మెయిన్ ఫీచర్

ఏ కొప్పు వేసినా.. అందమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలభాగంలో ముంగురులను పడీ పడనట్లుగా కొందరికి బాగుంటే మరికొందరికి ఓ పాయలా జుట్టు పడితే అందం ఇనుమడిస్తుంది. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా ముంగురులను ముదితలందరూ ముక్కన వేలేసుకొనేలా ఉండాలని తపిస్తారు. కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే. కేశాలను రకరరకాల స్టయిల్స్ లో వేసుకొంటూ అందాన్ని మెరుగులు దిద్దుకోవచ్చు. కొంతమందికి జుట్టు బారుగా సిల్కులా ఉంటుంది. వీరు ఏ రకమైన కొప్పైనా, వదులు జడైనా, టైట్‌గా నైనా వేసుకోవచ్చు. ఏదైనా బాగుంటుంది. కానీ ఆ వేసుకోనేది వారి ముఖాకృతిని, దేహాన్ని దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి.
ఇంకొంతమందికి ఉంగరాలు తిరిగి నొక్కులుగా ఉంటుంది. వీరు చక్కని పోనిటైల్ వేసుకొంటే చూడ చక్కగా ఉంటుంది. వీరికి మామూలుగా పొట్టి జుట్టే ఉంటుంది. ఒకవేళ పొడవుగా ఉన్నా వారు అలా గాలికి వదిలేసినా, వదులుగా జడ వేసుకొన్నా బానే కనిపిస్తుంది.
ఎండి పోయినట్టు, పొట్టిగా జుట్టు ఉన్న వారు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు అపుడపుడు నూనె రాసుకోవాలి. తలకు పోసుకొనేటపుడు షాంపుకన్నా కుంకుడు కాయల రసంలో మందారాకులు పేస్టును కలిపి తలకు పోసుకొన్నట్లు ఐతే జుట్టు కుచ్చులా వచ్చి మెత్తగాఅవుతుంది.
వెడల్పాటి వీపున్న వారు జడన ఫ్రెంచి స్టల్ వేసుకొంటే అందంగా కనిపిస్తుంది. నేటి స్ర్తిలు వారికున్న సమయాన్ని బట్టి వారు త్వరగా అందంగా కనిపించాలను కొంటు న్నారు. అందుకే వారు పోనీలకే మక్కువ చూపుతున్నారు.ఈ పోనీల్లో మెడ పై పడేటట్లు కొందరికి, వీపు సగభాగం వరకు పరుచుకొంటున్నట్లు మరికొందరికి నప్పుతాయి.
ఎండాకాలంలోనూ జుట్టును విరగ పోసుకోవడానికే ఇష్టపడే వాళ్లు ఎక్కువ అయ్యారు. కాని వీరు తమ జుట్టు చివర్లు చిట్లి పోతుందనో లేక త్వరగా వూడిపోతుందనే బాధపడుతుంటారు. ఇలాంటి వారు కాస్త జుట్టుకు రాత్రి పూట ఆయల్ అప్లై చేయడం వారానికి మూడుసార్లు తలకు పోసుకోవడం లాంటివి చేస్తే జుట్టు గురించిబాధలు దూరం చేసుకోవచ్చు.
ఇలా వదిలేసుకొన్నప్పుడు కూడా చక్కగా తల ముందు భాగం నుంచి వెనక్కు దువ్వుతూ జుట్టు మధ్యలో పూసలు, రాళ్లు క్లిప్పుల్లాంటివి జుట్టుకు అలంకరిస్తే చాలా బాగుంటుంది. మొదట కాస్త జుట్టు దువ్వుకుని ఫ్రెంచిలాగా మొదలుపెట్టి కాస్తనేఅల్లి అక్కడ క్లిప్పు పెట్టి ఆతరువాత జుట్టు వదిలేసుకున్నా బాగుంటుంది.

- గాయత్రి