సబ్ ఫీచర్

వాషింగ్‌మిషన్ వాడుతున్నారా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రతివారు అంతో ఇంతో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతున్నారు. ఆ వస్తువుల్లో వాషింగ్ మిషన్ ఒకటి. చేత్తోటి ఉతుక్కునేవారు తక్కువైనారు. చాలామందే వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు. కాకపోతే అందులో టైము లేకనో, ఎలా ఉతకాలో తెలియకనో వాషింగ్ మిషన్‌లో వేసి బట్టలు పాడుచేసుకొంటున్నారు. చివరకు ‘అయ్యో ఎంతో ఖరీదు పెట్టి కొన్నాం. ఇలా తయారైంది. అంతా వాషింగ్‌మిషన్‌వల్లే’అనేస్తున్నారు.
పాపం వాషింగ్‌మిషన్ యంత్రం కదా అదేమీ చేయదు. మనం ఎలా చెబితే అలా వింటుంది. అందుకే మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే చాలు బట్టలు తళతళతో పాటుగా మన్నికగా కూడా ఉంటాయి.
మొట్టమొదట ఏ బట్టలు ఉతుకబోతున్నామో చూడాలి. ఆ బట్టల మీద ఏదైనా హెచ్చరిక ఉందో చూసుకోవాలి. కొన్ని సార్లు ఆ బట్టలను ఎలా ఉతకాలో దానిమీదే ఉంటుంది. దాన్నిచదివి ఆ పద్ధతులను పాటించాలి.
* ప్యాంట్లు కొన్ని రకాల బట్టలకు జిప్స్ ఉంటాయి. విప్పినవి విప్పినట్టే వేయడం వల్ల ఆ జిప్స్ మరో బట్టలకు తగులుకొని పాడుచేస్తుంటాయి. ఇట్లా కాకుండా చూసుకోవాలి. పూర్తిగా జిప్‌ను పైకి లాగేసి పైవైపుకు జిప్ వచ్చేలా చూసుకుని మిషన్‌లో వేయాలి.
*పూర్తిగా బట్టలను విదిలించి మరీ వేయాలి. జేబుల్లో ఏవైనా కాగితాలు, చిల్లర, నోట్లు ఏవైనా ఉన్నాయేమో ముందే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా రంగు కాగితాలుంటే ఆ రంగు బట్టలకు పడుతాయి.
* మిషన్‌లో ఏ రకాల బట్టలకు ఎంతసేపు మిషన్ ఆన్‌లో ఉంచాలో ఆ మిషన్ పైనే ముద్రించి ఉంటారు. వాటిని చదివి వాటి ప్రకారం టైమ్ సెట్ చేసుకోవాలి.
*అట్లాగే వాషింగ్ పౌడరు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎక్కువైతే బట్టలు చికాకును తెప్పిస్తాయి. తక్కువ అయితే మురికి పూర్తిగా పోగొట్టవు.
* ఒక్కోసారి బట్టలకు మరకలు అంటుకుంటాయి. ఈ మరకలు పోగొట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని పాటించిన తర్వాత మిగతా బట్టలతో వేయాలి. కాని ముందుగా వేయకూడదు.
* మరకలున్నబట్టలను విడిగా వాషింగ్‌మిషన్‌లో వేయడం కూడా మంచిదే.
* మిషన్ ఉందికదా అని ఒకే బట్టలను పదిసార్లు వాడి తర్వాత ఉతకడానికి వేయడం అంత మంచి పద్ధతికాదు. ఒకసారి వేసుకొన్నబట్టలను వెంటనే ఉతకడమే మేలు.
* తెలుపురంగు బట్టలను విడిగా వాటికి నిర్దేశించిన టైమ్ సెట్టింగ్‌తోనే ఉతికితే అనుకొన్న ఫలితం వస్తుంది.
ఇట్లా కొన్న చిట్కాలు పాటిస్తే వాషింగ్‌మిషన్ చాలాకాలం మన్నుతుంది. బట్టలు కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

-వాణిశ్రీ 8309860837