సబ్ ఫీచర్

విద్యార్జనే ప్రగతికి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి సెలవుల తర్వాత విద్యాలయాలన్నీ మళ్లీ తలుపులు తెరచుకున్నాయి. సాధారణంగా తమ తమ ఇండ్లల్లో పూజలు చేయటంలోను, ఎక్కడ ఏ పూజలు జరిగినా అత్యంత శ్రద్ధగా అందులో పాల్గొనటంలోనూ స్ర్తిలు ముందుంటారు. అలాగే విద్యాలయాల్లో జరిగే పూజ- అదే విద్యార్జన అనే పూజలోనూ యువతులందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
సరస్వతీ దేవి పూజ చేయటంతో తృప్తిపడరాదు. ప్రతి స్ర్తి తానే ఒక సరస్వతీదేవిగా, చదువుల తల్లిగా ప్రకాశించాలి. మధ్యలోనే చదువును మాని, పెండ్లి చేసుకొని, చింతల నిప్పుల్లోకి దుమకరాదు. ఎంత వీలైతే అంత అధికంగా చదవాలి, డిగ్రీలు పొందాలి. నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పొందాలి.
చదువు, సంపద చెట్టాపట్టాలేసుకొని గంతులేస్తుండడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పురుషునికంటే కూడా స్ర్తికే విద్య ఎక్కువ అవసరం. ఒక పురుషుడు విద్యావంతుడైతే ఒక వ్యక్తిమాత్రమే విద్యావంతుడైనట్టు. అదే ఒక స్ర్తి విద్యవంతురాలైతే కనీసం ముగ్గురు విద్యావంతులైనట్టు ( ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకొంటే). ఆమెకు చదువు, సంస్కారం ఉంటేగా ఆమె పిల్లలకు వాటిని ఇవ్వగలిగేది. దేశంలోని ప్రతి ఇంటిలోని స్ర్తి తానే ఒక సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, శ్రీవిద్యగా ప్రకాశిస్తే ఇక ఆ దేశమే స్వర్గసీమగా మారిపోదా?
న చోర హార్యం న చ రాజహార్యం/ న భ్రాతృ భాజ్యం నచ భార కారీ
వ్యయేకృతే వర్థత యేవ నిత్యమ్/ విద్యాధనమ్ సర్వధన ప్రధానమ్
అంటే విద్య అనునది దొంగల చేతికి దొరకనిది, దొరల చేత లాక్కొనబడలేనిది, అన్నదమ్ముల చేత పంచుకొనబడలేనిదీ, ఎంత నేర్చిననూ భారము కానిదీ, నేర్చికొద్ది పెరుగునది, సర్వధన ప్రధానమైన ధనం అని అర్థం. అంతే కాదండోయ్, విద్యయను ‘దివ్యధనం బఖిలార్థికోటికిం పూర్తిగ నిచ్చినన్ పెరుగు, పోదు యుగాంతపువేళనైన..’ ఇంకా చెప్పాలంటే-
‘విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్’.
విద్య నృపాల పూజితము, విద్యనెఱుంగనివాడు మర్త్యుడే’
‘నాస్తి విద్యా మం చక్షు’- విద్యతో సమానమైన నేత్రం లేదు. పురుషులకు మరి ముఖ్యంగా స్ర్తిలకు అందాన్నిచ్చేది విద్య. కురూపులకు, వికలాంగులకు కూడా తరగని అందాన్నిచ్చేది విద్య. విద్యారూపం విరూపాణాం. విద్య కల్పవృక్షం. విద్య కామధేనువు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధినిచ్చి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కల్గించేది విద్య. విద్య తీసుకురాగల మార్పు, విద్య చేయగల మాయ అంతా ఇంతా అని చెప్పలేము. అందుకే ప్రతి ఒక్కరు విద్యార్జన చేయాలి. లోక ప్రగతికి పాటుపడాలి.

-రాచమడుగు శ్రీనివాసులు