సబ్ ఫీచర్

ఇలా తరిమేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకులు పడితే చాలు దోమలు పెరుగుతాయి. దోమల నుంచి రక్షించుకోలేక పోతే డెంగీ, చికున్‌గున్యా, మలేరియా ఇలా ఎన్నో వ్యాదులు ప్రాణాంతక వ్యాధులు మనల్ని బాధిస్తాయి. అందుకే దోమల నియంత్రణ మరీ ముఖ్యం.
ఇక బోలెడన్నీ అడ్వర్టైజ్ మెంట్స్‌తో టీవీలు మారుమోగుతుంటాయ. ఆల్ అవుట్ పెట్టండి, లేకపోతే అవి కాల్చండి. చిటికెలో మాయం అంటూ వాటికన్నా సాధారణ పద్ధతులతో దోమలను దూరం చేయడం మంచిది.కొన్ని రకాల దోమల నివారణకు ఉపయోగించే మందులవల్ల మనుష్యుల్లోను జబ్బులను వస్తున్నాయ. ముఖ్యంగా దోమలను దూరం చేయడానికి ఉపయోగించే ఆల్ అవుట్ లాంటి వాటి వాసన కొందరికి సరిపడక శ్యాససంబంధ వ్యాధులు ల దీర్ఘకాలంలో శ్వాసకోస వ్యాధులు , మానసిక వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు.
ముందుగా వేపనూనెతో దోమల నియంత్రణ చూద్దాం. వేపనూనె, కొబ్బరి నూనె ఈ రెండింటినీ సమానపాళ్లల్లో తీసుకోవాలి. కనీసం ఈ నూనెను శరీరానికంతా అప్లై చేయాలి. దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ నూనె ఉన్న శరీరా భాగాలను తాకడానికి దోమలు సాహసించవు. ఈ నూనె వాసన వచ్చే ప్రదేశానికి రావడానికి కూడా దోమలు భయపడుతాయి. ఈ ఫార్ములాను జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్క్విటో కంట్రోల్ అసోసియేషన్ తన సంచికలో ప్రచురించింది. వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాండీ ప్రోటోజోల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ సౌందర్య రక్షణకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది. అసలు ఈ వేపనూనెలో కాస్త పత్తిని ఉండగా చేసి ఈనూనెలో తడిపి ఇంట్లోని ప్రతి గదిలో నాలుగు మూలలా పెడితే దోమలు ఆ గదిలోకే రావు.
అంతేకాక మురుగు నీరు నిలువ ఉన్న చోట కూడా ఈ వేపనూనెను నాలుగు చుక్కలు వేస్తే దోమ గుడ్లు పిల్లలు చేయకుండా ఉంటాయి.
దోమల నివారణకు మరికొన్ని చిట్కాలు చూద్దాం. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత ఇంటి తలుపులు తెరిచి ఉంచకండి.బాగా సూర్యుడు వచ్చినపుడు కిటికీ తలుపులు తెరిచి ఉంచండి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటి పైన ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మూతలు బిగించి ఉంచాలి. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూండాలి. చెత్తబుట్టలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.
ఆరోమా ఆయిల్స్ ఇవి మార్కెట్లో లభిస్తాయి. వీటిల్లో సిట్రోవెల్లా, లెమన్ గ్రాస్ ఆయిల్ ఇలా ఎన్నో రకాల నూనెలు లభిస్తాయి. వీటిని మండించడం వల్ల కూడా దోమలు దరికి రావు.
వెడల్పాటి పాత్రల్లో సబ్బునీరు ఉంచడం వల్ల ఈ నీటికి ఆకర్షితమైన దోమలు దీనిపైకి వాలి ప్రాణాలు కోల్పోతాయి.
దోమల నివారణకు సోడియం లాంప్స్ వాడాలి. మస్కిటో ట్రాపింగ్ మెషన్సు ఇపుడు విరివిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని పెట్టుకోవడం వల్ల కూడా దోమలనుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.
దోమలనేవాటిని పుట్టించకుండా ఉంటేనే చాలామేలు. ఎందుకంటే రోగం వస్తే మందులు వేసుకొనేకన్నా అసలు రోగం రాకుండా చూసుకోవడం మేలు కదా. అందుకే దోమలనేవాటి పుట్టుకకు కారణమైన ఏ ప్రాంతాన్ని మనం సృష్టించకుండా ఉంటే అసలు దోమల ఉత్పత్తి జరగదు. కనుక దోమల బెడద నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.

-వెంకట లక్ష్మి