సబ్ ఫీచర్

మనసుల్ని కలిపేది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు’ ఖర్చులేనివే కదా అని మాటల్ని పేర్చుకుంటూ పోతే మనుష్యులమధ్య అవగాహనలోపం అధికమై ఎనె్నన్నో అనర్థాలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో మాటలకన్నా గంభీరమైన వౌనమే ఎక్కువ ప్రయోజనం కల్గిస్తుంది. ఇంతకీ బతుకుబాటని తీరుగా తీర్చిదిద్దలేని మాటలెందుకు? మాటలే మనస్పర్థలకు మార్గనిర్దేశాలుగా చెప్పుకోవాలి! అవసరాన్ని మించి ఆహారం తీసుకోవడం ఎంత ప్రమాదకరమో అనవసర వ్యర్థ ప్రసంగాలు చేయడం కూడా అంతే ప్రమాదం. ఏదానికైనా అతి సర్వత్ర వర్జయేత్ అనేది మానవ మనుగడకు మూలసూత్రమే కదా!
మాటల వల్లే మనసులు కలుసుంటాయ. విడిపోతాయ. మాట మంచిదైతే వూరు మంచిదంటారు. అంటే మాటబాగుంటే చాలు అందరూ మనవారే అవుతారు. అందుకేమాటను చక్కని పదాలతో కూర్చుని ఎదుటివారిని నొప్పించకుండానే మాట్లాడాలి.
అంతేకాదు, ఏ విషయంలోనైనా వాదోపవాదాలు పెరిగేకొద్దీ వాస్తవాలు మరుగునపడతాయి. వందమంది చెప్పే అబద్ధం ఒక నిజంగా మిగిలిపోతుంది. నల్లమేక సామెత అందుకేగా పుట్టింది. అలా అసత్యమే సత్యమై రాజ్యమేలితే ‘సత్యమేవ జయతే’ అనే మాటకు అర్థాలు మారిపోతాయి. అది మన సనాతన సాంప్రదాయ స్రవంతికి అనర్థదాయకం మరియు అభ్యంతరకరం! సనాతనమే అయిన సదా నూతనమైన మన హైందవ సంస్కృతిలో మాటకున్న విలువ మనిషిక్కూడా లేదు. మరి అంత అమూల్యమైన మాటల్ని అసత్యప్రచార సాధనాలుగా వాడుకోవటం ఏమంత సబబు? ఇప్పటికైనా ఎప్పటికైనా సమయోచిత సందర్భానుసార సంభాషణలే సర్వదా శ్రేయోదాయకం. ధర్మచింతన చేసేవాడు వౌనాన్ని ఆశ్రయించక తప్పదని చెప్పిన గౌతమబుద్ధుని మాటలు మానవాళికి మార్గదర్శకాలు. ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా’ అని ఆత్రేయగారు పల్లవించారంటే అది అక్షర లక్షల సత్యం. వౌనం మనలోని అంతర్గ శక్తుల్ని మేల్కొల్పే ఓ వేకువ ఉదయం. కేవలం వౌనంతో మాత్రమే ధానప్రక్రి సాధ్యం. ఏకాగ్రమైన చిత్తానికి ఏకోన్ముఖమార్గమే వౌనం. కొన్ని సమయాల్లో మాటలు చేయలేని పని ‘వౌనం’ చేస్తుంది. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవారు తెలుసుకోదగిన మరో మంచి విషయం- మాటలకు చాలా శక్తి ఖర్చవుతుందని, ఆ శక్తిని తిరిగి పొందాలంటే అది కూడా మళ్లీ వౌనంతోనే సాధ్యమని! ఆంగ్లేయులు కూడా ‘స్పీచ్ ఈజ్ సిల్వర్ అండ్ సైలెన్స్ ఈజ్ గోల్డ్’ అని అంగీకరించారు. వారానికోరోజు వౌనదీక్ష పాటించిన మహాత్మాగాంధీ- వౌనానికున్న విలువను రెట్టింపు చేస్తూ వౌనమే తన శాంతి సందేశమని ఘంటాపథంగా చెప్పారు. కనుక ఎవరు చెప్పినా ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా మొక్కలా వౌనంగా ఎదగటం తప్పదుకదా కదా! ఆచరణ రూపం దాల్చని అంతర్యుద్ధ మాటలు కన్నా మాటలు రాని వౌనమే మిన్న!

-మరువాడ భానుమూర్తి