సబ్ ఫీచర్

దేశాన్ని ఊపేసిన నినాదం అది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర కాంక్ష రగిలిన సమయంలో శే్వతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేవి ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది. సురేంద్రనాథ్ బెనర్జీ ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ (్భరత జాతీయ సంఘం) స్థాపించారు. పదవీ విరమణ చేసిన బ్రిటన్ ప్రభుత్వ ఉద్యోగి ఆలన్ హ్యూమ్ ప్రోత్సాహంతో బొంబాయిలో సమావేశమైన 73మంది భారత ప్రతినిధులు ‘్భరత జాతీయ కాంగ్రెస్’కు అంకురార్పణ చేశారు. పాశ్యాత్య విద్యాభ్యాసకులైన వారు, పాత్రికేయ, విద్యారంగ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా బ్రిటిష్ పాలన పట్ల సానుకూలతను వ్యక్తపరిచారు. తమ తీర్మానాలను వైస్రాయ్‌కు, కొన్నిసార్లు బ్రిటన్ పార్లమెంటుకు పంపడానికే పరిమితమయ్యారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో నగరాలలో నివసించిన శిష్టజన వర్గానికి మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ వాదులు తమను తాము స్వామిభక్తులుగా భావిస్తూ, బ్రిటిష్ సామ్రాజ్యం నీడలో భాగస్వామ్యాన్ని ఆశించి మాత్రమే కార్యకలాపాలు కొనసాగించారు. దాదాభాయి నౌరోజీ బ్రిటిష్ వారి ‘హౌస్ ఆఫ్ కామన్స్’కు పోటీ చేసి గెలిచిన తొలి భారతీయునిగా నిలిచారు. ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ తొలిసారిగా ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని ఎలుగెత్తి నినదించిన జాతీయ వాది. భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, మన జాతిని కించపరిచిన బ్రిటిష్ విద్యా వ్యవస్థను ఆయన తీవ్రంగా నిరసించారు. జాతీయవాదులకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేకపోవడాన్ని ఆయన సహించలేక పోయారు. ఈ సమస్యలకు స్వరాజ్యమే ఏకైక పరిష్కార మార్గమని నమ్మారు. బ్రిటన్ పాలకులపై జనం తిరగబడడమే స్వరాజ్య సాధనా మార్గమని విశ్వసించారు.
బిపిన్‌చంద్ర పాల్, లాలా లజపతిరాయ్‌లు తిలక్‌ను సమర్థించారు. ఇలా ‘లాల్, బాల్, పాల్’ జాతీయవాదానికి రూపురేఖల కల్పనలో కృతకృత్యులైనారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చాక దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమం పలు రూపాల్లో విస్తరించింది. సత్యాగ్రహ ఉద్యమం, అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమాల ఫలితంగా లక్షలాది మంది భారతీయులలో పోరాట స్ఫూర్తి రగిలింది. 1919 ఏప్రిల్ 13నాటి ఆందోళనలో- జలియన్‌వాలా బాగ్ (అమృతసర్ మారణకాండ) వద్ద బ్రిటీష్ అధికారి డయ్యర్ నేతృత్వంలో జరిగిన 1651 రౌండ్ల పోలీసు కాల్పులకు 379 మంది మరణించినట్లు, 1137 మంది గాయాల పాలైనట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, జలియన్‌వాలా బాగ్ దుర్ఘటనలో 1,499 మంది మృతి చెందినట్లు వచ్చిన అంచనాలు భారతీయుల్లో ఆగ్రహావేశాలను రగిలించింది.
మొదటి సహాయ నిరాకరణ, 1920లో స్వరాజ్య సాధనా లక్ష్యంతో కాంగ్రెస్ పునర్వవస్థీకరణ, 1922లో గాంధీ రెండేళ్ల కారాగార వాసం, 1928లో సైమన్ కమిషన్ సిఫార్సుల తిరస్కరణ, భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘం ఏర్పాటు వంటి కీలక పరిణామాలు ఉద్యమాల గతిని మార్చాయి. 1929 డిసెంబర్‌లోగా స్వపరిపాలన హోదా ఇవ్వకుంటే సత్యాగ్రహం ఉద్ధృతం చేస్తామన్న తీర్మానాలు, రాజకీయ అసంతృప్తి, లాహోర్‌లో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర సాధన పిలుపునకు క్రమానుగత హేతువులయ్యాయి. 1930 జనవరి 26న దేశం మొత్తం ‘సంపూర్ణ స్వాతంత్య్ర దినం’గా పాటించాలని నిర్ణయమైంది. రాజకీయ వాదులు, విప్లవకారులు ఒక్కటి కావడానికి ఈ నిర్ణయం కారణభూతమైంది.
1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6 వరకు కొనసాగిన ఉప్పు సత్యాగ్రహంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 400 కిలోమీటర్ల మేర కాలినడకన సాగిన ‘దండియాత్ర’లో గాంధీజీ వెంట వేలాదిమంది నడిచారు. 1931లో ‘గాంధీ- ఇర్విన్ ఒప్పందం’ కుదిరింది. విప్లవ వీరులు భగత్‌సింగ్,సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు బ్రిటన్ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 1932లో గాంధీజీ తిరిగి సత్యాగ్రహాన్ని చేపట్టారు. అనంతర పరిణామాలతో దశాబ్దకాలం పాటు కొనసాగిన వివిధ ఆందోళనలు, సత్యాగ్రహాలు, నిరసనలు, బాంబు దాడులు, విధ్వంసాల క్రమంలో- ‘క్విట్ ఇండియా’ (్భరత్‌ను వీడిపోండి’ అనే నినాదాన్ని గాంధీజీ ఇచ్చారు. 1942 ఆగస్టు 8న ముంబయిలోని గొవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన సభలో ఆయన ఈ నినాదాన్ని ఇచ్చారు. ‘క్విట్ ఇండియా’ నినాదం భారత స్వాతంత్య్ర సమరాన్ని కొత్తపుంతలు తొక్కించింది. గాంధీజీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరంభమైంది. దీంతో భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించక తప్పదని బ్రిటీష్ పాలకులు గ్రహించారు. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతీయుల స్వప్నం సాకారమైంది. స్వతంత్ర దేశంగా భారత్ అవతరించింది.

(నేడు ‘క్విట్ ఇండియా డే’)

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494