సబ్ ఫీచర్

తల్లిదండ్రులూ బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం హోరెత్తేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ప్రచార కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నది. నేటి విద్యా విధానాన్ని చదువు‘కొంటున్న దుస్థితి’గా పేర్కొనవచ్చు. ఇంకా... నేటి విద్యా వ్యవస్థ దోపిడీ వ్యవస్థ, మాఫియా వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. ప్రతియేటా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నిర్వహణ ఖర్చులకు ఉపాధ్యాయుల జీతభత్యాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఈ మధ్య ఒక ప్రైవేట్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొన్నది. ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక కళాశాలలకు, మెడికల్, పీజీ కళాశాలలకు సంబంధించి దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొక్కపడుతున్నదని ఊహించుకోవచ్చు. ఇంత స్థాయిలో ప్రభుత్వ ప్రజాధనం వృధా అవుతున్నప్పటికీ ప్రైవేట్ రంగంనందలి పాఠశాలలు, కళాశాలలనందు తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారంటే... అందుకు పాలకులతోపాటు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. విచ్చలవిడిగా ప్రైవేట్ వ్యక్తులకు విద్యాసంస్థలు నడపడానికి పాలకులు అనుమతి ఇస్తుండడంతో ఇది మాఫియా వ్యాపారంలాగా మారింది.
దాదాపు 90% విద్యా సంస్థల అధినేతలు ఏదో ఒక రాజకీయ పార్టీలో కీలక స్థాయిలో పనిచేస్తున్నారు. రాజకీయ పార్టీల అండదండలు వుండడంతో ఏయేటికాయేడు విద్యా వ్యాపారాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ పోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల నందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రారంభంనుంచే 30, 40 వేల నుంచి వేతనాలు ఇస్తున్నారు. సీనియారిటీ వున్న టీచర్లకు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు. ఇంత వేతనాలు పొందుతున్న వీరిలో చాలామంది ఉద్యోగాన్ని అలా కాలక్షేపం కోసం నిర్వహిస్తూ సమీప పట్టణాలలో కాపురాలుంటూ ప్రభుత్వ ఉద్యోగి అనే ఇమేజ్‌తో ప్రైవేటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలనందలి పాఠశాలలు కనీస వసతులు లేక కునారిల్లుతున్నాయి. ఆ మధ్య నేరుగా హైకోర్టు హైస్కూల్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు మరుగుదొడ్లు లేవని చివాట్లు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలనందు హాజరు శాతాన్ని పెంచడానికి ఉచిత మధ్యాహ్న భోజనాన్ని తీసుకొచ్చినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా వేలాది రూపాయల డొనేషన్లు ఇతరత్రా భారీ ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ స్కూళ్లనందు చేరుస్తున్నారు.
ఇటీవల గుంటూరు జిల్లాలో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇలాగే ప్రవీణ్‌కుమార్ అనే ఒక ఐ.పి.ఎస్. అధికారి తన పిల్లల చదువుకు అంతరాయం కలుగుతుందని ఇంట్లో డిష్ కనెక్షన్ లేకుండా చేశారు. కేవలం వారం వారం దూరదర్శన్ నందు సినిమా చూడడానికి మాత్రం అవకాశం కల్పించారు. ఈ అధికారి తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శిగా వున్నప్పుడు 9వ తరగతి బాలిక పూర్ణ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆనంద్ అనే విద్యార్థినీ విద్యార్థులను ఎంతగానో మానసికంగా తర్ఫీదు ఇచ్చి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కేవిధంగా ప్రోత్సహించారు. ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్సీల పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలలోనే చదివించాలని ఒక స్పెషల్ సర్క్యులర్ జారీచేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు సంఘాలు బాధ్యతలు మరచి హక్కుల కొరకు మాత్రమే తాపత్రయ పడుతున్నందున విద్యా వ్యవస్థలో చాలావరకు దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరు కావలసిన చోట బదిలీ కావడానికి విద్యాశాఖాధికారులకు లక్షల్లో లంచాలు ఇస్తున్నారు. ఆ మధ్య కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి మహిళా టీచర్ల బదిలీల విషయంలో బ్లాక్‌మెయిల్ చేశాడని... అవి నీలి చిత్రాల సీడీల రూపంలో మార్కెట్లోకి వచ్చాయని పెద్ద దుమారం రేగింది. ఈ విధంగా అస్తవ్యస్తంగా మారిన నేటి విద్యావిధానం గాడిన పడడానికి పాలకులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వుంది.

-తిప్పినేని రామదాసప్పనాయుడు ఫోన్: 99898 18121