సబ్ ఫీచర్

పొదరిల్లు మాది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో ఇంట్లో కూర్చున్నా వేడి అనిపిస్తుంది. ఆ వేడి తగ్గాలంటే చల్లని పొదరిళ్లల్లో ఉండాలనిపిస్తుంది. ఆ పొదరిల్లును మీ ఇంట్లోనే చేసుకోవడమెలానో చూడండి.
కొబ్బరి తీసేసిన చిప్పల్లో కాస్త మట్టిపోయండి దానిలో ధనియాలు, రాగులు, ల్లాంటివి చల్లి రోజూ కాసిని నీళ్లు పోస్తూ ఉండండి. మూడు రోజుల్లో మంచి మొలకలు వస్తాయి. వాటిని ఇంట్లో అక్కడక్కడ పెట్టుకోండి ప్రతిరోజు కాసిని నీళ్లు పోయడం మాత్రం మరవకండి. వీటితో ఇంట్లో అందం, ఆహ్లాదమూ, చల్లదనం వస్తుంది.
అట్లానే మంచినీళ్ల బాటిల్స్‌లో మనీప్లాంట్ కాని, లేదా తమలపాకు మొక్కల కొమ్మలను కత్తిరించి ఈ బాటిల్స్‌లోకి కాస్త దింపి అక్కడక్కడా గోడలకు తగిలించండి.. చల్లదనంతో పాటు ఇంట్లో ఎంతోప్రశాంతత వస్తుంది.
విరిగిపోయిన ట్రేలు, ప్లాస్టిక్ బుట్టల్లాంటివాటిల్లో లేదా విరిగిన బకెట్స్ లాంటివి, లేదా పాత జాడీలల్లో మట్టి పోసి కలర్ చామంతి, రోజా, ముళ్లగోరింట, పచ్చి మిరప, కలర్ పుల్‌గా కనిపించే ఆకులున్న మొక్కలు ఇట్లాంటివి నాటండి అక్కడక్కడ ఇంట్లో పెట్టుకోండి. వీటిని కాసేపు బాల్కనీలోనో లేక ఎండ పడేచోట ఓ గంట పాటు ఉంచండి తిరిగి ఇంట్లోకి చేర్చండి. ఇండోర్ ప్లాంట్స్ లాగే ఇవి ఇంటికి అందంతో పాటు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. ఈ మొక్కలు ఇంట్లో ఉన్నందువల్ల ఇల్లంతా చల్లదనంతో పొదరిల్లును మరిపిస్తుంది.

- చివుకుల రామమోహన్