సబ్ ఫీచర్

విలువలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి గొల్ల పడచులందరూ కాత్యాయనీ వ్రతం చేసుకొందామని అనుకొన్నారు. శుభవారనక్షత్రాలను చూసుకొన్నారు. వ్రతం ఆరంభించేరోజు వచ్చేసింది. వారంతా కలసి యమునానదీతీరానికి వెళ్లారు.
చల్లగా మెల్లగా ప్రవహించే యమునను చూసి అచ్చెరువొందారు. వెంటనే వారి వలువలను దూరంగా ఓ చెట్టుకింద ఉంచి వారంతా ఆ యమునానదీప్రవాహంలోకి జొరబడ్డారు. చల్లని నీరు ఒంటికి తాకగానే మైమరిచి కృష్ణుని గుర్తు తెచ్చుకుని ఆ మురళీరవాన్ని స్మరిస్తూ ఆటపాటలతో కేరింతలు కొట్టటం ఆరంభించారు. వారంతా ఎంతో సంతోషంతో ఒకరిమీద ఒకరు నీరుచల్లుకుంటూ సరస సల్లాపాలు చేస్తున్నారు.
ఆ సమయంలో వారి మనసులు తెలుసున్న కృష్ణుడు తన చెలికాండ్రతో అక్కడకు వచ్చాడు. మెల్లగా ఆ గొల్లయువతలకు తెలియకుండా గోపాలుడు వారి వలువలన్నీ తీసేసుకొన్నాడు. వాటిని దాచాడు. ఆ కన్నయ్య మాటలనే మాట్లాడుకుంటూ తమ కోరికలు ఈడేరేలా చేయమని మొక్కుతూ స్నానాలు చేస్తున్న పడతులకీవిషయం తెలియదు.
వారంతా ఏదో చప్పుడవుతున్నదని అటు ఇటు చూస్తున్నారు. ఇంతలో కృష్ణయ్య కడిమి చెట్టు ఎక్కాడు. అక్కడనుంచి మురళీ రవాన్ని ప్రసరింపచేస్తున్నాడు. ఆ మురళీరవాన్ని విన్న గొల్లపడచుల ఆనందం అంతా ఇంతాకాదు. ఆహా అదుగో ఆ మురళీధరుడు వచ్చేశాడు అనుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్దామని తమ వలువలున్న చోటికి రాబోయారు. అంతలోనే
‘ఓ వనితల్లారా! మీరు వలువల్ని వదిలి ఏ విలువలున్న వ్రతాలను చేయబోతున్నారు? నదీస్నానం చేసేటపుడు వలువలు ధరించాలన్న నియమమేదీ అందులో లేదా మీకు వ్రత భంగం కాలేదా’అని అడిగాడు. అప్పుడు తమ తప్పు తెలుసుకున్న ఆ పడతులందరూ ‘ఓయశోదానందనా నీవే మమ్ము అన్ని అవస్థల్లోను, అన్ని వేళల్లోను కాపాడే దేవునివి. నీవుండగా మాకు ఇంకేమి కావాలి. నీ అంతటివాడు మరొకడు ఈ భూమి ఉండునా’అని కీర్తించారు.
వారి కీర్తనలు విని ‘ఆహాహా నాకు మీకు నైజం తెలిసింది. ఇప్పుడు మీకు నా అవసరం ఉంది కనుక నన్ను పొగుడుతున్నారులే. మీ అవసరం తీరిపోతే నన్ను మరిచిపోతారుకదా’అంటూ వారిని ఎగతాళి చేశాడు.
వారున్నూ ఏ మాత్రం జంకకుండా ‘నందనందనా! నీ మహనీయత్వం మేము ఎరుగమా ఏమి? అయినా నీవేమన్నా చిన్నవాడివా.. ఈ చిల్లర పనులేమైనా నీకు తగునా. నీవు కావాలంటే ఎవరైనా ఉద్దరించడానికి పూనుకోవయ్య. ఓరిమితో ఉండి పగవారిని సైతం తనవారిగా చేసుకోవడం నీకే తగును. పసివాడిగా ఉంటూనే విచిత్రాలు చేయదగును నీకే. కానీ ఇప్పుడు నీవు చేస్తున్న పని నీకేమైనా మంచి పేరుతేగలదా ఇక నీ అల్లరి మాని మాకు వస్త్రాలు ఇచ్చి మమ్ము కాపాడుదేవాదిదేవా!’ అని వేడుకున్నారు.
వారు అలా వేడుకున్నతరువాత కృష్ణుడు కూడా ‘మనసా వాచా కర్మణా కూడా నన్ను నమ్ముకున్నవారికి నేను ఎల్లవేళలా చేదోడుగానే ఉంటాను .వారిని నీడలా నేను కనిపెట్టుకుని ఉంటాను. కానీ పైకి నన్ను స్మరణ చేస్తున్నామనుకొంటూనే లోల్లోపల ఎగ్గులు తలపెడితే నాకు తెలియకుండా పోతుందా? ’ ఏమిటిఅన్నాడు. నా కన్ను గప్పి ఏవేవో చేద్దామంటే చేతనగునా మీకు అని కృష్ణుడు చిరుకోపంతో అన్నాడు.
ఆమాటలకు వారుత్రొటు పడి ‘ఓ దేవకీనందనా! ఓ పరమపురుషా! అంతటా నీవే ఉండగా నీ కనులు కప్పి మేము చేయునది ఏమి? మా మనసుల్లోను వెలుపలా ఉన్నది నీవే. ఆ సంగతి నీకును తెలియును.మాకే అప్పుడప్పుడు నీవుకనబడక కలత రేగుతుంటుంది. అప్పుడే మేము నీ స్మరణ మానక చేస్తుంటాము. నీవు మాకు కనిపివ్వకుండా ఒక్కక్షణమైనా ఉండకుము’ అని ముగుదలందరూ ముక్తకంఠంతో అన్నారు.
మేమైనా వేదాలను దొంగలించమా? ముల్లోకాలను గడగడలాడించామా, లేక ఒకరితోడు దూరం చేశామా, పసిపిల్లలైనా చూడకుండా పొట్టన పెట్టుకోవడానికి చూశామా, పొగరుతో పిల్లాపెద్దా తేడాలేకుండా అల్లలాడించామా ఏం చేశామని నీవు మమ్ములను దండించబూనుతావు కృష్ణయ్యా అంటూ వారు కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో సంగతులు గుర్తు చేశారు.
‘ఓహో అటులనా అయితే మీరంతా నన్ను చేతులెత్తి మొక్కండి.అపుడు మీ వలువలను మీకిచ్చేస్తాను’ అన్నాడు ఆ గోపబాలుడు. ఉన్నదంతా పరమాత్మ తప్ప వేరొకరు ఎవరూ లేరు కనుక ఆ పరమాత్మ వెనువెంటనే ఆ గోపకాంతలందరూ చేతులెత్తి నమస్కరించారు.

--చరణ