సబ్ ఫీచర్

సమస్యెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి ఉద్యోగం చేసే చాలా కుటుంబాల్లో పిల్లల్లో మొండితనం ఎక్కువ అవుతోంది. వారికి డబ్బు విలువ తెలీదు. కథలు చెప్పి నోటికి ఇంపుగా కడుపు నిండుగా పెట్టే అమ్మ కనుమరుగైంది. ఆ స్థానంలో గబగబా క్యారేజీ సర్ది పంపే తల్లి, ఆ తరువాత పనిమనిషే అన్ని పనులు చేసేస్తోంది. ఏదైనా కావాలంటే డబ్బులిస్తే చాలు అన్నీ అమరుతాయ అనే ఆలోచన పిల్లల్లో ఎక్కువ అవుతోంది. వారు ఏది కోరుకుంటే అదే. అది మంచిదా కాదా అన్న సమస్య లేనేలేదు. ఇదేంటి అని పెద్దలు ఎవరైనా అడిగితే ముందుకే తల్లిదండ్రులకే కోపం.. ఇక పిల్లల సంగతి సరేసరి చాలా గారాబంగా పెంచుతుంటే మీరు ఏంటి చెప్పేది అనేది తల్లిదండ్రుల అభిప్రాయం.
ఆఖరికి తండ్రి విసుక్కొంటే తల్లి కి కోపం మీరు కొనివ్వకపోతే పోయారు నా డబ్బుతో కొనిస్తాను అంటుంది. అదే వరుసలో తండ్రి నీవు చేయకపోతే నేనే చూసుకొంటాను. నేను కొనిస్తాను.
ఇలా ఇద్దరికిద్దరూ నాద నాది అనే గోలలో పిల్లలకు సర్ధుబాటు అనే తత్వాన్ని చెప్పడంలేదు. కొంతవరకు ఫర్వాలేదు. కాని వారు ఏవిషయంలోనైనా వెనుక బడితే ఇక జీవితం లేదని చావుకు సిద్దమవుతు న్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల పెంపక లోపం కాదా...
ఈ ఆలోచనలు మారాలి.
అదే సర్దుబాటు ఇంకొకరికి సాయం చేసే గుణం ఉంటే వారిఆలోచనా దృక్పథం మారుతుంది.
ప్రతి మనిషీ - ఏ సమస్యనయినా ఇష్టంతో ఎదుర్కొని జీవించడం అలవర్చుకోవాలి. మనం సంఘ జీవులం, అందరితో కలిసి జీవించాలి. పక్కవారికి సాయం చేసే నైపుణ్యం నేర్పించాలి.త్యాగం చేస్తే వచ్చే ఆనందం వారికి రుచి చూపించాలి. తాను ఒక్కతే లేక ఒక్కడే ఉండాలి అన్న తత్వాన్ని దూరం చేయాలి. అందరితో కలసి జీవిస్తే వచ్చే ఆనందం వారికి రుచి చూపించాలి. దీనికి పెద్దలే మారాలి. నేను నా భర్త పిల్లలే అని కాక బంధువులను తన వారుగా స్వీకరించే గుణాన్ని పెంచుకోవాలి. నీ నా అని కాక మన అనే తత్వాన్ని పెంచుకోవాలి. పెళ్లికి ముందు భార్యాభర్తలు వేర్వేరు. కాని పెళ్లి అన్న బంధం ఏర్పడిన తర్వాత అది సంసారం వారిద్దరూ ఒక్కటే. వారి నుంచి ఒక కొత్త తరం ఉద్భవిస్తుంది. అందుకే వారు ఇద్దరూ కాదు ఒక్కరే.అలా కలసి ఉన్నప్పుడు వారి పిల్లలు కూడా నా అని కాక మన అని నేర్చుకుంటారు. వారికి తృప్తి నేర్పించాలి. ఆత్రం దూరం చేయాలి. ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్పించాలి.

- వాణి ప్రభాకరి