సబ్ ఫీచర్

పాతవస్తువులతోనే కొత్తకొత్తగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు అందంగా పెట్టుకోవడం ఓ కళ. ఇప్పుడు ఇంటరీయర్ డిజైనింగ్ అనే ఒక కోర్సు కూడా వచ్చింది. చాలామంది ఈ కోర్సులో చేరుతున్నారు. అందరికీ కోర్సులో నేర్చుకున్నట్టు ఇంటిని తీర్చిదిద్దుకోవడానికీ, లేక ఇంటరీయర్ డిజైనింగు చేయంచుకోవడానికి వీలు పడదు. అది ఆర్ధికభారమైనా లేక అనేక ఇతర కారణాల వల్ల ఇంటికి డిజైనింగ్ చేయంచుకొనే వీలు లేదే అని దిగులు చెందనక్కరర్లేదు... ఇల్లు అందంగా ఉండాలన్న ఆలోచన ఉంటే చాలు ఎంత చిన్ని ఇల్లైనా లేక పెద్ద ఇల్లైనా అందంగా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
ముందుగా ఇంట్లో అవసరమైన వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులను పారవేయడమో లేక అవసరమైనవారికి ఇవ్వడమో చేయాలి. అట్లా ఇవ్వలేక పారెయ్యలేక కొన్ని వస్తువులుండిపోతాయ. వాటిని కొత్తవాటిగా మార్చుకోండి మీ ఇల్లు అందంగా తయారు అవుతుంది.
పాతకాలంలో కొందరిండ్లల్లో ఇత్తడి గినె్నలు ఉండేవి కదా. వాటిని ఇపుడు డెకరేటివ్ పీసులు చేద్దాం రండి. ఆ ఇత్తడిగినె్నల్లోనే వీలును బట్టి నీళ్లల్లో పెరిగే చెట్లను అమర్చి ఇంట్లో అక్కడక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే వాటిపైన చక్కని పెయంటింగ్ వేసి దానిమీద పూసలు, అద్దాలు పొదిగి అక్కడక్కడ పెట్టండి. చూడడానికి కొత్తగా కనిపిస్తాయ.. వీటినే ప్లవర్‌వాజ్‌గా చేసుకోవచ్చు. వీటి వల్ల ఇంటి అందం పెరుగుతుంది గ్రాండ్‌గా కూడా కనిపిస్తుంది.
కొన్ని పాతకాలపు కుర్చీలను మూలన పెట్టి ఉంటాం కదా. వాటి కేన్ మార్చడమో లేక వాటి లుక్‌ను మార్చడమో చేస్తే అవి ఉపయోగంలో ఉంటాయి. అదివీలుకాకపోతే ఒక్కో కుర్చీని మూలన అమర్చి వాటిపైన కొత్త ప్లవర్‌వాజ్‌లనో, లేక అందమైన దేవతా విగ్రహాలనో పెట్టాలి. లేక వెడల్పాటి గినె్నను కుర్చీలో పెట్టి అందులో పూవులను అమర్చాలి. ఈ పూలను ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. ఇందులోనీటినీ మార్చాల్సి ఉంటుంది.
వాడేసిన బాటిల్స్‌ను కూడా అందమైన బొమ్మలుగా మార్చవచ్చు. లేకపోతే చిన్న చిన్న మొక్కలను కూడా పెంచవచ్చు. వీటిని ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. చీరలు, బనియన్లు పాతపడిపోతే వాటితో డోర్‌మేట్స్ చేయవచ్చు. లేకుంటే పడుకోవడాని పనికివచ్చే బొంతలను కూడా తయారు చేయవచ్చు. సీసాలు పగిలిపోయి మూతలు ఉండిపోతే వాటిల్లో కరిగి మిగిలిపోయిన కొవ్వొత్తుల ముక్కలను వేసుకొని వాటిల్లో ఒక వత్తిని అమర్చుకుంటే దీపం వెలిగించుకోవచ్చు. పాడైపోయిన సిడీలతో వాల్‌హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. దారపుండలు, క్లిప్పులు ఉపయోగించి డోర్ కర్టన్స్‌ను చేసుకోవచ్చు. వాడేసిన కొబ్బరి చిప్పల్లో కాస్త మట్టిపోసి వాటిల్లో కొత్తిమీర,పుదీనా లాంటి మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి ఇంటి అందాన్ని పెంచుతాయి.ఆఖరికిపాడై పోయన చీపురు పుల్లలతో కూడా అందమైన ప్లవర్‌బొకేను తయారు చేసుకోవచ్చు.
నెలల తరబడి ఒకే స్థలంలో వస్తువులుంచక వారానికొకసారైనా సోఫాలు, బీరువాలు లాంటివాటి ప్లేసులను మారుస్తూ ఉంటే కూడా ఇల్లు కొత్తదనంతో అందగిస్తుంది.

- లక్ష్మీప్రియాంక