సబ్ ఫీచర్

రాజ్యాంగ స్ఫూర్తి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటవిక సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువుంటుంది. సమాజ నియంత్రణ త క్కువుంటుంది. రక్షణ, భద్రతా తక్కువే. శారీరక బలం, మందిబలం వున్నవారిదే అక్కడ అధికారం. సభ్యసమాజంలో వ్యక్తిస్వేచ్ఛ తక్కువుంటుంది. సమాజ నియంత్రణ ఎక్కువుంటుంది. కాని రక్షణ భద్రత వుంటాయక్కడ. వ్యక్తి, సమూహం, గణం, పౌరసత్వం, సమాజం, రాజ్యం- ఇది రాజ్యావిర్భావానికి పరిణామక్రమం!
ఒక నిర్ధిష్ట భౌగోళిక పరిధిలోని కొన్ని సమాజాలు సమైక్యమైనప్పుడు, రాజ్యం ఏర్పడుతుంది. ఈ సమాఖ్య సమాజాల్లో మత, భాష, సాంస్కృతిక భిన్నత్వాలుండవచ్చు. ఈ భిన్నత్వాలను పరిగణనలోకి తీసుకుంటూనే, దేశమంతటినీ ఏక జాతిగా నిలుపగలిగేది జాతీయభావం! ఈ జాతీయ భావం ప్రజల నిరంతర భావనలో వుండవల్సిందే. ఈ భావనకు భిన్నంగా జరిగే ప్రతి ప్రయత్నాన్ని అణిచేయవలసిందే. అలా అణచకపోతే సమాఖ్య సడలిపోతుంది. భిన్నత్వం కలిగిన ఈ సమాజాలన్నింటినీ చేర్చి ముడివేసి, సమాఖ్యగా వుంచకలిగే సూత్రావళి అవసరం. ఈ సూత్రావళి సర్వజన హితకరంగాను, సర్వజనామోదకంగానూ వుం డాలి. అందుకే, అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, విస్తృతమైన అధ్యయనం చేసి, రాజపత్రాన్ని తయారుచేస్తారు. ఈ ఉమ్మడి రాజపత్రమే ‘రాజ్యాం గం’! ఈ రాజ్యాంగాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభ ఆమోదించాలి. అలా ఆమోదం పొందిన తరువాత, దానిలోని ఏ చిన్న అధికరణనూ (ఆర్టికల్) ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, పార్టీలైనా, ఎంత గొప్పవారైనా రాజ్యాంగంలోని అన్ని అధికరణలనూ అనుసరించవల్సిందే! అయితే, కాలానుగుణమైన అవసరాలనుబట్టి ఏదైనా అధికరణలో మార్పుచేయాలంటే, రాజ్యాంగ సవరణ చేయవచ్చును. ఈ సవరణలను పార్లమెంటు ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి.
భారత రాజ్యాంగాన్ని ఆనాటి కొందరు న్యాయశాస్త్ర నిపుణులు, స్వాతంత్య్ర సమర నాయకులు, మేధావులూ కలిసి విస్తృతంగా అధ్యయనం చేసి, చర్చించి రచించారు. అం దువలన అది సహజంగానే సమగ్రంగా రూ పొందింది. తరువాత కాలంలో కొన్ని సవరణలు చేయబడ్డాయి. అయితే, ఈ సవరణలన్నీ కూడా ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చేసారని చెప్పలేం. కొన్ని మాత్రమే అలా చేయబడ్డాయి. కొన్ని ఆయా ప్రభుత్వాల, పార్టీల అప్రకటిత ప్రయోజనాల కోసం చేయబడ్డాయి. ఇవి కాకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యక్తులూ రాజ్యాంగ పరిధిని అతిక్రమిస్తూనే వున్నారు. అలాంటి వ్యక్తులు ఉద్యమ నాయకుడో, బలమైన కుల, వర్గ నాయకుడో అయితే, సంబంధిత ప్రభుత్వాలు వారి మీద ఏ చర్యలూ తీసుకోవడం లేదు. అందువల్ల, రాజ్యాంగం పరిహాసానికి గురవుతోంది.
ప్రభుత్వాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినపుడు, అది వివాదాస్పదమైతే, సంబంధిత అధికరణల యొక్క నిర్దేశిత అర్థాన్ని వ్యాఖ్యానించి చెప్పవలసిన బాధ్యత సుప్రీంకోర్టుపై వుం టుంది. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అంతిమంగా సుప్రీంకోర్టుదే! అయితే అటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయబద్ధంగానే తేల్చి చెప్పినప్పటికీ, ఆ తీర్పు సకాలంలో రావాలి! సకాలంలో రాకపోతే జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోతుంది. గతంలో కర్ణాటకలో ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వాన్ని కేంద్రం రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ఉపయోగించి రద్దుచేసి, రాష్టప్రతి పాలన పెట్టినపుడు, ఆ పరిస్థితుల్లో 356 అధికరణాన్ని వినియోగించడం చెల్లదని బొమ్మై సుప్రీంకోర్టు నాశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయన కనుకూలంగానే తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఒక సంవత్సరానికొచ్చింది. ఈలోగా రాష్టప్రతిపాలన విధించడం, ఆ కాలం ముగిసిపోవడం జరిగిపోయింది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఏ విధంగా జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఆ బిల్లుపై లోక్‌సభలో ఏం చర్చ జరిగిందో, ఎలాంటి ఓటింగు జరిగిందో, అసలది ఆమోదం పొందిందా లేదా అనే విషయం ఈనాటికీ తెలియదు. బిల్లు ఆమోదం పొం దిందంటూ తలుపులు మూసేసిన చీకటి పార్లమెంటు భవనంలో స్పీకరు చేసిన ప్రకటన మాత్రమే వుంది. అలా జరుగుతుందని ముం దే తెలిసిన ఎల్.కె.అద్వానీ అది చూడలేక, పార్లమెంటు భవనం విడిచి వెళ్ళిపోయారు. ‘్భరత పార్లమెంటరీ చరిత్రలో ఇదొక చీకటి రోజు’’అని ఆ రాజకీయ కురువృద్ధుడు తర్వా త వాపోయారు.
అంత అన్యాయంగా రూపొందించిన ఆ బిల్లులోని కనీస హామీలను కూడా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు నేటి కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకులేవో సాకులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలం ముగిసింది. ఇప్పటికేమీ లేదు. ‘ప్యాకేజి’ని రూపొందించడానికి ‘‘నీతి అయోగ్’’ మదింపు, అనుమతి కావాలంటున్నారు. ఈ సందర్భంలో ఆంధ్ర ప్రజలంతా ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ప్రధాని ప్రకటించిన లక్షా పాతికవేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని నీతి అయోగ్ ఆమోదంతోనే ప్రకటించారా? కాశ్మీరులో ప్రకటించిన 80వేల కోట్ల ప్యాకేజికి నీతిఅయోగ్ ఆమోదముందా? వీటికి నీతి అయో గ్ మదింపు, అవసరమూ లేనపుడు,విభజన వలన విపరీతంగా నష్టపోయిన ఆంధ్ర ప్రాం తానికి సహాయం చేయడానికెందుకవసరం కలుగుతున్నది? ఈ ప్రశ్నను సాధారణ ప్రజ లే అడుగుతున్నారు. విభజన చట్టంలో 8వ షెడ్యూలు అమలును అసలు కేంద్ర ప్రభు త్వం పరిగణనలోకే తీసుకోవడం లేదు. ఇటువంటి పక్షపాతాన్ని కేంద్రంగాని, ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని చూపితే, అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. రాజ్యాంగం ద్వారా 5 కోట్ల మంది ప్రజలకు కలిగిన హక్కుల్ని తృణీకరించడమే అవుతుంది. ఇలాంటివే కొనసాగుతుంటే, సమాజాల సమాఖ్యగా ఏర్పడిన కేంద్రం మీద ప్రజలకు నమ్మకం సడలిపోతుంది. దాని ఫలితమేంటో ఎవరైనా ఊహించగలరు.
రాజ్యాంగంలోని అన్ని అధికరణలూ, పరస్పరం ఒకదాన్ని మరొకటి ఆమోదిస్తూనే అనుసరిస్తాయి. అందుకే, ఏ అధికరణను అమలుచేయాలన్నా మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకోవాలని రాజ్యాంగ రచయితలు పీఠికలో చెప్పారు.

- మనె్న సత్యనారాయణ