సబ్ ఫీచర్

అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కలు పెంచుకోవడం చాలామందికి ఇష్టమైన పనే. ఇప్పుడైతే ప్రభుత్వం కూడా మొక్కల పెంపకం పట్ల ఆసక్తి చూపుతోంది. ఇంట్లో అదీ అపార్ట్‌మెంట్స్‌లో మొక్కలు పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే మీరు అనుకొన్నదానికన్నా ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు.
కొన్ని మొక్కలకు అతి ఎండ పనికిరాదు. అట్లాంటి వాటిని టెర్రస్‌పైన పెట్టేసి ఉంచితే ఆ ఎండకు అవి మాడి మసి అయిపోతాయి. శ్రమ అంతా వృథా అయిపోతుంది. నేలలో అయితే రోజుకు ఒక్కసారి నీరు పోసినా ఫర్వాలేదు. కానీ కుండీల్లో పెంచుకునేటపుడు మొక్కలనుబట్టి నీరు రెండు పూటలా పోసుకోవాల్సి ఉంటుంది.
కూరగాయల మొక్కలు కూడా కుండీల్లో పెంచుకుంటున్నాం ఇపుడు. వీటిని కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఇవి పెరిగే మట్టిలో కొన్ని క్రిమి సంహారక మందులు, కొన్ని మొక్కలకు బలానిచ్చే ఔషధాలు కూడా వేయాల్సి ఉంటుంది. అంతేకాక కుండీల్లో మట్టిని అవసరాన్ని బట్టి మార్చాల్సి ఉంటుంది. మొక్కల వేర్లు కూడా కొన్ని కత్తిరించడమో లేక పెద్ద కుండీల్లోకి మార్చడమో చేయాల్సి కూడా వస్తుంటుంది.
పూల మొక్కల విషయంలో అయితే సీజన్‌బట్టి మొక్కలు పెంచుకుంటే సదా పూలు పూస్తుంటాయి. అట్లాకాక ఏదో ఒక పూలమొక్కలు కుండీల్లో పెంచుకుని వాటికి రోజూ పూలు పూయాలి అంటే మాత్రం కుదరని పని అవుతుంది. ఏ సీజన్‌లో పూలమొక్కలు ఆ సీజన్‌లోపెంచడం వల్ల మట్టి కూడా మంచి సారవంతంగా తయారు అవుతుంది.
కంపోస్టు ఎరువును ఇంట్లో తయారు చేసుకొని కుండీల్లో మొక్కలు వేసుకుంటూ ఉంటే మొక్కలు అనుకొన్నవిధంగా పెరుగుతాయి.
కొత్తిమీర, పుదీనా, మెంతి మొక్కలు పెంచుకుంటే వాటిని అప్పటికప్పుడు వాడుకుంటే మంచి తాజాకూరగాయలు తిన్నట్టు కూడా అవుతుంది. పచ్చిమిరప చెట్లను రెండు పెంచుకున్నా ఒక కుటుంబానికి పచ్చి మిర్చి కొనాల్సిన అవసరం అంతగా ఉండదు. ఇలా అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు పెంచుకుంటే పెంచుకున్న ఆనందంతో పాటుగా తాజా కూరగాయలు తినే సౌకర్యం కూడా కలుగుతుంది.
ఏ మొక్కలు పెంచుకోవాలి అనే విషయంలో కాస్త ఆలోచించి నర్సరీలల్లో మొక్కల వివరాలను అడిగి తెలుసుకొని మరీ పెంచుకుంటే అనుకొన్న ఫలితాలను రాబట్టుకోవచ్చు.

- జంగం శ్రీనివాసులు