సబ్ ఫీచర్

ఇక్కడే ఉండనీ ప్లీజ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బ! ఎంత బావుందో.. మెరిసిపోతోంది. నాకిక్కడంతా చీకటిగా ఉన్నా ఈ అందం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈమె నాకు ‘‘అమ్మ’’ అవుతుందట. ‘‘అమ్మా!’’ ఎంత బావుందో కదా పిలవడానికి ఈ తియ్యటి పదం.. అమ్మ మొహం డైరెక్ట్‌గా చూడాలనుంది. ఇంకెన్నాళ్లులే తొమ్మిది నెలలే కదా. ఇట్టే గడిచిపోతాయి. బయటకెళ్లి హ్యాపీగా ఆడుకుంటా అమ్మతో నేను చాలా అదృష్టం చేసుకొన్నానుట. ఇలా ఈ అమ్మ కడుపులో పడడానికి. దేవుడని ఇక్కడ నా ఫ్రెండ్ పంపేడు అమ్మ బొజ్జలోకి ఒక్కోసారి నేనిక్కడ చాలా కదులుతుంటా.. ఒక్కోసారి కొన్ని గంటల పాటు కదిలికే ఉండదు. ఇదే పగలు, రాత్రి అని దేవుడు చెప్పేడు. ఎన్ని పగళ్లు, రాత్రులు గడపాలో అమ్మకిలా దూరంగా..
‘‘బుళక్, బుళక్’’ అని ఈ పెద్ద పెద్ద చప్పుళ్లేంటి ఇంత పొద్దున్నా? పాపం మా అమ్మే, బొజ్జనొప్పి అనుకుంటా! ఇన్ని రోజులు బాగానే ఉందికదా. అయ్యో నా వల్లేనేమో! సారీ అమ్మా ఏం చేయాలో నాక్కూడా తెలీదు. ఓహ్ ఎన్ని రంగులున్నాయో ఇవన్నీ అమ్మ కోసమే. ఫ్రూట్స్‌ట బాగా తింటే నేను బాగా ఎర్రగా బుజ్జిగా పుడతానట. భలే రుచిగా ఉన్నాయే కానీ, అమ్మకి మాత్రం సయించట్లేదు. అమ్మ బొజ్జ మీద చేయి వేసుకున్నప్పుడల్లా నాకేదో తెలియని హాయి, నమ్మకం, ధైర్యం దేనికైనా అమ్మ ఉందిలే అని.
ఇలాంటి అమ్మను సృష్టించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పా. త్వరగా బయటకు పంపేయని రిక్వెస్ట్ చేశా. ఏయ్ అమ్మా; నేను చూడు ఎంత పెద్దగా అయ్యానో కాళ్లు చేతులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమనుకోకు కానీ నాకు బాగా ఆడుకోవాలనిపిస్తోంది. అటూ ఇటూ తిరుగుతూ, ఈత నేర్చేసుకుంటూ నేనిక్కడే నా కాళ్లు నీ బొజ్జకి తగిలి నొప్పిగా ఉందా అమ్మా.. సారీ.. నేను బుద్ధిగా కూచోవాలన్నా కుదరట్లేదుక్కిడ అమ్మా! నువ్వు నాతో ప్రతీ రోజు ఇల్లాగే మాట్లాడుతుంటావా భలే ఉంది. వినడానికి మంచి మంచి కథలు, పాటలు, నవ్వులు, ఇక్కడే ఇంత బాగగా అనిపిస్తుంటే బయటకొచ్చేక ఇంకెంత అందంగా ఉంటుందో ప్రపంచం.
నిన్ను రోజూ అందరూ ఒకటి అడుగుతున్నారు కదా. ‘‘ఆడా, మగా’’ అని అంటే ఏంటమ్మా? ఎందుకిలా అడుగుతున్నారు. ఏంటి తేడా? ప్లీజ్ చెప్పవా తెలుసుకోవాలనుంది. నువ్వు వాళ్లకే ఏం చెప్పట్లేదు. పాపం నాకేం చెప్తావులే. నేను దేవుడిని అడుగుతా. మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటుంటాం కదా. ఆయన పంపించేడు కదా మరి నన్ను. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతూనే ఉంటున్నావ్. నిద్ర పట్టట్లేదా అమ్మా! నా కోసం ఎంత కష్టపడుతున్నావ్.. నేనొచ్చేక నిన్ను బాగా చూస్కుంటాలే. సరేనా అన్నట్టు! దేవుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పేస్తాడు కానీ నాకింకా ఒక డౌట్. మగపిల్లడా? అని అడిగేటపుడు ఆత్రుత , ఆసక్తి వినిపిస్తోంది. ఆడపిల్లా? అని అడిగేటప్పుడు కాస్త గొంతు తగ్గించి ఏదో సీక్రెట్ లాగా ఎందుకు అడుగుతున్నారు?
ఏంటమ్మా అది ఎందుకట్లా అడుగుతున్నారు.
ఆ నేను తెలిసేసుకున్నాను. నేను దేవుడిని అడిగాను. నేను ఆడపిల్లనట కదా. నేనంటే నీకిష్టమే కదమ్మా. నే బయటకొచ్చేక నన్ను ముద్దుగా చూసుకుంటావు కదా. చూసుకుంటావులే అమ్మవి కదా.
అమ్మా! నీకు నడవడానికి కష్టంగా ఉందెందుకు?ఓహ్ ఇంకా కొన్ని పగళ్లు రాత్రులే మిగిలాయి కదా. నేను నీ ఒడిలోకి రావడానికి, అందుకేనేమో నీ మాటలు, పాటలు నాకు వినిపించినట్టే నా గుండె చప్పుడు నీకు వినిపిస్తోందా? అమ్మా. ఇంక నేను ఉండలేకపోతున్నాను. ఇక్కడ పగలు, రాత్రి మారుతున్న కొద్దీ నాకిక్కడ బావులేదమ్మా. ఇబ్బందిగా ఉంటోంది , నాఫ్రెండ్ నాకు చాలా విషయాలు చెప్పేడు. నేను ఆడపిల్లని అమ్మా. ఆడపిల్లంటే బాగా అన్నీ నేర్చుకోవాలట. ఆడుకోవాలట. నువ్వు గర్వపడేలా మంచి మనిషిగా తయారవాలట. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ కోపంగా ఉండకమ్మా. గట్టిగా మాట్లాడకు. నే ఇక్కడ ఉలిక్కి పడుతుంటా. భయమేస్తుంది నాకు. నీతో మాట్లాడేవాళ్లకు కూడా చెప్పమ్మా. ఎప్పుడు నీతో సరదాగానే ఉండాలని, నాకోసం పెద్దయిపోయాకదా. అన్నీ తెలిసి తెలిసిపోతుంటాయి. నాకు నువ్వు ఏడిస్తే నాకిక్కడ ఊపిరాడదు తెలుసా. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నువ్వు నా లాగే అమ్మాయివి కదా. చాలా గొప్పదానవి. నువ్వు కూడా నా ఫ్రెండ్ చెప్పేడు. బయటికొచ్చాక నిన్ను అస్సలు ఏడవనివ్వను ప్రామిస్.
ఇందాక నువ్వు అమ్మమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. బాధగా మాట్లాడుతున్నావ్. ఏమయిందమ్మా. ఒంట్లో బావులేదా? పొద్దునే్న పేపర్ చదువుతూ ఏడ్చేవ్‌కదా. నాకు దగ్గొచ్చినప్పుడే అనుకున్నా ఏదో అయిందని. అమ్మమ్మ తో ఏం చెప్పావ్? నాకర్థం కాలేదు. ఫ్రెండ్‌ని అడిగేను. నా లాంటి చిన్న చిన్న పాపలని, నీలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆడపిల్లలని ఏడిస్తున్నారట కదా కొందరు చెడ్డవాళ్లు. అందుకేనా నువ్వు కళ్లనీళ్లు పెట్టుకున్నావ్ ఆ చెడ్డవాళ్లు మగ పిల్లలట కదమ్మా. మరి నీ బొజ్జలో నాలా ఆడపిల్ల అని తెలిసి పారేస్తున్నారట కదా. ఆడపిల్ల అంటే అంత కష్టమా? నేను నిన్నుకష్టపెట్టనమ్మా. నన్ను నీ దగ్గరే ఉంచుకుంటావా. ప్లీజ్. నువ్వు ఇలాంటి విషయాలన్నీ చదివి బాధపడుతుంటే నాకిక్కడ నీ లోపల బావులేదమ్మా. ఏడుపొస్తోంది. బయటకు ఎంతత్వరగా రావాలా అనుండేది.
కానీ ఇప్పుడు బయట ననె్నలా చూసుకుంటారో అని భయం. హ్యాపీగా, ఆడుకోగలనా? ధైర్యంగా చదువుకోడానికి వెళ్లగలనా? ఇన్ని నెలలు నీ లోపల ఉండి నీకు దూరంగా ఉన్నానని అనుకొన్నాను. కానీ, బయటకొచ్చేక నీకు దూరమవుతానేమో అనిపిస్తోంది.
అమ్మా! ఏమైంది. ఎందుకు కంగారు పడుతున్నారు. నువ్వెందుకు అలా గటిటగా ఏడుస్తున్నావు. నొప్పిగా ఉందా? నాకెందుకు ఇక్కడ ఉన్నట్టుండి జాగా సరిపోవట్లేదు. నే జారిపోతున్నానేంటి. ఎక్కడికి తీసుకెళుతున్నారు
నువ్వు గట్టిగా నన్ను తోస్తున్నట్టుంది. నేనింక ఇక్కడ ఆడుకోలేనా, ఈతకొట్టలేనా ? నాకివాళ పొద్దున నీ కళ్లల్లో నీళ్లు చూసిన దగ్గరనించి అనుమానమొచ్చింది.
‘‘ఫ్రెండ్ నువ్వు అయినా చెప్పు ఏమవుతోంది. నేనిక రోజూ నీతో కబుర్లు చెప్ప లేనా? నన్ను బయటకు పంపించేస్తున్నావా వద్దు ఫ్రెండు. నే ఊహించుకున్నట్టు బయట అంత బావులేదు. నే విన్న నవ్వులన్నీ ఎప్పటికీ అలాగే ఉండిపోయే నవ్వు లు కాదనిపిస్తోంది. నేనిక్కడే ఉండిపోతా. అమ్మకి నొప్పిలేకుండా నన్ను లోపలే ఉంచుకునేలా చూడు. ఫ్రెండ్ నన్ను పంపొద్దు .. ప్లీజ్ ఇక్కడే ఉండనీ
ఓ చిన్న మాట చిట్టి తల్లీ:
ఫ్రెండ్: బయట అందరూ చెడ్డవాళ్లుండరు బంగారం. నేను కూడా మగ పిల్లాడినే కదా. నీ మంచిఫ్రెండ్ నే కదా. అలాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. నే చెప్పేనులే నిన్ను బంగారు తల్లిగా చూసుకోమని. తప్పు చేస్తే శిక్ష తప్పదని. వెళ్లమ్మా వెళ్లి అమ్మ ఒడిలో భద్రంగా ఆడుకో తల్లీ. ఉన్నాను కదా నన్ను నమ్ము.

- కౌముది