సబ్ ఫీచర్

జ్ఞానభిక్షపెట్టిన నారాయణ తీర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భార్యను చూడాలన్న తలంపుతో గింజుపల్లె దగ్గరగా వచ్చాడు గోవిందశాస్ర్తీ. మధ్యలో కృష్ణానది దాటాలి. అయితే అతడా ప్రాంతానికి చేరుకున్న సమయంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తూండటంతో నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. గోవిందశాస్ర్తీకి ఎంత ఎదురుచూసినా వాన, ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. చివరికా మహాప్రవాహాన్ని ఈదడానికే నిశ్చయించుకున్నాడు. నదిలోకి దిగాడన్న మాటేగాని ఆ మహాప్రవాహంలో ఈదుకెళ్లడం శాస్ర్తీకి సాధ్యం కాలేదు. శక్తి చాలక ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. ఇక లాభం లేదనుకుని వెంటనే ప్రోషోచ్ఛారణ చేసి మానసికంగా సన్యాసి అయ్యాడు. దాంతో సునాయాసంగా నది అవతలి వడ్డుకు చేరాడు. జరిగిన విషయం భార్యకు తెలిపి అపుడు శాస్త్ర ప్రకారం సన్యాసం స్వీకరించాడు. ఆ విధంగా వనంలోనే సన్యాసి అరున గోవింద శాస్త్రే నేటి నారాయణ తీర్థులు. కూచిపూడి నాట్యానికి మూలపురుషుడైన సిద్ధేంద్రుని గురువే ఈ నారాయణ తీర్థులు. ‘ఏక వాక్యముగ నిర్గుణముల బోధించు ధీశక్తి’ శంకరుని తర్వాత నారాయణ తీర్థులకే ఉందని కాశీ పండితులు నారాయణ తీర్థులని ప్రశంసించారు. ఆంధ్ర మహేశ్వర తీర్థులు, కాశ్మీర సదానంద కవి, గీత బ్రహ్మానంద మొదలగు ఉద్దండ పండితులకే ఈ తీర్థులు గురువుగా ఉండేవారు. కొనే్నళ్ళ తర్వాత నారాయణ తీర్థులు కాశీ నుండి తీర్థయాత్రలకు బయలుదేరాడు. తను దర్శించిన తీర్థాలు మహత్మ్యాలను తెలుపుతూ అనేక గ్రంథాలు వ్రాశారు.
వాటిలో రామనామ సదృశము ‘గంగ’గా, కృష్ణనామ సదృశము ‘యమున’గా, అంతర్వాహినియైన ‘సరస్వతి’ గోవింద నామంగా స్ఫురింపజేస్తూ రాసిన ‘రామకృష్ణ గోవిందేతి - నామ సంప్రయోణీ’ అనే గ్రంథం, శ్రీకృష్ణలీలా తరంగిణి పేరుతో వ్రాసిన యక్షనగాన గ్రంథం ఎంతో ప్రసిద్ధమైనవిగా చెబుతారు. అలా తీర్థయాత్రలు చేస్తూనే ఆయన తిరసందుర్తి నది వద్దకు చేరుకున్నారు. నది సమీపంలో ఉన్న మామిడిచెట్టు క్రింద తపస్సు చేసి ముక్తికి మూలమైన జ్ఞానాన్ని ఆర్జించారు. తన శిష్యులైన వారందరికీ జ్ఞానభిక్ష పెట్టి- జ్ఞాన భాస్కరుడిగా నారాయణతీర్థులు పేరుపొందారు.

-డి.ఆర్.లత