సబ్ ఫీచర్

అధికార దాహమే అలజడికి మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ మతానికో చెందిన వారిగా కాకుండా, కేవలం ఒక దేశపౌరులుగా నాగరికత కలిగిన మానవులుగా కాసేపు ఆలోచిద్దాం.. కేవలం ఒక మతంపై ద్వేషంతో, తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించడానికి, ‘కవ్వింపు చర్యగా’ మతకలహాలకు దారితీస్తూ, దేశాన్ని అశాంతి పాలు చేసే అనాగరక కృత్యంగా స్పష్టంగా కనబతుతున్న అంశం: బహిరంగంగా గోమాంస భక్షణను ప్రకటించడం, సవాలు విసరడం. ఇది ‘అసహన’మనీ, దేశ పౌరుల మధ్య వైమనస్యాలకు హేతువవుతుందని మతాతీతంగా ఓ ఒక్క మేధావిగానీ, ఏ ఒక్క రాజకీయ నాయకులు గానీ హుందాగా, వివేకంతో మాట్లాడడం జరగలేదు. ఓటు బ్యాంకుల భద్రత కోసమో, క్షుద్ర రాజకకీయ ప్రయోజనాలకోసమో కిమ్మనకుండా ఊరుకున్నారు. నిన్నటికి నిన్న ఎక్కడో చెదురుమదురుగా జరిగిన కొద్దిపాటి సంఘటనలను, భూతద్దంలో చూసి, దేశ ప్రతిష్ఠ దెబ్బతినేలా ‘సహనం పెరిగిపోతోంద’ని తీవ్ర అసహనంతో గగ్గోలెత్తిన మేధావులంతా ఏమయ్యారు? ఇప్పుడు ప్రకటించిన ‘కవ్విపు చర్య’ తీవ్ర పరిణామాలకు బాధ్యులెవరు? లేక హిందువుల సహనాన్ని పరీక్షించడానికి దీనిని వినియోగించుకుంటారా? కోట్లాదిలో ఏ ఒక్కడి మనసో గాయపడి ప్రతిఘటిస్తే దానిని చిలవలు పలవలు చేసి మళ్లీ భారతదేశంలోని అధిక సంఖ్యాకులకు మతసహనం లేదు, అనే అపవాదుని సృష్టించడానికి వౌనం వహిస్తున్నారా?
ఆసలు-ఈ సవాలు విసరిన ప్రకటన హర్షించదగినదా? జం తు మాంస భక్షణం సగర్వంగా, బాహాటంగా చేయడానికి వెనక ఆకలో, విందో, అన్నదానమో లాంటి కారణాలుంటే హర్షణీయమే. కేవలం ఒక మతవిశ్వాసాన్ని గాయపరచి, హింసా వినోదాన్ని చూడాలన్న ఉద్దేశంతోనే విధ్వంస వాదులు చేస్తున్న కుత్సితమిది. హింసకి ఇంతటి విస్తృతిని కల్పిస్తున్నప్పటికీ జీవకారుణ్య సంఘాలు, కిక్కురుమనలేదెందుకు? నిజానికి దీని వెను క వీరు చూపిస్తున్న కారణాలు అంత బలీయమైనవి కావు. ఎక్కడో ఒకచోట ఒకడు గోమాంస భక్షణ చేస్తే, మరొకడు ప్రతిఘటించాడు. దానితో ఆ గోమాంసాహారి ఇతడిని కత్తితో పొడిచాడు. ఈ బాధితుడు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఒక్కడి నుండి వచ్చిన సమస్య మతపరంగా కాక, వ్యక్తిగత ప్రతీకారంగా మలుపు తిరిగింది. మృత్యుభయంలో ఉన్న తనవాడిని చూసి రగులుకుపోయిన బంధుమిత్రులు కలిసి, ఆ హత్యాయత్నం చేసిన వానిపై దాడి చేశారు. అతడు మరణించాడు. ఈ రెండవ సంఘటనను మాత్రమే తీసుకొని దానిపై కువ్యాఖ్యలు చేసి, కొందరు మేధావులు బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు కొందరు సహనం కోల్పోయినా, సున్నితంగానే తమ నిరసనను ప్రకటించారు. పూర్తి సమస్యను విశే్లషించకుండా, ప్రభుత్వ వ్యతిరేకత నెరిగిన మాధ్యమ రంగం, రాజకీయులు కలిసి దీనిని తమ అధికార దాహానికి, అవకాశంగా వాడుకున్నారు. అసలే ప్రపంచంలో ప్రబలంగా ఉన్న రెండు మతాల వారి దేశాల నుండి- మన దేశ వ్యవస్థను శాసించేందుకు చేస్తున్న కుతంత్రాలు వీరికి ఊతమిచ్చాయి. దేశ సుస్థిరతను, సామరస్యాలను దెబ్బతీయడానికి అన్ని వైపుల నుండి ఉద్రేకాలను రెచ్చగొడుతూ ఉద్యమిస్తున్నారు. ఉగ్రవాదులకు చెందిన మతంలోని వారు మహోగ్రంగా, తమ సహజ స్వభావమైన అసురత్వాన్ని అమాయాక మూగ ప్రాణులపై చూపిస్తున్నారు. ఈ జగుప్సాకరమైన ‘అసహనం’ అంతర్జాతీయ మాధ్యమ రంగాలకు గానీ, నేతలకు గానీ అనాగరికం అనిపించకపోవడం ఆశ్చర్యం.
అసలు భారతీయులు గోవును ఎందుకు పవిత్రంగా భావిస్తారు? దానిని మనం కేవలం మత దృష్టితో చూస్తున్నాం. ఈ దేశంపై దాడి చేసి వ్యాపించిన విదేశీయులకు- ఈ దేశపు స్వభావసిద్ధమైన విజ్ఞానం అర్థం కాలేదు. వారిక్కడకు రాకముందు నుండే భారతదేశస్థులందరికీ గోవు పూజ్యమే. వైదిక పురాణాలలోను, బౌద్ధ జైనాలలోను మరింతగా ‘అహింస’ ప్రగాఢమైంది. మాంసాహారులు కూడా నియమంగా ఉంటూ, గోమాంసాన్ని నిషేధించారు. కారణం భారత దేశపు గోవుకి మాత్రమే ఉన్న ప్రత్యేకత. అసేతు శీతాచలం విభిన్న జాతుల గోవులున్నా అన్నింటిలో ఒకే సామాన్యాంశం ఉంది. గంగడోలు, మూపురం, కలిగిన భారత గోవులన్నీ ఒకే లక్షణంతో ఉంటాయి. ఇలాంటి జాతి ఇతర దేశాల్లో లేదు. దీని నుండి వచ్చే పంచగవ్యాలు (పాలు, పెరుగు, నేయి, మూత్రం(జలం), గోమయం) ఔషధ విలువలున్నాయని వైద్యశాస్త్రం ఎప్పటినుంచో చెబుతూనే ఉంది. ఆ ప్రయోజనాలను మతాపేక్ష లేకుండా ప్రతి భారతీయుడు పొందుతున్నాడు. గో ఆధారిత వ్యావసాయ ఫలాల విలువ కూడా అనుభవసిద్ధమే. ఈ లక్షణాలు దేశవాళీ గోవులకు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం. తన దేశపు ప్రత్యేక జాతిని ఆ దేశ పౌరులందరూ కాపాడుకోవడం కనీస కర్తవ్యం. లేదంటే దేశద్రోహమే.
మేలును దేని నుండి పొందుతున్నామో దానిని దైవంగా కొలవడం భారతీయుల అనాది సంస్కారం. అందుకే గోవును, కొన్ని వృక్షాలను, దేవతలుగా కొలుస్తున్నారు. నదులను, సూర్య చంద్రులను, కూడా దేవతా స్వరూపాలుగా ఆరాధించారు. అయితే భారతీయతపై ద్వేషంతో సూర్యుణ్ణి హత్య చేద్దామని బయలు దేరితే అజ్ఞానం కాదా? పులుల్ని చంపినా శిక్షించే ప్రభుత్వం, పనికట్టుకొని మతవైషమ్యాలకు రేపుతున్న ఈ దుశ్చర్యలన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నాయి? గోవులను అధిక సంఖ్యలో సంహరిస్తేఏ ఉపద్రవాలు వస్తాయని మన శాస్త్రాలు వర్ణించాయో వాటిని కళ్లారా చూస్తూనే ఉన్నాం. కానీ హేతువాదులమనుకునే ఒక మూఢ వర్గం దానిని కొట్టి పారేస్తున్నారు.
అహింసావాదంతో జగత్పూజ్యులైన మహాత్ముడు బుద్ధ్భగవానుడు. అయననూ భగవద్రూపంగా స్వీకరించి, వారి సిద్ధాంతాన్ని కూడా కలుపుకొని పురోగమించింది హిందూమతం. తమ మూలమైన వేదాంత జ్ఞానమే బౌద్ధంలో ఉందని స్పష్టంగా తెలుసుకున్నారు. అలాంటి బుద్ధుని ఆరాధించే మతానుయాయి అంబేద్కర్ మహాశయుడు. ఆయన పేరు చెప్పుకొని ఉద్యమాలు చేస్తున్న వర్గాలు కూడా ఈ హింసాకాండకు మద్దతు తెలపడం ఆచ్చెరువు మాత్రమే కాదు, శోచనీయం కూడా. స్వాతంత్రానికి పూర్వం, పాశ్చాత్యులు, భారతీయులు హిందూ ముస్లింలలో వైషమ్యాలు సృష్టించడానకి పలు కుట్రలు పన్నారు. వారిని ఉపాసించే రాజకీయులు సుమారు ఆరు దశాబ్దాలపాటు స్వతంత్ర భారత దేశంలో ఈ విభేదాత్మక ధోరణినే అవలంబించారు. ఒకవైపు కులమత రహిత సమాజం అంటూ వల్లిస్తూనే, ఆ రెండింటి భేదాలతోనే తమ ఉనికిని నిలుపుకుంటున్నారు. ఇప్పుడు అధికారం చేజారగానే, మళ్లీ తమ పాత ధోరణుల్లో వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యూహాలు చేస్తున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలలో తమ బలం కోసం హిందూ ముస్లిం సామరస్యాలను దెబ్బతీసి, పబ్బం గడుపుకున్న చరిత్ర ఈ కారణాన్ని బలపరుస్తున్నది. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసే ఇలాంటి ప్రకటన, హిందూమతం నుండి ఏనాడైనా వెలువడిందా? దేశహితాన్ని కోరే హిందూ ముస్లిం సోదరులంతా ఈ మూల దుర్మార్గాన్ని కనుగొని, అభివృద్ధివైపు సాగుతున్న భారతాన్ని కాపాడుకోవలసిన తరుణమిది. విద్యాధికులు, మేధావి వర్గం, సిద్ధాంతాల రంగుటద్దాలనుంచి కాక, నిర్మలాంతఃకరణతో ఒక్కసారి ఆలోచించండి. సామరస్య సమన్వయ ధోరణి కలిగిన భారతీయ సత్సంప్రదాయాన్ని సుప్రతిష్ఠితం చేసుకుందాం.

- సామవేదం షణ్ముఖ శర్మ , samavedam@rushipeetham.org