సబ్ ఫీచర్

మానవత్వమే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలతో అద్భుతాలను సాధించవచ్చా? ఇదంతా ఒట్టిమాట అనే వారు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. కాని పూర్వకాలంలో మంత్రాలతోనే ఎన్నో అద్భుతాలను సృష్టించిన వారున్నారు.
విశ్వామిత్రుడు తపస్సు చేసి ఏకాగ్రతతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నదాన్ని సాధించాడు. మహర్షులేకాదు రాజులు ఆఖరికి సామాన్యులు సైతం మంత్రాల ద్వారా తపస్సు ద్వారా అనుకొన్నది సాధించినవారు కోకొల్లలుగా చరిత్రలో కనిపిస్తారు. దానికి కారణం ప్రాచీనపు జీవన విధానాలు కారణం అని చెప్పవచ్చు.
‘మంత్రం’ అంటే ఏమిటో సరిగా అర్ధంచేసుకొనడానికి ముందుగా ప్రయత్నిద్దాం.
‘మననాలీ త్రాయతే ఇతి మంత్రః’ అని దాని నిర్వచనం.
‘మననం’అంటే మళ్లీమళ్లీ ఏదైనా ఒక పదాన్ని లేక పదజాలాన్ని ఉచ్చరించడం. ఉదాహరణకు ‘రామ’నామ జపంచేయడం మన మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే ఏదో ఒక నామాన్ని పలుసార్లు- 108సార్లు- వెయ్యిసార్లు- ఇలా నిర్ణీతమైన గణనతో స్మరించడం- అలా గణనతో పనిలేకుండా నిరంతరంగా స్మరిస్తూ ఉండడం.
అలా స్మరించడంవల్ల కలిగే ప్రయోజనం మానసిక ఏకాగ్రత. ఈ ఏకాగ్రతయే అన్ని భయాలనూ, భ్రాంతులనూ తొలగిస్తుంది. పరిపూర్ణమైన ఆనందాన్ని లభింపజేస్తుంది. ఈ మానసిక కేంద్రీకరణవల్లనే మనలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తియై మనకు సర్వశక్తులూ లభిస్తాయి.
ఈ మానసిక ఏకాగ్రతకే ‘యోగం’అని పేరు. దీనివల్లనే సర్వదర్శన శక్తి, సర్వజ్ఞానశక్తి, సర్వపరిణతశక్తి లభిస్తాయి.
ఓ సారి తెనాలిరామలింగడికి ఓ సన్యాసి నువ్వు కాళీమాత ఉపాసన చేసినట్టయితే ఈ దేశంలోని మహిమాన్వితులలోనూ మంచి ప్రసిద్ధుడవౌతావు. నీకునేను ఇప్పుడు కాళీమంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నీవు ఈ రాత్రికి కాళీమందిరంలో కూర్చొని వెయ్యిసార్లు ఆపైని నూటాఎనిమిదిసార్లు జపం చెయ్యాలి. దానితో కాళీమాత భయంకర రూపంతో నీముందు సాక్షాత్కరిస్తుంది. నువ్వు భయపడకూడదు. ధీరులు, ధీమంతులు అంటే ఆమెకు ఇష్టం. ఆవిడ నన్ను అనుగ్రహించి అనంతమైన ధీశక్తిని, వాక్‌శక్తిని ఇస్తుంది. ఈ మంత్రాన్ని అర్హుడైన వ్యక్తికి అందజేసి నేను ప్రాణత్యాగం చేయడానికై ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నువ్వు కన్పించావు. నాకు ఆనందంగా ఉంది అని చెప్పి ఆ సన్యాసి పద్మాసన స్థితిలోనే ప్రాణత్యాగం చేశాడు. ఆయన కోరినట్టుగానే ఆ రాత్రికి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఆ సన్యాసి చెప్పినట్టుగా కాళీ జపంచేసి, ఆ కాళీమాత సాక్షాత్కారాన్ని పొంది మహాకవిగా, వికట కవిగా ఎంతో ప్రసిద్ధుడైనాడు తెనాలి రామకృష్ణకవి.
ఇది చిన్న ఉదాహరణమాత్రమే విక్రమా దిత్యుడు, భట్టి, భోజరాజు, శ్రీకృష్ణదేవరాయులు ఇలాంటి ఎంతోమంది అమ్మవారిని ఏకాగ్రతతో పూజించి మానసిక ధ్యానం చేసి ఆ తల్లి అనుగ్రహ వీక్షణాలను పొందిఉన్నారు.
కాని మంత్రసాధన చేయకపోయనా ఫర్వాలేదు అద్భుతాలను సృష్టించకపోయనా ఫర్వాలేదు కాని నేటి సమాజంలో మాత్రం మానవత్వంతో మసలే మనుషులను తయారు చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారికి చిన్నప్పటి నుంచి మానవత్వం అంటే ఏమిటో తెలపాలి. మానవత్వంతో మసలడం అనేది బాల్య ం నుంచే నేర్పాలి. దీనికి ముందుగా తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు నడుం కట్టాలి.
మన పూర్వులంతా త్యాగంతో అమృతత్వ సాధన చేశారు. కనుక మనమూ వారి బాటలో నడిచి అమృతత్వ సాధనలో పురోగమించాలి అంటే త్యాగిగుణాన్ని అలవర్చుకోవాలి.
*