సబ్ ఫీచర్

అరవైలో ఇరవై కావాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయస్సు పైబడుతున్న కొలది ఏదో ఒక అనారోగ్యం వస్తుండం మా మూలే. అందులో మహిళలకు మరికొన్ని అనారోగ్యాలు రావడం కూడా సహజమే. ఎందుకంటే 45 దాటిన తరువాత ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల తగ్గుముఖం పడుతుంది. దాంతో మెటబాలిజం పనితీరులో మార్పులు ఏర్పడుతాయి.
సాధారణంగా ఈ నెలసరి ఆగిపోతున్నప్పుడూ ఆగిపోయిన తరువాత కూడా మహిళల్లో బరువు పెరగడం, మోకాళ్లు అరగడం, పాదాల వాపు ఇలాంటి అనారోగ్యాలు బయటపడుతుంటాయి.
వీటిని అధిగమించాలంటే మందులతో పాటు వ్యాయామాలు తప్పని సరి. చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న వారైతే క్రమం తప్పకుండా మరికొద్ది సేపు నడక టైమ్‌ను పెంచుకోవచ్చు. కొందరు అప్పటిదాకా నడక అలవాటు లేకపోతే మాత్రం ఇప్పుడు తప్పనిసరిగా నడకను అలవాటు చేసుకోవాలి. ముందు ఐదునిముషాలతో ప్రారంభించి మెల్లమెల్లగా సమయాన్ని పెంచుకుంటూ 4, లేక 5 కిలోమీటర్ల దాకా నడక కార్యక్రమాన్ని పెట్టుకోవాలి.
దానితోపాటుగా యోగాభ్యాసాలు .. ఆసనాలు వేయడం సూర్యనమస్కారాలు చేయడం లాంటివి చేస్తే మరీ మంచిది.
ఉద్యోగాలు చేసే మహిళలైనా గృహకృత్యాలు చేసే మహిళలైనా కేవలం రోజువారి చేసే పనులే కాక మనసుకు తృప్తినిచ్చే పనులు కొత్తవి అలవాటు చేసుకోవాలి. అంటే ఇతరులకు కుట్లు అల్లికలు ల్లాంటివో లేక సంగీతం నేర్పించడం లాంటివో చేయవచ్చు. లేదంటే చిన్నపిల్లలకు చదువు చెప్పడమైనా చేయవచ్చు. లేదంటే చిన్నప్పుడు ఇష్టపడి కూడా నేర్చుకోలేని విద్యలేమైనా ఉంటే వాటిని ఇపుడు తిరిగి మొదలు పెట్టవచ్చు. వాటివల్ల మనసుకు కొత్త ఉత్సాహం వస్తుంది. ఆగిపోతున్న ఈస్ట్రోజెన్ హార్మోన్ తిరిగి పని మొదలెట్టినట్టు అవుతుంది. మనసుతో పాటు శరీరం కూడా ఉత్తేజితమై దేహక్రియలు సక్రమం అవుతాయ.
ఇలాంటివి చేయడం వల్ల మనసుకు ఉత్తేజం పెరుగుతుంది. ఉత్సాహం వస్తుంది. దాంతో రోజువారి చేసే పనుల్లోకూడా మార్పు వస్తుంది. శరీర బరువు అనుకోకుండానే క్రమబద్దం అవుతుంది.
అందుకే ఎప్పుడూ అలసటతో కాక ఉత్సాహంతో పనిని చేస్తూండాలి. నలుగురితో కలసి నవ్వుతో తుళ్లుతూ ఉండడం కూడా ఒకవిధమైన యోగాసనమే సుమా.
ఇలా చేసేవారు అరవైలో కూడా ఇరవై లాగా కనిపిస్తారు.

-శ్రీలత