సబ్ ఫీచర్

యాంత్రిక జీవనంలో పన్నీటి జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణమాసం వచ్చిందంటే చాలు పేరంటాలు హడావుడి మొదలు. ఈ పేరంటాలు స్ర్తిలకే ప్రత్యేకతను ఆపాదిస్తాయి. ఈ శ్రావణంలో పూజలు వ్రతాలు, నోముల్లాంటివాటిల్లో పేరంటాలు రావడం వారిని పండుతాంబూలతో సంభావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పూర్వం స్ర్తిలు ఇంటికే పరిమితం కనుక వారంతా ఈ పూజలు పునస్కారాలు చేసేవారని పండుతాంబూలాలు వారికి ఒక రిలీఫ్‌ను ఇచ్చేవని అసలందుకే వాటిని చేసేవారని అనుకొంటే పొరపాటే.
నేడు ఉద్యోగినులయిన మహిళలు కూడా ఈ శ్రావణమాస శుక్ర, మంగళవార నోములు, వ్రతాలు ఎంతో భక్తి భావనతో చేస్తున్నారు. కొత్తగా పెళ్లి అయిన పెళ్లికూతుర్లకు ఈ మాసం క్షణంతీరికలేకుండా పూజలు, నోములు చేస్తుంటారు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి మానవులను ఉద్ధరించడానికి తనకు తానుగా భూలోకానికి వస్తుంది. ఇల్లిల్లూ తిరుగుతూ తనకిష్టమైన ఇంట్లో స్థిరనివాసమేర్పరుచుకుంటుందని విశ్వాసం ఈ మాసానికి ఉంది. లక్ష్మీదేవి పూలు, పండ్లు, దీపాలు, పసుపు, కుంకుమల్లో నివసిస్తుందని నమ్ముతారు. కనుకనే తోటి స్ర్తిని లక్ష్మీదేవిగా సంభావిస్తూ తమ ఇంటికి పిలిచి నుదుట తిలకం దిద్ది, పాదాలకు పసుపురాసి, కంఠాన గంధం పూసి, చేతులకు కంకణాలు అమర్చి తలల్లో పూవులు పెట్టి అక్షింతలు వేసి పూజించి ఆమె చేతికి పండు తాంబూలం, నానబెట్టిన శనగలు అప్పాలు వాయనం గా ఇచ్చి ‘ఇస్తినమ్మ వాయనం, నా వాయనానికి అధిపతి ఎవరు? ’ అని అడుగుతారు. ఇలా వాయనం తీసుకొన్నవారు ‘పుచ్చుకుంటినమ్మా వాయనం, నేనే గౌరీదేవిని ’అని చెప్పి తీసుకొంటారు. ఈ పేరంటం వ్యక్తిపూజ అనిపించినా తోటిమానవుల్లో పరమాత్మను చూసే నేర్పు అలవడుతుంది. ఈ పూజాపునస్కారాలను అమెరికా, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు వెళ్లిన మహిళలు కూడా అక్కడ కూడా ఈ పేరంటాలు చేయడం, వీటికి అక్కడున్న విదేశీ మహిళలను తాంబూలాలకు పిలిచి వారికి మన సంప్రదాయాలను వివరించడం, వారు కూడా ఈ పసుపుబొట్టుకు ప్రాధాన్యతను ఇవ్వడం నిజంగా ప్రపంచంలోని మానవులంతా ఒకే జాతి అనడానికి చిహ్నంగా మారుతున్నాయి నేటి శ్రావణ మాస పేరంటాలు.
ఈ శ్రావణమాస పూజలు, వ్రతాలు, నోములు ఏవైనా కేవలం స్ర్తిలే చేస్తున్నా వారంతా వారి భర్తల, పిల్లల క్షేమంకోరి ఈ వ్రతాలు చేస్తుంటారు. తమ కుటుంబ సౌభాగ్యాన్ని కోరుకోవడం ఆనాడే కాదు నేడు కూడా సహజంగా సాగుతోంది.
పసుపు బొట్టు కోసం ఆరు ఆమడలైనా వెళ్లి తెచ్చుకోవాలన్నది నాటి మహిళల మనోభావంగా ఉండేది. తరాలు మారినా అంతరాలు పెరగలేదు. నేడూ ఎంత పెద్ద ఉద్యోగస్థురాలైనా సరే పసుపుబొట్టుఅంటే మైళ్లదూరం అయినా, తీరిక లేకపోయినా వెళ్లి ఆ పండుతాంబూలం తీసుకోవడానికి మహిళ ముందుకే వస్తోంది. ఇది మహిళలలోని ప్రత్యేకత. తాను ఒక్కర్తే బాగుండాలని కోరుకోక తమ కుటుంబం యావత్తు క్షేమం కోసం ఆమె పడే యాతన ఇందులో కనిపిస్తుందంటారు కొందరు.
కొత్తగా పెళ్లైన పెళ్లికూతుర్లు, కన్యలు కూడా మంగళవార వ్రతాలు చేస్తుంటారు. మాంగళ్య భాగ్యం కోసం గౌరీదేవిని అర్చించడం భారతీయ సంప్రదాయం. ఒక ముతె్తైదువ ను పిలిచి ఆమెకు స్నానపానాదులు జరిపించి నూతన వస్త్రాదులను కట్టబెట్టి, ఓ ఆసనం పై కూర్చోబెట్టి నుదుట కుంకుమ పెట్టి,కళ్లకు కాటుక దిద్ది,అంగరాగాలు పూసి, కంఠాన గంధం అలది, పాదాలకు పసుపురాసి, జుట్టు దువ్వి జడలతో అలంకరించి పూవులు పెట్టి, కంఠాన పూలమాలనో లేక ముత్యాలు,బంగారు ఆభరణాలు ధరింపచేసి అక్షంతలిచ్చి చేతులకు కంకణాలు, పాదాలకు మంజీరాలు వేసి ఆమెకు పండుతాంబూలం, నానబెట్టిన శనగలు, పూజచేసేటపుడు కథ చదువుతూ పట్టిన కాటుకను ఇచ్చి పూజిస్తారు. ఈ వ్రతాన్ని పెళ్లైన ఐదు సంవత్సరాలు జరుపుతారు. మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులతో ఆరంభించి ఐదోఏడు 25 మంది ముతె్తైదువులను పూజిస్తారు. ఇది కుటుంబ ఆచారం ప్రకారం జరుపుతారు.
ఇక వరలక్ష్మీవ్రతం:
పిండితో, కొబ్బరికాయతో అలంకరించిన ప్రతిమలను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. ఈ వరలక్ష్మీవ్రతాన్ని స్వయంగా ఆ వైకుంఠ వాసినియే చారుమతి అన్నపడచుకు చెప్పిందనే స్ర్తిలంతా నమ్ముతూ ఈ వ్రతాన్ని చేస్తుంటారు. ఈ వ్రతంలో కూడా పేరంటమే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వివిధ పూలతో, వివిధాలంకారాలు చేసిన దేవుని ప్రతిమను వరలక్ష్మీదేవిగా సంభావించి పూజిస్తారు. సాయం సంధ్యాసమయంలో వారు వీరను తేడాల్లేకుండా పసుపు బొట్టుకు పిలుస్తారు. పేరంటాలు చేస్తారు.
ఇప్పుడిప్పుడు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వైభోగంగా జరుపుకునే ఆచారాలూ ఆరంభిస్తున్నారు. కొన్ని చోట్ల ఈపేరంటం చేసేటపుడు సంగీత కచ్చేరీలు చేస్తున్నారు. వరలక్ష్మీ దేవీని గూర్చిన పాటలు, కీర్తనలు ఆలపిస్తూ ఈ సంగీత కచ్చేరీలు సాగుతాయి. దీని తరువాత వచ్చిన వారికి పండుతాంబూలాలు, వివిధ అలంకార వస్తువుల వితరణ కూడా చేస్తున్నారు.ఇంతకుముందు ఈ పేరంటాలకు భోజన సదుపాయం కూడా చేసేవారు. ఏది ఏమైనా కూడా ఈ వ్రతాలు,నోములు, పూజలు అనేవి యాంత్రిక జీవన సరళికి పేరంటం ఒక పన్నీటి జల్లు తాంబూలంలో ఇచ్చే తమలపాకును సేవించడం సంప్రదాయం. ఆరోగ్యరీత్యా కూడా మంచిదంటారు. బాలింతలకు తాంబూలం ప్రత్యేకంగా ఇస్తుంటారు. భగవంతునికి చేసే షోడశోప చారాలల్లో తాంబూల సేవనం కూడా ఒకటి, ఈ తమలపాకులు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చాయని నమ్ముతారు. తమలపాకునే అందుకే నాక వల్లి అని పేరుతో పిలుస్తారు. నాకవల్లీనే కాల క్రమంలో నాగవల్లీ గా మారిందంటారు.
ఈ తాంబూలం సేవనంలో ఉండే మూడు వస్తువులను వక్క, ఆకు, సున్నం బుధుడు ఆకుపచ్చ, వక్క రాహువు, పచ్చని పండు గురువు ఈ గ్రహాలను పూజించినట్లు చెప్తారు కొందరు. లలితాదేవీ పూజల్లో తాంబూలం ఇవ్వడంలో బుధుడు, రాహువు, గురువును పూజించినట్లు అవుతుందనే వారు ఉన్నారు. ఈ తాంబూలలతో నిత్యతాంబూలం, దంపతుల తాంబూలం అనే నోములూ ఉన్నాయ. వీటిని ప్రతిరోజు నోస్తూ ఏడాది చివరకు ఉద్యాపనచేస్తారు. అపుడు తాంబూలంలో బంగారు ఆకు, వెండితో చేసిన వక్కలు ఇస్తారు. ఆంజనేయ స్వామిచేసే ఆకు పూజలో ఈ తమలపాకులు ప్రాధాన్యత సంతరించుకుని ఉంది.

- వాణి ప్రభాకరి