సబ్ ఫీచర్

ఆదర్శ సోదరులిరువురూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణునికి శ్రీరాముడు అనే్న కాదు, ఆదర్శమూర్తి కూడాను. అసలు రాముడు వేరు లక్ష్మణుడు వేరుకాదు. ఎవరైనా అన్నదమ్ములు కలసి ఉంటే రామలక్ష్మణులుగా ఉన్నారు అంటే అంటే వారిద్దరే అన్నదమ్ములకు ప్రేమకు మారు పేర్లు. ఉదాత్తమైన అనుబంధం రామలక్ష్మణులది. వీరిద్దరి లాగే భారతీయ సోదరులం తా కలసి ఉండాలని కోరుకోవాలి. అసలు భారతదేశమే కాదు సర్వ ప్రపంచంలోని సోదరులంతా కలసే ఉండాలి. అందరికీ ఆదర్శం రామాయణమే. పుత్రకామేష్ఠి యాగం చేసియజ్ఞపాయస ప్రభావంతో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మించారు. సుమిత్రకు రాముడి అంశతో లక్ష్మణుడు, భరతుని అంశతో శతృఘు్నడు జన్మించారు.
దుష్టులను శిక్షించడానికి గాను మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అతని ఆయుధాలైన శంఖ, చక్ర గదలు లక్ష్మణ, భరత, శతృఘు్నలుగా అవతరించారు అనే పురాణం మనకు లభ్యమవు తుంది. ‘చకార అస్మభ్యమ్- ఆత్మనే తప సంతుసః’ అంటే మాకోసం తన కోసం మేలు చేసేవాడే తపస్వి అని అధర్వ వేదపాఠం. సాటి మానవులపట్ల మేలు కలిగేలా ప్రవర్తించాలి. ఇతరులకు కీడు కలిగించే వాడు క్రూరుడు. మేలు చేయనివాడు వ్యర్థజీవి. గొప్పదైన ఈ తపఃస్వభావమే నిజమైన ప్రతాపం. ప్రతి వ్యక్తి తాను చేసే పనులు ఇతరులకు మేలు కలిగిస్తున్నాయా? లేక కేవలం తన సుఖం కోసం మాత్రమే జీవిస్తున్నానా అని పరిశీలించుకోవాలి. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకొనడమే ఈ తపస్సు అర్థం. ధర్మపాలన తరువాతనే స్వసుఖం. లక్ష్మణుడిలో ఈ లక్షణాలు పుష్కలంగా మనకు కనిపిస్తాయ.
లక్ష్మణుడు, హనుమంతుడు రామునంతటివారు. ఇప్పుడైనా భక్తులెవరైనా బాధల్లో ఉంటే రాముని తలుచుకుంటే చాలు లక్ష్మణుడు హనుమంతుడు ఈ భక్తుల కోరికలు తీర్చేస్తారు. వారి బాధలను దూరం చేస్తారు.
హరేరామరామ హరే కృష్ణ కృష్ణ అనే నామం పలుమార్లు తలుచుకుంటేరామలక్ష్మణులు మన చెంతే ఉంటారు. వారితో పాటు ఆంజనేయుడు ఉంటాడు. రాముని నడతనుఅర్థం చేసుకొని మనమూ రామునివలె నడవాలి.

-జి.కృష్ణమూర్తి