సబ్ ఫీచర్

జనహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యజీవితంలో తమ పిల్లల పెంపకం గురించి ఎంత అపురూపంగా చెప్పుకున్నా పడటం తెలియకనే తమ చిన్నారి నడవగలిగిందన్నా, అంతకన్నా ఉత్సాహంగా పరుగులు పెట్టిందన్నా అంతకుమించిన అసత్యం మరొకటి ఉండదు.
సత్యానికి, అసత్యానికి తేడా ఒకే ఒక్క అక్షరమే ఐనా వాటి తాలూకూ ప్రభావాలైనా ఫలితానైనా పరస్పర విరుద్ధాలు.
కన్నవారి ఆలనా పాలన పుష్కలంగా కలిగిన వారికి, తమ సుఖాలే శాశ్వతం కాదని, కష్టాలు కలకాలం ఉండబోవని ఇరుగుపొరుగు , సమాజం ప్రతి నిత్యం కళ్లకు కడుతూనే ఉంటాయి. ఓటమి తర్వాత గెలుపు, చీకటి తర్వాత వెలుగు తథ్యమనుకుంటే జీవితంలో ఆశావాదానికి నిదర్శనమనుకుంటే, ఇవాళ చస్తే రేపటికి రెండనేది జీవన తాత్వికతకు ప్రతిబింబమవుతుంది. సందర్భానికి సరిపడే అతిశయోక్తులు, అత్యుత్సాహాల తీరు జోరెలా ఉన్నా మానవుడు తాను నేలమీద వున్నానన్న వాస్తవాన్ని , తానెన్ని కలలు కన్నా ఏమి చేసినా నేలలోంచి అన్న యథార్థాన్ని విస్మరించరాదు.
జన్మకారకులు తల్లిదండ్రులైనా పెంపకానికి సైతం తల్లిదండ్రులే బాధ్యులైనా, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు తగినట్లు ఎదిగినా తన అభిరుచులను జీవితం పట్ల అభిప్రాయాలను తల్లిదండ్రులకు స్పష్టం చేసి భవితను తన ఎదుగుదలను తానే తీర్చి దిద్దుకున్నా అది నల్లేరుపై బండి నడక ఎంతమాత్రం కాదు.
జీవనపోరాటంలో ఆశల ఆరాటంలో అడుగడుగునా సమస్యలు, సవాళ్లు ఎదురవడం సర్వ సామాన్యం. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల సహకారమున్నవారికి వాటిని అధిగమించడం సుసాధ్యమే. ఎటొచ్చి ఎటువంటి కుయుక్తులకు చోటివ్వక, ముక్కు సూటి తనంతో స్వశక్తితో వాటిని అధిగమించేందుకు చేసే ప్రయాణం ప్రయాసతో కూడుకున్నదే.
సామరస్యత, సమన్వయం అలవరుచుకున్నవారు తొలి, మలి ప్రయత్నాల్లో అనుకున్నది సాధించలేకపోయినా చెక్కుచెదరని చిరునవ్వుతో మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తుంటారే తప్ప వెనక్కి తిరిగి చూసుకోరు. ఒక్కొక్కసారి తామెంచుకున్నది సాధించించేందుకు తమ శక్తి సరిపోదని మరో ఎంపికకు ప్రాధాన్యమిచ్చి తామనుకొన్న ది సాధించి తీరుతారు.
ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు తెలిసినవారు, ఇరుకు మనసుతో ఆరాలు తీసినాఅవహేళన చేసినా రెట్టింపు శక్తిని పుంజుకుంటారే తప్ప ఎవరో ఏమో అనుకుంటున్నారని కాని, ఏదేదోప్రచారం చేసి నలుగురిలో నవ్వుల పాలుచెయ్య జూస్తున్నారని గాని ఎంతమాత్రం ఆలోచించరు. బాధపడరు. నీరసాన్ని, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వరు.
తన జననం తనకి తెలియని మనిషి అనారోగ్యాల గురించి వాటి సత్వర నివారణ గురించి భయపడటమైనా ఆందోళనకు గురి కావడమైనా ఎటువంటి ప్రయోజనాన్ని అందించదు. పుట్టిన ప్రతిప్రాణికి మరణం తప్పదు. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. మానవుడు ఆశాజీవి. కనుక ప్రతిరోజూ గాయాలైనా సరే వాటికి మందు రాసుకొంటూనే మరో రోజు గాయం తగలదులే అన్న స్ఫూర్తితో ముందుకు నడవాలి.
చదువులు, పదవులు పలుకుబడి అనుబంధాలు దూరం చేసేవి కారాదని నిర్ణయించుకోవాలి. ఎదుటివానికి సాయపడలేకపోయినా ఫర్వాలేదు కాని తెలిసి ఎవ్వరికీ బాధించరాదు. వారానికి కనీసం ఒక్క పూట ఉపవాసం ఆరోగ్యానికి సహకరిస్తుందన్న విశ్వాసం కలిగిన వారు ఆఖర్చుతో వారానికి కనీసం ఒకరికైనా ఆకలి తీర్చడానికి సాయం చేయాలి.
అనవసరపు ఖర్చుకి కళ్లెం వేయాలి. ఆ మొత్తాన్ని అవసరమైన విషయానికి అందచేయాలి.అపుడే పరోపకారం చేసినవారవుతారు. ప్రతిఒక్కరూ పరోపకారానికి ప్రతినిధులుగా మిగిలిపోతూ మరెందరికో స్ఫూర్తి దాతలుగా ఉండే అవకాశం ప్రకృతి ఇస్తోంది. దాన్ని గమనించి జీవన ప్రణాళిక వేసుకోవాలి.

- డా. కొల్లు రంగారావు