం. దీనిని మార్చడం అనర్థదాయకం- కావున రాముడు రాముడే- సీత- సీతయే గాని మరొకటి కాదు- కారాదు-
ఎవరు మార్పుచేయుట కిష్టపడుతున్నారో వారు పశ్చాత్తాపపడి స్వామికి క్షమాపణ చెప్పుకోవలెను- అహంకారమును చూపితే అధోగతియే అగును-
రావణాది రాక్షసవధ కోసం నరావతారునిగ అవతరించాలని, తమను ఉద్ధరించాలని నన్ను దేవతలంతా ప్రార్థించారు. అందుకే ఇలా నరరూపం దాల్చి నీ బిడ్డగా ఉదయించాను. నా స్వస్వరూపాన్ని నీకు అనుగ్రహించడం నీవు తరించడంకోసమే ఇక నీవు కోరినట్లు నీకు ముద్దులు మూటకట్టే పసిబాలుడనవుతాను- అంతేకాదు తల్లీ ఇక రుూ దివ్యస్పృహను పూర్తిగ వీడి సంపూర్ణ నరునిగా సాక్షాత్ ధర్మస్వరూపునిగ చరిస్తాను. ఈ దివ్యత్వం నీకే కాదు నాకూ గుర్తుండదు అంటూ మందహాసవదనుడై పలికాడు శ్రీ మహావిష్ణువు-
తరువాత వసిష్ఠుడు రాముడని పేరుపెట్టాడు- వానినన్నింటిని జాగ్రత్త పరిశీలించవలెను-

- మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ సెల్ : 9397919902