సబ్ ఫీచర్

ప్రాణాయామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రాణాయామం వల్ల
శరీరం కాంతివంతమవుతుంది.
* మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
* ఒత్తిడి దరిచేరదు.
* ఏకాగ్రత పెరుగుతుంది.
* జీర్ణశక్తి పెరుగుతుంది.
* బద్ధకం తగ్గుతుంది.
* రక్తం శుభ్రపడుతుంది. శరీర
అవయవాలకు రక్త సరఫరా బాగా
జరుగుతుంది. తద్వారా ఆక్సిజన్
శరీరానికి బాగా అందుతుంది.
* నాడీ మండలం, మెదడు
చైతన్యవంతమై చురుగ్గా ఉంటారు.
* కుండలినీ శక్తి మేలుకుంటుంది.
* రజో గుణం, తమో గుణాలు నశిస్తాయి.
* మంచి ఆకలి, ధైర్యం, ఉత్సాహం
కలుగుతాయి.

జాగ్రత్తలివిగో...
=========
యోగాసనాలు వేసేముందు తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా యోగాకోసం గంట సమయం కేటాయించారనుకోండి. దానిలో అరగంట ఆసనాలకు, పదినిముషాలు ప్రాణాయామం, మరో ఇరవై నిముషాలు ధ్యానానికి కేటాయిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. ఇక జాగ్రత్తల విషయానికొస్తే..
ఆసనాలు వేస్తున్నాం కదా అని ఇప్పటికే కొన్ని వ్యాధులతో సతమతమవుతూ వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించడాన్ని మానకూడదు. తర్వాత ఆసనాలు వేసే విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగినా దగ్గరిలోని యోగా గురువును సంప్రదించి ఆసనాలను మీరు సరిగ్గా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఆసనాలను వేసే ముందు కొన్ని నియమాలను, జాగ్రత్తలను పాటించాలి.
* ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగా చేయాలి. ఇప్పుడు కొంతమంది తొంభై సంవత్సరాల వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వారు మొదలుపెట్టి కొన్ని దశాబ్దాలు అయి ఉండి ప్రాక్టీసు మీద చేయవచ్చు. ఈ వయస్సు యోగాను మొదలుపెట్టేవారికి చెప్పే వయస్సు.
* తెల్లవారుజామున లేచి, కాలకృత్యాలు ముగించిన తర్వాతే యోగాసనాలు మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని ఆసనాలు వేయాలి. శబ్దాలు, గోలలు లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఆసనాలు వేయడానికి ఎన్నుకోవడం మంచిది.
* ఆసనాలు వేసేముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.
* పలుచని బట్టని నేలపై పరిచి పద్మాసనంతో మొదలుపెట్టి తరువాత మీకు నచ్చిన ఆసనాన్ని వేసుకోవచ్చు.
* ధ్యానం, ప్రాణాయామం చేసేటప్పుడు ప్రశాంతంగా కళ్లు మూసుకోండి. ధ్యాసను శ్వాస మీదనే లగ్నం చేయాలి.
* గాలి వదిలినప్పుడు, వదిలినప్పుడు పొట్ట లోపలికి, బయటకు వస్తుందో, లేదో గమనించాలి. కొంతమంది పొట్టద్వారా కాకుండా ఛాతి ద్వారా గాలి పీలుస్తుంటే అది సరైన శ్వాస కాదని గుర్తించి నిపుణుడి సలహాను తీసుకోవాలి.
* ఆసనాలు ఎప్పుడూ నెమ్మదిగా శ్వాసను అనుసరించి వేయాలి. తొందర తొందరగా ఆసనాలు వేయకూడదు.
* వేసిన ఆసనంలో కొద్ది సెకనుల పాటు అలాగే ఉండాలి.
* ఆసనం వేసేటప్పుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి.
* కుంభకం వేసేటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే వేయాలి.
* గాలి పీల్చడం, వదలడం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా, ప్రశాంతంగా చేయాలి.
* ఏ ఆసనం అయినా రొప్పుతూ, ఆయాసంతో చేయకూడదు. శరీర సామర్థ్యాన్ని అనుసరించి కొద్దిసేపు మాత్రమే చేయాలి. తరువాత తరువాత నెమ్మదిగా సమయాన్ని పెంచుతూ పోవాలి.