సబ్ ఫీచర్

ప్రగతికి బాట మానవత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ విజ్ఞానం విద్యుత్ వేగంతో విజృంభిస్తున్నది. భౌతికపరంగా మానవుని జీవన విధానం అనేక మార్పులకులోనైంది. కానీ ఆధ్యాత్మికంగా మానవుడు తన ఆలోచనంతా పరమాత్మ సృష్టిమీదే ఉంచాడు. సిద్ధాంతాలకు అతీతంగా సనాతన ఆధ్యాత్మిక చింతన సాహిత్యాన్ని కళలను తనతరాలుగా విభిన్నమైన పద్ధతి రూపములో ప్రభావితం చేస్తున్నది.
భారతీ య ఆధ్యాత్మిక సంస్కృతి చాలా పటిష్టమైంది. ఆలోచనలు అనంతమైనా, మతము, భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పండుగలు, విద్య, సాహిత్యం, కళలు, ఆచారాలు, సంప్రదాయాలు వేరు వేరుగా వున్నా ఆధ్యాత్మిక సంస్కృతి మారదు. భిన్నత్వం భారతీయ సంస్కృతి భౌతిక స్వరూప లక్షణం. సంగీతం, సాహిత్యం, శిల్పకళ, చిత్ర కళలను మానవుడు నేర్చుకుని తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు.
మానవ సంస్కృతి మానవ జాతి విశిష్టతను ఉన్నత స్థితినీ వేదముల పట్ల మానవ అభిరుచిని ప్రదర్శిస్తుంది. ఆర్యుల చరిత్ర ఆధారంగా నాటి నుంచి నేటి వరకు వేద సాహిత్యం ద్వారానే మనిషి పురోగతిని సాధిస్తున్నాడు.
మానవ ప్రాశస్త్యము పెరగడానికి కారణం అన్ని మతాలకు, శాఖలకు ప్రతిపాదనలకు వేద సాహిత్యమే ప్రధాన కారకం. వేదాలు మానవుని నిగూఢ ఆత్మశక్తిని ప్రేరేపించాయి.
నిరాడంబర జీవనము, శాంతియుత సహజీవనము, స్నేహము, సహకారము మానవుని ప్రాధాన్యతను పెంచాయి. జ్ఞానసముపార్జనలో మానవుని లోని ఆంతరంగిక శక్తి అతని జీవన విధానానే్న మార్చివేసింది. వ్యక్తి శ్రేయస్సుతో సంఘ శ్రేయస్సు ముడిపడి విశ్వమానవ కల్యాణానికి దారి తీసింది.
మానవ శ్రేయస్సు పురుషార్థాలతో ముడిపడి ఉంది. ధర్మము, అర్ధము, కామము, మోక్షము పురుషార్థాలు. బ్రహ్మచర్యంతో విద్యను అభ్యసించాలి. వివాహం ద్వారా గృహస్థాశ్రమంలో అడుగుపెడతారు. తనపై ఆధారపడిన వారిని పోషించడానికి ధనాన్ని న్యాయంగా సంపాదించాలి. కుటుంబ అవసరాలతో పాటు తన కోరికలను ఈ ఆశ్రమంలోనే తీర్చుకుంటూ జీవనం సాగిస్తాడు. ధర్మఅర్ధకామాలనే మూడు పురుషార్ధాలు మానవుని సాంఘిన జీవనానికి సంబంధించినవి. మోక్షం మాత్రం అతని వ్యక్తిగతమైంది.
ఆధునిక కాలంలో అనేక వాదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి స్వార్థపరమైనవి. ఏ వాదంలో నిజమున్నదో సామాన్యులు అర్ధం చేసుకోవడం కష్టం. మానవతావాదంలేని ఏ వాదమైనా ప్రయోజనం లేని వాదంగా గుర్తించబడుతుంది. గౌతమబుద్ధుడు అష్టాంగ మార్గాలను సూచించాడు. సరియైన జ్ఞానము, వాక్కు, దృష్టి, జీవనము, క్రియ, మార్గము, ఆలోచన, ధ్యానము మొదలైన మార్గాలు మానవ జీవన క్రమశిక్షణకు ఉత్ప్రేరకాలు. సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పుడు సాహిత్యంలో వివిధ రూపాలల్లో ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అవే పురాణాలుగా, ఇతిహాసాలుగా రచించబడ్డాయి. ప్రకృతి, ప్రకృతిశక్తులు మానవునికి మధ్యగల సంబంధాలను వేదాల ద్వారా మనిషి తెలుసుకొన్నాడు. వేదాంత చర్చలద్వారా ఉపనిషత్తులు రూపొందాయి. అనేక సూక్తులు సందేశాల సమాహారమే ఉపనిషత్తులు.
ఐతరేయ ఉపనిషత్తు శరీరంలోకి ఆత్మ ప్రవేశము, ప్రశ్నోపనిషత్తు స్ర్తిపురుష సంయోగము పవిత్రకార్యము, కేనోపనిషత్తు గురుశిష్య సంబంధాలను చాందోగ్యోపనిషత్తు బ్రహ్మా జ్ఞానాన్ని ఈశఓపనిషత్తు సామాజిక అవగాహన కఠోపనిషత్తు సూక్ష్మబుద్ధి తైత్తిరీయోపనిషత్తు నీతి సూత్రాలను, బ్రహ్మ దారణ్యకోపనిషత్తు అశ్వమేథంకంటే ఆత్మజ్ఞా నము గొప్పదని, ముండకోపనిషత్తు జ్ఞానమార్గము, కర్మమార్గము, మాండుక్యోపనిషత్తు ఇంద్రియ జ్ఞానము మొదలైన విషయాలను తెలియ జేస్తాయి.
మానవునికి స్నేహధర్మం బాగా తెలుసు. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తులు ఎందరో ఉన్నారు. శ్రీరాముడు వాలిపై బాణం వేసినపుడు గానీ వాలికి తన తప్పేమిటో తెలియలేదు. వాలి మరణానంతరం శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం వల్ల సీతాదేవి జాడ తెలిసికొని రావణాసురుడిని సంహరించగలిగాడు. ఈ స్నేహం మానవాళికి ఎంతో శ్రేయోదాయకం. మానవ ధర్మాన్ని మానవత్వం రంగరించి చక్కగా నెరవేర్చడానికి మార్గదర్శిగా నిలుస్తున్నది.
దీర్ఘదృష్టి, సమయపాలన, విచక్షణ మానవునికి సరియైన జీవనం సాగిండానికి ప్రాముఖ్యతను వహిస్తాయి. మానవులను మూడు విధాలుగా వర్గీకరించారు. ప్రథములు (పూర్ణవిశిష్టతః) మధ్యములు (అత్యంత సామాన్యతః)అధములు (నికృష్టదుష్టగ్రహః) ఈ వర్గీకరణ మానవ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
మానవుడు అనేక రంగాలలో కృషి చేస్తూ తన ప్రతిభను కనబరుస్తున్నాడు. మానవుని కృషి ప్రపంచానికి తెలియ చేసే ప్రక్రియకు నాందీ వాక్యం. అనేక బోధనలు, సందేశాల ద్వారా భగవంతుడు మనిషికి సందేశాలను ఇస్తున్నాడు. వాటిని అర్ధం చేసుకొని మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మనిషి ఎప్పుడూ మానవత్వంతో చరిస్తేనే అతనికి పురోగతి ఉంటుంది. మానవత్వం మరిచి రాక్షసత్వానికి దగ్గరైతే నరుడు నారాయణుడు కాక నాకానికి వెళ్లలేక రెండు కాళ్లజంతువు వలె మారిపోతాడు. మనిషిని కూడా రెండు కాళ్ల జంతువు అనడంలో అర్థం అదే. అందుకే పరమాత్మ గురించి తెలుసుకొని పశుజన్మనుంచి పశుపతి కాగలిగితే మానవ జన్మ ధన్యం అయినట్లు అవుతుంది.
ప్రతిమనిషి కొన్న ఆశయాలను ఏర్పర్చుకుని మానవత్వంతో దివ్యత్వం వైపు అడుగులు వేయాలి. అదే మానవ జీవన ప్రగతికి ఆదర్శం అవుతుంది.

- నిమ్మగడ్డకాశీ విశే్వశ్వర శర్మ 9959080203