సబ్ ఫీచర్

సమాజానికి వెలుగు మహిళలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాలించే తల్లిగా, ప్రేమను పంచే
అర్ధాంగిగా నేటి సమాజానికి స్ఫూర్తి..
రేపటి సమాజానికి వెలుగు మహిళ.
అందుకే ఆమెను త్యాగమూర్తి అన్నారు.
మానవ సమాజంలో మహిళల పాత
మహోన్నతమైనది.
తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా
మమతానురాగాలకు పెట్టింది పేరు మహిళ.

మాతృత్వం, ప్రేమ, సహనం, త్యాగం ఆమె సొత్తు. ఆమె ఇంట్లో తిరుగుతుంటే.. ఆ ఇల్లు నందనవనంలా, పూజా మందిరంలా ఉంటుంది. అటువంటి ఇంట్లో ప్రేమ, వాత్సల్యం, త్యాగం, సేవకు కొదవ ఉండదు. ఆమె తనవారి కోసం తపనతో, ఆత్రుతతో నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూ, మరోవైపు ఇల్లు సర్దుతూ, వంటచేస్తూ, పిల్లలను సముదాయిస్తూ అతిథుల్ని ఆదరిస్తూ, గౌరవించే అనురాగమూర్తి. అవసరమైతే ఎంతటివారినైనా ఎదిరించగలదు. తలచుకుంటే కత్తిపట్టి యుద్ధం చేయగలదు. అయితే పురుషాధిక్య సమాజంలో అత్యాచారాలు, ఆత్మహత్యలు స్ర్తీకి శాపాలుగా మారాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శిక్షలు వేసినా ఈ ఆగడాల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిల ఓ ఝాన్సీ లక్ష్మీభాయిలా ఉద్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, పురుషులతో సమాజంగా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచి, చిన్నతనం నుంచే మగపిల్లల్లో సంస్కార బీజాలను నాటాలి. మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు పరచడంలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. దాంతో నిత్యం మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మీటింగులు పెట్టి మహిళలపట్ల గౌరవం పాటిస్తే సరిపోదు. నిత్యం మహిళల హక్కులు, వారి భద్రత, వారిని గౌరవించడం, స్వేచ్ఛపైన చర్చలు జరుగుతూ ఉండాలి. స్ర్తీలను కన్నతల్లిలాగా గౌరవించినప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంత మహిళలు, పట్టణాలలోని పేద మహిళలకు మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలి. వారిలో ఆత్మవిశ్వాసం, చైతన్యం తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి వారికి తెలియజేయాలి. మహిళలను అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య శక్తులుగా, సాహసమూర్తులుగా తీర్చిదిద్దాలి.

--కాయల నాగేంద్ర 85002 86697