సబ్ ఫీచర్

ఆంధ్రప్రదేశ్ ఇపుడు.. ప్రత్యేక రాష్టమ్రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాల విభజన అంచెలంచెలుగా జరిగి, 2014 జూన్ 2 నాటికి 29 రాష్ట్రాలుగా, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత్ రూపుదిద్దుకుంది. ఢిల్లీకి శాసనసభ ఏర్పాటైనా, దేశ రాజధాని గనుక అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాగా, గత కొన్ని నెలలుగా టీవీ చానళ్లు, దినపత్రికల విశే్లషణలను చూస్తుంటే- ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్టమ్రా? కేంద్ర పాలిత ప్రాంతమా? అనే అనుమానం కలుగుతోంది. కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని, ఫలితంగా ఆశించిన అభివృద్ధిని సాధించలేక పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే వాపోతున్నారు. ‘అన్ని విధాలా కావలసినంత సహాయం చేస్తున్నాం.. విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.. సొంత ప్రణాళికల ప్రకారం వ్యయం చేస్తున్నారు.. కేంద్రం ఇచ్చే నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారు.. ముఖ్యమంత్రి బంధువులకు, పార్టీ శ్రేణులకు సంపాదన కోసం అవకాశం ఇస్తున్నారు..’- అని భారతీయ జనతాపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షమైన వైకాపా నాయకులు కేంద్రంతో లాలూచీపడి రాష్ట్భ్రావృద్ధిని తుంగలో తొక్కారని తెలుగుదేశం నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయంగా ఇదంతా సర్వసామాన్యంగా జరిగే రాజకీయ ప్రక్రియ. సామాన్యుడికి వాస్తవాలు తెలియాలి.
యదార్థం ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్పక జరగాలి. అది ఏ విధంగా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారు, రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మంచి నాయకుడు కావాలి. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడని విశ్వసించి ఆయనకు అధికారం కట్టబెట్టారు. వౌలికమైన ఒక విషయాన్ని ప్రజలు గుర్తించలేకపోయారు. విభజనకు కారకులు ఎవరు? ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు. అందుకు తెలుగుదేశం సహా ఇతర పార్టీల బాధ్యత కూడా వున్నది. తెలుగుదేశం పార్టీ సమర్ధించిన బిజెపి పాత్ర కూడా వున్నదని గ్రహించలేక కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటుకూడా రాకుండా చేసారు. చంద్రబాబు అసందర్భ ఎత్తులను ఏపీ ప్రజలు గుర్తించకపోవటం విచారకరం. సుమారు నాలుగు సంవత్సరాలు కాలయాపన చేసి, ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకోవటం, భాజపాతో పోరుకు సిద్ధపడడం వంటి తన నిర్ణయాలు సరైనవేనని చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టటం విచిత్రంగా కనిపిస్తున్నది.
భాజపా రాజకీయ ఎత్తుగడలను గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలు బలపడడాన్ని సహించలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే భాజపా యత్నించడం సహజం. ఒకవేళ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, దానిని ఆ తర్వాతి ఎన్నికల్లోనైనా పడగొట్టి తాను అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే, భాజపా అధికారంలోకి వచ్చినా దానిని పడగొట్టి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తుంది. జనంలో పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలను రూపుమాపటం కష్టం అని కాంగ్రెస్‌కు, భాజపాకు బాగా తెలుసు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వాడుకోవాలని ఈ పార్టీలు ఎదురు చూస్తుంటాయి. అలాకానపుడు ఎప్పుడంటే అప్పుడు కూల్చివేయగలిగే పార్టీని సమర్ధిస్తాయి. అంతేగాని శక్తివంతంగా వుండే టిడిపిని భాజపా ఎందుకు సమర్ధిస్తుంది? జాతీయ పార్టీలకు ఈ అనుభవం తమిళనాడులో గతంలోనే అనుభవమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా సాధ్యం? అనే విషయాన్ని ఆలోచించవలసి వున్నది. ఆంధ్ర రాష్ట్రం 1953లో మదరాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పటి నుండి స్వతంత్ర రాష్ట్రంలా మనుగడ సాగించలేదు. 1956లో తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత హైదరాబాద్ మీద ఆధారపడి వున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పదమూడు జిల్లాలు స్వతంత్రంగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. విభజన తరువాత నష్టపోయామని ప్రచారం చేసుకుంటున్నారు కాని, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మాత్రం ఎంతగా లాభపడ్డాయో ఏపీ నేతలు చెప్పడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విధంగా మాట్లాడడం అనివార్యం. విభజన తర్వాత చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయవలసిన నాయకుడు అవసరం. రెండవసారి అధికారంలోకి రామేమో? అనే అనుమానంతో తన పార్టీవాళ్లకు ప్రయోజనం కలిగేలా పాలన సాగించటం వల్ల పార్టీ బలోపేతం అవుతుందేమో కాని రాష్ట్రం అభివృద్ధి చెందదు.
అభివృద్ధికి ఎందుకు అవరోధాలు కలుగుతున్నాయో కారణాలు పరిశీలించాలి. ఆర్థికంగా లోటు బడ్జెట్ వున్న రాష్ట్రం. ఉన్న నిధులన్నీ ప్రణాళకేతర ఖర్చులకే సరిపోతుంది. ఆంధ్ర ప్రాంతంలో సంవత్సరానికి సగటున ఒక తుఫాన్ ఉపద్రవం వస్తుంది. వీటన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినది ‘విశ్వనగరం’ కాదు, సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చిందించే రాష్ట్రం. విభజన వల్ల అన్యాయం జరిగిందని పాతపాట పాడితే అభివృద్ధి జరగదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఎల్లకాలం సహకరించదు. కేంద్రంలో జాతీయ పార్టీలు అధికారంలోకి రాకపోయినా, తాత్కాలికంగా సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా పూర్తికాలం అధికారంలో ఉండే అవకాశాలు తక్కువే. గతంలో వలే కేంద్రం నుంచి సహకారం లభిస్తున్న గ్యారంటీ లేదు. అదేకాకుండా ఇదివరకటిలా కేంద్రాన్ని శాసించే పార్లమెంటు స్థానాలు ఇపుడు ఏపీలో లేవు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా భాజపాతో సఖ్యత లేనపుడు అభివృద్ధి ఎలా సాధ్యం? ఉన్న నిధులన్నీ పార్టీ నాయకులకు, బంధువులకు వెచ్చిస్తే అభివృద్ధి ఎప్పుడు జరగాలి?
తన స్వలాభం కోసం చంద్రబాబు గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రంతో రాజీపడ్డారా? జనం ఎన్నుకున్న నాయకుడు సమర్థుడే కావచ్చు, కాకపోవచ్చు కాని నష్టపోయేది రాష్టమ్రే. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్టీఏతో తెదేపా తెగతెంపులు చేసుకోవడంలో అంతరార్థం ఏమిటి? జనం సానుభూతితో తిరిగి పదవిలోకి రావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఏదో ఒక ఎత్తుగడతో అధికారం దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే- అభివృద్ధిని లెక్కచేయకుండా పోతే- స్వయం సమృద్ధ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడాలి? మన దేశంలో మూడు రకాల రాష్ట్రాలున్నాయి. ఒకటి ప్రత్యేక రాష్ట్రం, రెండవది కేంద్రపాలిత రాష్ట్రం, మూడవది జాతీయ రాజధాని సరిహద్దు ప్రాంతం ఢిల్లీ. చంద్రబాబు లాంటి నాయకుడిని ఎన్నుకుంటూ వుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండజాలదు. ఇంకా యాభై సంవత్సరాలైనా ఒక సరిహద్దు రాష్ట్రంగానే ఉండిపోతుంది. అభివృద్ధి శూన్యంగా వుంటుంది. అభివృద్ధే ధ్యేయం అనే నాయకుడిని జనం ఎన్నుకోవాలి. అటువంటి నాయకుడిని ఇప్పటి నుండే తయారుచేసుకోవాలి. భూ సంస్కరణలను ప్రవేశపెట్టిన పి.వి.నరసింహారావును, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన జలగం వెంగళరావును జనం ఎన్నటికీ మరచిపోలేరు. ఇటువంటి నేతలను ఎన్నుకోవటంలో విజ్ఞత వుంది. గాని ఎత్తుకు పైఎత్తువేసి రాష్ట్ర విభజనకు తోడ్పడిన వాళ్ళకు పట్టం కట్టిన వాళ్లకు, సొంత ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకునే వాళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రం ముందుకు సాగదు. ఉన్న నిధులతోనే నిజాయితీగా పాలించే నాయకుడు అవసరం. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరం.

-కందిబండ నరసింహారావు 94407 48159