సబ్ ఫీచర్

పాఠశాల ఒక చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల ఒక వ్యవస్థ. దాని పని విధానం చెట్టుకున్న బెండు వంటిది. అది కాలానుగుణంగా మారుతుంటుంది. అది వడ్డించిన విస్తరి కాదు. దానిలో ఉండే వ్యక్తులు చేసే పని నిర్ధారణ చేస్తుంది. పాలసీలు, రూల్స్ సమస్యలను పరిష్కరించవు.దానిలో పనిచేసే మనుషుల ఆలోచనా విధానమే సమస్యల సృష్టికి, పరిష్కారానికి కారణం. రూల్స్‌ను మార్చే ముందు అక్కడి వ్యక్తులతో కలిసి మాట్లాడి ఏకాభిప్రాయాలు తీసుకొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రూల్స్ మాత్రమే స్కూలు స్థితిగతులను మార్చుతుందనుకోవటం సమంజసం కాదు. సమాజానికి స్కూలు ఒక స్వల్పమైన రుసుం. దానిలో కూడా కొందరికి అధికారాలుంటాయి. జ్ఞానవేదికలుంటాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, సంప్రదించిన తర్వాత వివిధ వ్యక్తుల ఆశయాలను దృష్టిలో పెట్టుకుని రూల్స్ రూపొందించుకోవాలి. హెడ్ మాస్టర్లు కొత్త వ్యవస్థ రాగానే చెట్టులోంచి బెరడు తీసినట్లు కాదు. రూల్స్ మారినంత మాత్రాన వ్యవస్థ మారదు. వ్యక్తుల్లో ఐక్యత, వ్యక్తుల్లో దాన్ని పాటించే స్వభావం అది ఏర్పడితేనే మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల నిలబడుతుంది. పాఠశాలను ఒక చెట్టును పెంచినట్లే పెంచాలి. అది అవిరళంగా జరగవలసిన కార్యక్రమం. అది సమష్టి కార్యక్రమం. ఇందుకు సంబంధించిన అందరి వ్యక్తుల అంగీకారంతో చేయవలసిన పని. సమష్టి కార్యక్రమంలో అందర్నీ భాగస్వామ్యం చేస్తేనే ఆ స్కూలు నాలుగు కాలాలు వర్థిల్లుతుంది.

సమాజమే పట్టుకొమ్మ
నిశ్చలంగా ఉండే పాఠశాలల్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. సజీవంగా ఎదిగే పాఠశాలలను సమాజం నిర్మిస్తుంది. సమాజం పాఠశాలలకు ఆస్తులు ఇవ్వటం దానం కాదు. వచ్చే తరానికి ఆదేశం ఇవ్వటం. నేను నా బాధ్యతలను నిర్వహించాను. మీరు మీ బాధ్యతలు నిర్వహించుకోవాలని పాఠశాల చెప్తుంది. నేను స్టాన్‌ఫర్డ్‌కు వెళ్లినప్పుడు 10 మంది విగ్రహాలు చూశాను. ఆ యూనివర్సిటీలో చేరే ప్రతివారు మొదట ఆ విగ్రహాలకు నమస్కరించి వెళతారు. వారి దూరదృష్టే ఈనాడు ప్రపంచంలో అత్యున్నతమైన యూనివర్సిటీకి తమ ఆస్తులు రాసిచ్చినవారు. గోదావరి జిల్లాలో రామచంద్రపురం వెళితే 125 ఎకరాల మాగాణిని పేర్రాజు స్కూలు రాసిచ్చారు. ఆ భూమినుంచి వచ్చే పంటను మధ్యాహ్న భోజనానికి ఉపయోగించమని అభ్యర్థన. అదే మాదిరిగా సమాజం తనకు వీలైనన్ని విరాళాలు ఇస్తుంది. దానివలన వర్తమాన విద్యార్థులు స్ఫూర్తి చెందుతారు. గత సమాజం మా కోసం ఇది చేసిందని తెలంగాణలో గర్విస్తూ ఉంటారు. మేము కూడా ఏమైనా చేయాలని అనుకుని ప్రతి సంవత్సరం ఆ స్కూలుకు వచ్చే పాత విద్యార్థులు నోట్స్ పంచి పెట్టి పోతుంటారు. ఇలాంటి కార్యక్రమాలు స్కూలుకు సజీవంగా ఉంచుతాయి. ప్రతి సంవత్సరం చదువుకునే విద్యార్థులు ఏదో ఒక మొక్కను తనకు గుర్తుగా నాటాలని అనుకుంటారు. పాఠశాలలు సజీవంగా ఉండటానికి ప్రతి తరం ఏదో చిన్న పనిని తను చదువుకున్న పాఠశాలలకు, తన గ్రామంలో పాఠశాలకు సాయంచేస్తే సమాజం భాగస్వామ్యాన్ని వ్యక్తీరించినట్లవుతుంది. ఏ చిన్న వస్తువు కావాలన్నా ప్రభుత్వం నుంచి ఆశించే కన్నా సమాజం భాగస్వామ్యమే ఆ స్కూలుకు ఆలింగనం చేసుకోవాలి. పాఠశాల సజీవంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం ఉండాలి. పాఠశాలకు సమాజమే పట్టుకొమ్మ.

అసమానతలను తొలగించేది...
సాధన యోగ్యతనివ్వాలని విశిష్టతను ఆశించదు. ఇదివేరే రకరకాల ప్రివిలేజెస్ ఉన్నాయి. పుట్టుకతోనే గొప్పవాణ్ణన్న ప్రివిలేజ్ ఉండేది. జెండర్ పరంగా ప్రివిలేజ్‌ను తెచ్చిపెట్టారు. డబ్బు, అధికారంలో విశిష్టత రావొచ్చును. ఈ మాదిరిగా రకరకాల విశిష్టతలతో అసమానమైన సమాజం ఏర్పడుతుంది. ఈ విశిష్టతలను తొలగించటానికి డా.బీఆర్ అంబేద్కర్ విద్యకు అపారమైన శక్తి ఉన్నదని, దీని ద్వారా నవ సమాజం నిర్మించవచ్చునని ఆకాంక్షించాడు. మనిషికి సాధన చేసే శక్తివల్ల బ్రహ్మాస్త్రం లభిస్తుంది. అన్ని అంతరాలను సమతలం చేసే శక్తిని ప్రసాదిస్తుంది అని అంబేద్కర్ చాటి చెప్పాడు. విద్యను ఒక రోడ్‌రోలర్‌గా భావించారు. జ్ఞానం ఒక అస్త్రం మాత్రమే. సాధకుడు ఆ అస్త్రాన్ని సమాజంలో గర్భితమైన ఉన్న వివిధ రకాల విశిష్టతలను తొలగించి నూతన సమాజాన్ని నిర్మించే శక్తి ప్రసాదిస్తుంది. సాధన అనేది సామాన్యమైన మనిషిని శక్తివంతంగా చేసి పరిశోధకునిగా మార్చుతుంది. ఈనాడు విద్యావ్యవస్థల ముందున్న సవాలు- డిగ్రీలు పంచటం కాదు. ఉపాధిని కలిగించటమే కాదు. సమాజంలో రకరకాల విశిష్టతల వలన ఏ అసమానతలు ఏర్పడ్డాయో వాటిని రూపుమాపే నూతన సమాజ లక్షణమే స్కూలు లక్షణం. విద్యాలయాలకు ఇలాంటి శక్తిని ప్రసాదించింది మన రాజ్యాంగం.

సమష్టి శ్రమరూపం
సమాజం ఉపాధ్యాయునికి మాతృస్థానాన్నిచ్చింది. బిడ్డలకు తల్లి గోరుముద్దలు తినిపించినట్లుగా ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాన్ని ప్రేమతో చెబుతాడు. పాఠాన్ని యధావిధిగా క్రమబద్ధీకరిస్తాడు. పాఠాన్ని భిన్న భిన్న ప్రశ్నలుగా రూపొందించి అవి చర్చిస్తాడు. తర్వాత పిల్లలతో అలాంటి ప్రశ్నలు రూపొందించినదాన్ని కొద్దిగా కఠినతరం చేసి ఒక మెట్టెక్కిస్తాడు. పిల్లలు మెట్టెక్కగలుగుతారనే నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు పుస్తకంలో ఉన్న ప్రశ్నలను పిల్లలకు చూపిస్తాడు. పిల్లలు చురుకైనవాళ్లు కాబట్టి భిన్నమైన ప్రశ్నలు ఎదుర్కొనేవారు కాబట్టి సులభంగానే సమాధానాలిస్తారు. పిల్లలు ‘ఇంతేనా?’ అని భావిస్తారు. ఈ ప్రక్రియనే ఉపాధ్యాయుడు విద్యార్థులను సబ్జెక్టులో అవగాహన కల్పించడం అంటారు. మనిషి నీళ్లలో మునిగినప్పుడు ఒకే ధ్యానం ఉంటుంది. అది ఎలా పైకి రావాలోననే ఆలోచన ఉంటుంది. అదే మాదిరిగా పిల్లల చిక్కుముడిని విడగొట్టి సమస్యను సాధించాలనే పట్టుదలను పూర్వజ్ఞానం పట్టుదలను పెంచింది. ఎక్స్‌లెన్సీ రావటానికై ఉపాధ్యాయునికి ప్యాషన్ ఎంత ప్రధానమో విద్యార్థికి దానికి కావాల్సిన పూర్వజ్ఞానం అంత ప్రధానం. దానివల్ల అభిరుచి ఏర్పడుతుంది. అభిరుచి వల్ల పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలే కఠినమైన సమస్యలను సులభంచేసే మార్గం తెలుస్తుంది. అందుకే తరగతి గది ఎవ్వరికి ఏ స్థానంలో ఇవ్వాలో మానసిక శాస్త్రాన్ని దృష్టిలోపెట్టుకుని ఆ స్థానం అందజేస్తుంది. తరగతి గదిలో వివిధ పాత్రలుంటాయి. ఎవరి పాత్రను తరగతి గది ఒక సమిష్టి శ్రమలో ఏర్పడిన రూపం.

-చుక్కా రామయ్య