సబ్ ఫీచర్

పిల్ల కొంచెం జుట్టు ఘనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పాప వయసు ఐదు సంవత్సరాలు. పేరు మియా అఫ్లాలో.. ప్రస్తుతం ఆ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలనం.. ఆమెకున్న పట్టులాంటి ఒతె్తైన కురులే ఆమెను సెలబ్రిటీను చేశాయి. కురులు సెలబ్రిటీని చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమండీ.. ఆ చిన్నారికి ఉన్న పొడవాటి, పట్టులాంటి కురులే ఆమెను స్పెషల్ సెలబ్రిటీని చేశాయి. అంతేకాదు బ్రిటన్ వోగ్ పత్రిక అయితే ఏకంగా ప్రపంచంలోనే అందమైన కురులను కలిగి ఉన్న చిన్నారిగా మియాకు పట్టం కట్టింది. మరి అందమైన, ముద్దులొలికే మియా గురించి తెలుసుకుందామా!
మియా ఆఫ్లాలో ఇజ్రాయెల్ వాసి. మియాను చూడగానే అందరి దృష్టి ఆమె జుట్టు మీదికే వెళుతుంది. అందమైన, ఒతె్తైన అంత జుట్టు ఇంత చిన్నపాపకు ఎలా వచ్చింది? అనే సందేహం కూడా కలుగుతుంది. అంతేకాదు చక్కని ముఖారవిందం, ఆకర్షించే కళ్లు, అందమైన కురులు, దానిమ్మగింజల్లాంటి పళ్లతో ఈ అమ్మాయి చాలా చాలా అందంగా, ముద్దుగా ఉండి అందర్నీ ఆకర్షిస్తుంది. ఈ పాపను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ముద్దాడాలనే అనుభూతి కలగడం మాత్రం ఖాయం. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాగి దహరి బ్రిటిష్ వోగ్‌తో కలిసి ఒక ప్రాజెక్టులో భాగంగా మియాను కలిశాడు. ఇప్పటికే హాలీవుడ్‌లో గాల్ గడోట్ వంటి ఎంతోమంది సినీ ప్రముఖులకు హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరించిన అతను ఈ చిన్నారికి వేసిన ఓ హెయిర్ స్టైల్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరితోనూ పంచుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే దానికి ఎక్కువ సంఖ్యలో లైక్స్ రావడంతో పాటు చిన్నారి కేశ సౌందర్యంపై కూడా మంచి వ్యాఖ్యలు కూడా రావడంతో మియా తల్లిదండ్రులు ఆమెకోసం ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించారు. అందులో మియా రకరకాల హెయిర్‌స్టైల్ ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. జుట్టున్నమ్మ ఏ కొప్పైనా కట్టగలదు అన్నట్లు ఈ చిన్నారి ఎటువంటి హెయిర్‌స్టైల్ వేసుకున్నా స్టైలిష్‌గా, ట్రెండీగా, ముద్దుగా కనిపిస్తుంది. అందుకే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అతి తక్కువ సమయంలోనే ఈ చిన్నారి ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఎంతోమంది నెటిజన్లు మియా కేశసౌందర్యానికి ఫిదా అయిపోయారు. ఫలితంగా కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే డెబ్భైవేల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత అందమైన శిరోజాలు కలిగిన చిన్నారి అంటూ మియాకు పట్టం కట్టింది వోగ్ పత్రిక.
అందరూ మియా హెయిర్ స్టైల్స్ చూసి మురిసిపోతుంటే.. కొందరు మాత్రం మోడలింగ్, అందం పేరిట ఆ చిన్నారి బాల్యాన్ని చిదిమేస్తున్నారంటూ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫొటోలు పోస్ట్ చేయడం ఆపేశారు. కానీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అయిన సాగి మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మియా ఫొటోలను మాత్రం షేర్ చేయసాగాడు. అలా సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొన్ని ఫొటోలు మియాను ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా మార్చేశాయి. ఆమె జుట్టే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. నిండా ఐదేళ్లు లేని ఈ చిన్నారికి డెబ్భై మంది ఫాలోవర్లు ఉన్నారంటే మాటలా!? అలా మియా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది మియా. అందుకే హెయిర్‌స్టైలిస్ట్ సాగి మాత్రం మియాను 3ప్రినె్సస్ మియా2 అని పిలుస్తాడట.. ఎందుకంటే హెయిర్‌స్టైల్ చేసేటప్పుడు పెద్దవాళ్లే కదులుతూ ఉంటారు. కానీ మియా మాత్రం ఎలాంటి విసుగు, చికాకులు లేకుండా చాలా సహనంగా, ఓపిగ్గా కూర్చుని ఉంటుందట.. పైగా ఎవరు పలుకరించినా చక్కగా, అందంగా నవ్వుతుందట.. మరి.. ఇంత చక్కటి ముఖారవిందం, ఆకర్షించే కళ్లు, దానిమ్మగింజల్లాంటి పళ్లు, అందమైన కురులు.. ఉన్నవారు అందంగా ఉండకుండా ఎలా ఉంటారు? మీరే చెప్పండి..!

-ఉమా మహేశ్వరి