సబ్ ఫీచర్

ధాన్యాలు + చిరుధాన్యాలు =సంపూర్ణఆహారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమెప్పుడూ ఆహారపదార్థాల్లో ధాన్యానికే ఎక్కువ విలువనిస్తుంటాం. కాని చిరుధాన్యాలు కూడా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరింత భద్రం చేసుకోవచ్చు. అట్లాంటి వాటిని కొన్నింటిని చూద్దాం
అన్నం తినడం కోసం మనమంతా తెల్లని పాలిష్ బియ్యాన్ని ఎంచుకుంటా ఉంటాం. కాని వీటి బదులుగా దంపుడు బియ్యం మంచివి. కొర్రెలు, జొన్నలు, రాగులు కూడా అన్నం బదులు తినొచ్చు. దీనివల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభ్యమవడమే కాదు. కొలెస్ట్రాల్ పెరగడాన్ని నియంత్రించవచ్చు.
అరిసెలకు చేసేటపుడు బియ్యం బదులుగాకొర్రలు, జొన్నలు ల్లాంటివి వాడవచ్చు. సున్నండల్లో మినుములకు బదులు అటుకులు,గో
ధుమలు, కొర్రలు, జొన్నలు కూడా వాడితే రుచికి రుచి ఆరోగ్యమూ లభిస్తుంది.
వడలు బోండాల్లాంటివి చేయడానికి కేవలం శనగ పప్పు, శనగ పిండి కాక గోధుమ పిండి, మొక్కజొన్న పిండిని వాడుకోవచ్చు.
గోధుమ చపాతీలకు బదులు జొన్న, రాగి, మొక్కజొన్న, బార్లీ , ఒట్స్ తో చపాతీలు, రొట్టెలు చేసుకొంటే రుచిగా ఉంటాయి వైరీటీగా కూడా ఉంటాయి.
వడలకు అలచందలు (బొబ్బర్లు) మొక్కజొన్నలు వాడితే పిల్లలు, పెద్దలు ఇష్టంగా ఆరగిస్తారు.
దోసెలకు గోధుమ రవ్వ, కొర్రల పిండి, జొన్నపిండితో వాడితే కరకరలాడే దోసెలు బాగుంటాయి.
బొబ్బట్లు తయారు చేయడానికి శనగపప్పు బెల్లం కాక గెనుసు గడ్డలు అంటే స్వీట్ పొటాటో, పెసలతో చేస్తే బాగుంటుంది. కందిపప్పు, గాజర్ కలపి చేసే బొబ్బట్లు రుచిగా ఉంటాయి.
సాయంత్రం పిల్లలకు పిజ్జాల్లాంటి స్నాక్స్ కాక బఠానీలు, శనగల గుగిళ్లు, ఉడికించిన పల్లీలు, బొరుగులతో చేసిన వంటకాలు ఇస్తే పిల్లలు ఇష్టంగా ఆరగిస్తారు.
అప్పుడప్పుడు రాగి, జొన్న, మొక్కజొన్న ల్లాంటి పిండితో జావ చేసే ఉపాహారంగా తీసుకొంటే చాలా ఆరోగ్యకరం.

-వాణి ప్రభాకరి