సబ్ ఫీచర్

మానవసేవే మాధవుని సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్గ్రంథపఠనం వల్లనో, ప్రవచన కారుల బోధ వల్లనో ఈనాడు సమాజంలోని వృద్ధులకు, అనాథలకు, దివ్యాంగులకు, రోగులకు, కుల, మత , ప్రాంత లింగభేదాన్ని పాటించక సేవ చేయడానికి ఎందరెందరో నడుము బిగిస్తున్నారు. ధనవంతులు విరాళాలిస్తున్నారు. ఊరూరా సేవా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
సేవను రెండురకాలుగా చేయవచ్చు. ఉదాహరణకు ఒక వృద్ధాశ్రమం ఉందనుకొందాం. అందులో యాభైమంది వృద్ధులున్నారు. వారికి ఆహారం, వైద్యం, ఇతర వసతులు కల్గించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం ఉండాలి. అందులో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్, ఇంకా కార్యదర్శులు ఇలాంటి సభ్యులంతా ఉంటారు. వీరు వాచ్‌మెన్, వంటవారు, ఇతరత్రా పనులు చేయడానికి కర్మచారులు ఇలాంటి వారినందరినీ వారు నియోగించుకుని వృద్ధులకు కావలిసిన సేవను అందిస్తుంటారు. వీరంతా సేవ అందిస్తారు. కాకపోతే ఇందులో కొంతమంది సేవకు ప్రతిఫలం తీసుకొనేవారు కూడా ఉంటారు. అది వారికి వృత్తి అయ్యి ఉంటుంది. కాని ఈ సేవను అందించేవారిలో మనస్తత్వ భేదాలుంటాయి. కొందరు ఏ వేతనం తీసుకోకుండా వృద్ధులకు అవసరమైన సేవను అందిస్తున్నా కూడా వారి మాటతీరు ఇతరులను బాధిస్తుంటుంది. వారి మాట వలన వారు చేసిన సేవ అంతా వృథా అవుతుంది. సేవ పొందేవారు చులకన భావంతో తమను చూస్తున్నారని అనుకొని ఆ సేవను వారు అంగీకరించలేకపోతారు. మరికొంతమంది వారి వృత్తిరీత్యా సేవ చేసినందుకు ప్రతిఫలం తీసుకొంటూ ఉండవచ్చు. కాకపోతే వారి మాటతీరు వల్ల సేవ అందుకునే వారికి మానసిక ఆనందాన్ని కలిగించవచ్చు. వారిలో ఆవరించి ఉన్న నిరాశానిస్పృహలను తొలగించవచ్చు. వృద్ధులను చైతన్యపరిచేట్టుగా మాటలాడి వారిని ఆనందానికి చేరువ చేయవచ్చు. కనుక వీరికి వీరు అనుకొన్నదానికన్నా ప్రతిఫలాన్ని ఎక్కువగా సేవఅందుకున్నవారు ఇవ్వవచ్చు. అందుకే సేవ చేయాలనుకొన్నవారు ముందుగా వారి మాటతీరును, వారి నడవడిని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరికేది కావాలో అదివారికి అందివ్వడమే అసలైన సేవ అవుతుంది. నేనేమి చేయగలను అనుకొనే కంటే చేతనైనంతగా దానధర్మాలు చేయలేకపోతే శారీరిక శ్రమను కూడా దానం చేయవచ్చు. దానే్న సేవ అని పిలుస్తారు. ఏ వృద్ధాశ్రమానికో లేక అనాథాశ్రమాలకో వెళ్లితే అక్కడ ఎన్నో పనులుంటాయి. వృద్ధులకు చేయూతగా నిలబడడమో లేక వారు వాడుతున్న సామగ్రిని శుభ్రం చేయడమో , వారికి మందులు అందివ్వడమో, లేక వారి కాలకృత్యాలు తీర్చుకోవడంలో ఏదైనా ఇబ్బందులుంటే వాటిని నివారించడమో, ఆ ఆశ్రమం శుభ్రత పాటించడంలో చేయి అందించడమో , వంటపనిలో సాయం చేయడమో ఇలా ఏదైనా సరే మనకు మనంగా పాల్గొంటే చాలు అది సేవాదృక్పథమే అవుతుంది.
ఇతరులకు కావాల్సిన సాయాన్ని అందించగలిగితే కొలవలేని సంతృప్తి చేసిన వారికి, అందుకున్నవారికి కూడా కలుగుతుంది. భగవంతుడు కూడా ఈ పనిని మెచ్చుతాడు. మన పుణ్యఖాతాలో సంపదను జమ చేస్తాడు. అంతేకాని ఎవరో చూస్తారనో, లేక మేము డబ్బులిస్తున్నామనో, మరేదో కారణాలు పట్టుకుని ఇతరులను ఇతరులను అవమానించకూడదు. వారి మనస్సును వికలం చేయకూడదు. అపుడే వారు చేసిన సేవకు మంచి ఫలితాన్నిస్తుంది. భగవంతుడు కూడా మెచ్చుతాడు.
సదా మానవసేవ మాధవ సేవగా ఎంచి చేయాలి. సేవచేస్తున్నసేపు అది భగవంతునికి సేవ చేస్తున్నామన్న భావన ఉండాలి. కాని సాటి మనుష్యులకు సేవ చేస్తున్నామని అనుకోకూడదు. అపుడే సేవ చేసేటపుడు మనసుకు తృప్తికలుగుతుంది.

- రాచమడుగు శ్రీనివాసులు 9492748758